అశ్విన్ యాదవ్

తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

అశ్విన్ యాదవ్, (1987 సెప్టెంబరు 10 - 2021 ఏప్రిల్ 24) తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఫాస్ట్ బౌలర్‌గా మంచి గుర్తింపు సాధించిన అశ్విన్ 2007 - 2009 మధ్యకాలంతో హైదరాబాదు క్రికెట్ జట్టు తరపున పద్నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1] రెండు టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు.

అశ్విన్ యాదవ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1987-09-10)1987 సెప్టెంబరు 10
హైదరాబాదు, తెలంగాణ
మరణించిన తేదీ2021 ఏప్రిల్ 24(2021-04-24) (వయసు 33)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007-2010హైదరాబాదు క్రికెట్ టీం
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్-క్లాస్ లిస్టు-ఎ ట్వంటి20
మ్యాచ్‌లు 14 10 2
చేసిన పరుగులు 120 17 -
బ్యాటింగు సగటు 9.23 8.50 -
100s/50s 0/0 0/0 -/-
అత్యధిక స్కోరు 28* 7* -
వేసిన బంతులు 2,013 360 30
వికెట్లు 34 4 3
బౌలింగు సగటు 32.70 91.50 11.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/52 2/50 2/20
క్యాచ్‌లు/స్టంపింగులు 2/0 3/0 0/0
మూలం: ESPNcricinfo, 20 జూలై 2018

అశ్విన్ యాదవ్ 1987, సెప్టెంబరు 10న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించాడు.

క్రికెట్ రంగం

మార్చు

సెయింట్ జాన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్‌లో చేరిన తర్వాత సెయింట్ ఆండ్రూస్ స్కూల్‌లో ఆడుతున్నప్పుడు యాదవ్ జూనియర్ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. 2002లో సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్ర అండర్-14 జట్టు తరఫున 25 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[2] 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 34 వికెట్లు సాధించాడు. 2008-09 సీజన్‌లో ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగులకే 6 వికెట్లు తీశాడు. 2009లో రంజీల్లో ముంబై క్రికెట్ జట్టుతో చివరిసారిగా ఆడాడు. ఆ తరువాత లోకల్‌ లీగ్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఆడాడు.[3]

ఫస్ట్-క్లాస్

మార్చు

2007, నవంబరు 15 నుండి 18 వరకు మొహాలీలో పంజాబ్‌ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[4] 2009 డిసెంబరు 1 నుండి 4 వరకు హైదరాబాదు నగరంలో ముంబై క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[5]

లిస్టు-ఎ

మార్చు

2008, ఫిబ్రవరి 26న చెన్నైలో కేరళ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[6] 2010 ఫిబ్రవరి 16న చెన్నైలో కర్ణాటక క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[7]

ట్వంటీ20

మార్చు

2010, అక్టోబరు 18న హైదరాబాదులో గోవా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ట్వంటీ20 క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[8] ఆ మరుసటిరోజు అనగా, 2010 అక్టోబరు 19న హైదరాబాదులో కర్ణాటక క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[9]

అశ్విన్ యాదవ్ 2021 ఏప్రిల్ 24న తన 33 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు. అశ్విన్ యాదవ్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.[2]

మూలాలు

మార్చు
  1. "Ashwin Yadav". ESPN Cricinfo. Archived from the original on 2021-04-25. Retrieved 2022-06-26.
  2. 2.0 2.1 "Hyderabad fast bowler Ashwin Yadav dies of heart attack". Telangana Today. Archived from the original on 2022-02-13. Retrieved 2022-06-26.
  3. "Ashwin Yadav: హైదరాబాద్ మాజీ క్రికెటర్ అశ్విన్ యాదవ్ మృతి.. 33 ఏళ్ల వయసులోనే." News18 Telugu. 2021-04-24. Archived from the original on 2022-06-26. Retrieved 2022-06-26.
  4. "Full Scorecard of Hyderabad vs Punjab Group B 2007/08 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-12-25. Retrieved 2022-06-26.
  5. "Full Scorecard of Hyderabad vs Mumbai Group A 2009/10 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-12-25. Retrieved 2022-06-26.
  6. "Full Scorecard of Kerala vs Hyderabad South Zone 2007/08 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-12-25. Retrieved 2022-06-26.
  7. "Full Scorecard of Karnataka vs Hyderabad South Zone 2009/10 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-12-25. Retrieved 2022-06-26.
  8. "Full Scorecard of Hyderabad vs Goa South Zone 2010/11 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-12-25. Retrieved 2022-06-26.
  9. "Full Scorecard of Hyderabad vs Karnataka South Zone 2010/11 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-12-25. Retrieved 2022-06-26.

బయటి లింకులు

మార్చు