ఉప్పల్ ఖల్సా

తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని గ్రామం

ఉప్పల్ ఖల్సా లేదా ఉప్పల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని గ్రామం,[1]

ఉప్పల్
ఉప్పల్ కమాన్
ఉప్పల్ కమాన్ విహంగ వీక్షణ
ఉప్పల్ కమాన్ విహంగ వీక్షణ
ఉప్పల్ is located in Telangana
ఉప్పల్
ఉప్పల్
తెలంగాణ పటంలో ఉప్పల్ స్థానం
ఉప్పల్ is located in India
ఉప్పల్
ఉప్పల్
ఉప్పల్ (India)
Coordinates: 17°23′N 78°33′E / 17.38°N 78.55°E / 17.38; 78.55
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్
నగరంఉప్పల్
Elevation
455 మీ (1,493 అ.)
భాష
 • అధికారకతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
500 039
ప్రాంతీయ ఫోన్‌కోడ్91 040
Vehicle registrationTS-08

ఇది పురపాలక సంఘం హాదా కలిగి ఉంది.ఉప్పల్ ఒక పురాతనమైన గ్రామం.

గ్రామ జనాభా సవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,84,835 - పురుషులు 1,95,649 - స్త్రీలు 1,89,186.పిన్ కొడ్:500039.

ప్రముఖ సంస్థలు సవరించు

  • హైదరాబాదు ప్రజా పాఠశాల, రామంతాపూర్
  • లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల.
  • రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.
  • పెద్ద ఉప్పల్ లో సా.శ.నాలుగువందల సంవత్సరాలనాటి రామాలయం ఉంది. ఇది అతి పురతానమైనది.
  • జెన్పపక్త్ లాంటి బహుళ జాతి కార్యాలయము ఉంది.
  • ఈ గ్రామం 2009 ఎన్నికలలో శాసనసభ నియోజకవర్గము అయింది.
  • ఉప్పల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కూరగాయల విక్రయశాల పురాతనమైనవి.

మండలంలోని పట్టణాలు సవరించు

ఉప్పల్ కలాన్, ఉప్పల్ ఖల్సా, ఉప్పల్ బాగాయత్

రవాణా సవరించు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉప్పల్ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు సిటీ బస్సు సర్వీసులు నడుపబడుతున్నాయి. ఇక్కడ ఉప్పల్ మెట్రో స్టేషను కూడా ఉంది.

ఫ్లైఓవర్ థీమ్ పార్క్ సవరించు

ఉప్పల్‌ జంక్షన్ లో రూ. 450 కోట్లతో ఏర్పాటచేసిన ఫ్లైఓవర్ థీమ్ పార్క్ ను 2022 మార్చి 11న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్మిక శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఇత ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[2][3][4]

స్కైవాక్‌ సవరించు

అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్‌ జంక్షన్‌లో పాదచారుల భద్రతకు శాశ్వత భరోసా కల్పిస్తూ హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 25 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కైవాక్‌ నిర్మించబడుతోంది.

మూలాలు సవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. telugu, NT News (2022-03-11). "వ‌చ్చే నెల నుంచి కొత్త పెన్ష‌న్లు : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-03-11. Retrieved 2022-03-11.
  3. telugu, 10tv (2022-03-11). "KTR: ఉప్పల్‌లో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన | Uppal Development programs started by Minister KTR". 10TV (in telugu). Archived from the original on 2022-03-11. Retrieved 2022-03-11.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  4. Web, Disha (2022-03-11). "ఉప్పల్‌లో కేటీఆర్ కీలక ప్రకటన.. వారందరికి గుడ్ న్యూస్." dishadaily.com. Archived from the original on 2022-03-11. Retrieved 2022-03-11.

వెలుపలి లింకులు సవరించు