బంగారు పతకం
బంగారు పతకం, అనేది ఏదైనా పోటీలో ప్రధమ స్థానం సాధించినప్పుడు గెలిచిన వ్యక్తి లేదా జట్టుకు గౌరవసూచకంగా ఒక గుర్తుగా ప్రభుత్వం లేదా ఏదైనా సంస్థ ద్వారా బహుమతిగా బంగారంతో చేసిన, లేదా కప్పబడిన గుండ్రని బిళ్ల లేదా చక్రం ఆకారంతో ఇవ్వబడిన బహుమతిని బంగారు పతకం అని అంటారు.[1]దీనిని ఏ రంగంలోనైనా అసాధారణరీతిలో అత్యధిక విజయాలు సాధించినందుకు ప్రభుత్వం, లేదా సంస్థ గుర్తించి, గౌరవ సూచికంగా ఒక బహుమతిగా ఇస్తుంటారు. దీని తయారీలో పూర్తిగా బంగారం,లేదా మిశ్రమం,పూత ద్వారా కొంత బంగారాన్ని ఉపయోగించటం వలన దీనికి ఈ పేరు వచ్చింది. మరికొందరు అవార్డు ప్రతిష్ట మాత్రమే అందిస్తారు. అనేక సంస్థలు ఇప్పుడు వివిధ విద్యా సంస్థలతో సహా అసాధారణంగా బంగారు పతకాలను ప్రదానం చేస్తున్నాయి.నోబెల్ బహుమతి పతకాలలో 24 క్యారెట్ల బంగారంతో 18 క్యారెట్ల ఆకుపచ్చ బంగారం పూత ఉంటుంది.1980 కి ముందు నోబెల్ బహుమతి పతకాలలో 23 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడ్డాయి
సైనికులకు ప్రధానం చేసే బంగారు పతకాలుసవరించు
ప్రస్తుత సైనిక పురష్కారాలకు ముందు మెడల్ ఆఫ్ అనర్, విశేషమైన లేదా ముఖ్యమైన సైనికుడు,జాతీయ గుర్తింపు పొందిన సైనికుడు అనే అర్థాలు వచ్చేట్లు ప్రత్యేకంగా సృష్టించబడిన పతకాలు ఇచ్చే పద్ధతి ఉండేది.యునైటెడ్ స్టేట్స్లో, ప్రతిభకలిగిన అటువంటి భాధ్యులు కమాండింగు అధికారికి బంగారు పతకం,అతని ఇతర అధికారులుకు వెండి పతకాలు అందించవలసిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడిని కోరుతూ ఒక తీర్మానం చేస్తుంది.దాని ప్రకారం కమాండింగ్ అధికారికి బంగారు పతకం, అతని అధికారులు వెండి పతకాలు అందుకుంటారు.[2]18 వ శతాబ్దం నుంచే రాయల్ డేనిష్ అకాడమీ వారు కళల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి బంగారు పతకం బహుకరించడం ప్రారంభమైంది. చాలా వరకు బంగారు పతకాలు అచ్చమైన బంగారంతో తయారు చేస్తే, కొన్ని బంగారు పూత పూసినవి ఉంటాయి. బంగారు పూత పూసిన వాటికి ఉదాహరణలు ఒలంపిక్ పతకాలు, లోరెంట్జ్ పతకం, అమెరికా కాంగ్రెషన్ గోల్డ్ మెడల్, నోబెల్ పతకంలాంటివి. నోబెల్ పతకం 18 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడి 23 క్యారెట్ల బంగారంతో పూత వేయబడి ఉంటుంది.1980 కు ముందు ఈ పతకాలన్నీ 23 క్యారట్ల బంగారంతో తయారు చేసేవారు.
బంగారు పతకాలు పొందిన భారతీయులుసవరించు
- పి.టి.ఉష: 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలు పొందింది.
- కరణం మల్లేశ్వరి: 1995 - ఘుంగ్జౌ, చైనా - 54 కిలోల విభాగంలో మూడు బంగారు పతకాలు
- కుంజరాణి దేవి: 2006 మెల్బోర్న్లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో 48 కిలోల విభాగంలో బంగారుపతకాన్ని గెలుచుకుంది
- గగన్ నారంగ్: హైదరాబాదుకు చెందిన షూటింగ్ క్రీడాకారుడు.2003లో హైదరాబాదులో జరిగిన ఆఫ్రో-ఏషియన్ క్రీడలలో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణపతకం సాధించాడు.ఇది భారతదేశం తరుపున పొందిన మొదటి బంగారు పతకం.[3]
మూలాలుసవరించు
- ↑ "GOLD MEDAL | meaning in the Cambridge English Dictionary". dictionary.cambridge.org (in ఇంగ్లీష్). Retrieved 2020-07-17.
- ↑ "Book 21 Medals". web.archive.org. 2004-11-06. Archived from the original on 2004-11-06. Retrieved 2020-07-17.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Gagan Narang wins India's first gold". www.rediff.com. Retrieved 2020-07-17.