మొహాలీ
మొహాలీ, ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరం. [1] ఇది పంజాబ్ రాష్ట్రం మొహాలీ జిల్లాలో ఉంది. ఇది ఈ జిల్లాకు ముఖ్య పట్టణం కూడా. అధికారికంగా ఈ నగరాన్ని సాహిబ్‌జాదా అజిత్ సింగ్ నగర్ అని పిలుస్తారు. గురు గోవింద్ సింగ్ పెద్ద కుమారుడైన సాహిబ్జాదా అజిత్ సింగ్ పేరిట ఈ పేరు పెట్టారు. చండీగఢ్కు నైరుతిలో ఉన్న మొహాలీ ఒక వాణిజ్య కేంద్రం. రాష్ట్రంలోని ఆరు మునిసిపల్ కార్పొరేషన్లలో ఒకటి.
మొహాలీ
సాహిబ్‌జాదా అజిత్ సింగ్ నగర్ | |||||
---|---|---|---|---|---|
నగరం | |||||
| |||||
Coordinates: 30°47′N 76°41′E / 30.78°N 76.69°E | |||||
దేశం | India | ||||
రాష్ట్రం | పంజాబ్ | ||||
జిల్లా | మొహాలీ | ||||
స్థాపన | 1966 నవంబరు 1 | ||||
Named for | సాహిబ్‌జాదా అజిత్ సింగ్ | ||||
Elevation | 316 మీ (1,037 అ.) | ||||
జనాభా (2011) | |||||
• నగరం | 1,46,213 | ||||
• మెట్రో | 1,76,170 | ||||
Time zone | UTC+5:30 (IST) | ||||
పిన్ కోడ్ సంఖ్య | |||||
Vehicle registration | PB-65 | ||||
లింగ నిష్పత్తి | 0.911 | ||||
అక్షరాస్యత | 91.96% (City) 91.86% (Metro) | ||||
Website | http://mcmohali.org/ |
మొహాలీ పంజాబ్ లోనే కాక, ఉత్తర భారతదేశంలోనే అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా అవతరిస్తోంది. రాష్ట్రంలో ఐటి కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. [2] నగరాన్ని పంజాబ్‌లోనే అత్యుత్తమ నివాస యోగ్యమైన ప్రదేశంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నగరంలో క్రికెట్ స్టేడియం, హాకీ స్టేడియం, ఇండోర్ స్టేడియంలు, గోల్ఫ్ కోర్సులతో శాఃఆఆ అనేక అంతర్జాతీయ క్రీడా వేదికలు ఉన్నాయి. చండీగఢ్‌కు, మొహాలీకి ఉమ్మడిగా చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.
గతంలో మొహాలీ రూపానగర్ జిల్లాలో ఒక భాగంగా ఉండేది. 2006 లో నగరం కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేసారు.
నగర రూపకల్పన
మార్చుమొహాలీ, చండీగఢ్ నగరాలు రెండూ కలిసే ఉంటాయి. పంజాబ్ రాష్ట్రానికి, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికీ మధ్య ఉన్న సరిహద్దే ఈ రెండు నగరాలకూ విభజన రేఖ. మొహాలీ నగరానికి ప్రత్యేక ప్రణాళికేమీ లేదు. చండీగఢ్ రహదారి పొడిగింపు, చండీగఢ్ లోని సెక్టార్ డిజైన్ వ్యవస్థలోనే ఒక 800 మీ x 1200 మీ విస్తీర్ణం లోని ప్రాంతమే మొహాలీ అగరంగా రూపొందింది.
మొహాలీ సెక్టార్ డిజైన్ వ్యవస్థ లోని మొదటి 11 రంగాలను (ఫేజెస్) దశలు అని పిలుస్తారు. ప్రారంభ అభివృద్ధి 7 వ దశ వరకు మాత్రమే జరిగింది. 8 వ దశ నుండి ఆ పై అభివృద్ధి 1980 ల చివరలో ప్రారంభమైంది. 1990 ల మధ్యలో, 8 వ దశలో, నగరానికి సొంత బస్ స్టాండు వచ్చింది. 48, 51, 52, 54, 56 వంటి కొన్ని సెక్టార్లు చండీగఢ్, మొహాలీ రెండు నగరాల్లోకీ విస్తరించాయి. వాస్తవానికి ఇవన్నీమొహాలీ నగర్ ప్రాంతంలోకే వస్తాయి.
గొప్ప పెట్టుబడి అవకాశాలను అందిస్తూ మొహాలీ, అవుట్‌సోర్సింగ్ ఐటి కంపెనీలను ఆకర్షిస్తోంది. [2]
ట్రైసిటీ
మార్చుమొహాలీ, పంచకుల రెండూ చండీగఢ్ కు ఉపగ్రహ నగరాలు. ఈ మూడు నగరాలనూ కలిపి సమష్టిగా చండీగఢ్ ట్రైసిటీ అంటారు. పంచకుల, చండీగఢ్‌ను ఆనుకుని, హర్యానా లోని పంచకుల జిల్లాలో ఉన్న ప్రణాళికాబద్ధ నగరం. [3]
జనాభా
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం, మొహాలీ పట్టణ సముదాయము (మెట్రోపాలిటన్ ప్రాంతం) జనాభా 1,76,170. అందులో పురుషులు 92,301, స్త్రీలు 83,869. అక్షరాస్యత 91.96%. [4] మొహాలీ లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 909 మంది మహిళలు.
మొహాలీలో 51.53% మంది ప్రజలతో సిక్కు మతం మెజారిటీ మతంగా ఉంది. దీని తరువాత హిందూమతం 45.55% మందితో రెండవ స్థానంలో ఉంది. ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధులు, జైనులు, ఇతరులు కూడా ఉన్నారు.
క్రీడలు
మార్చుఫీల్డ్ హాకీ, క్రికెట్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ మొదలైన క్రీడలకు అవసరమైన సౌకర్యాలు అందించే 8 బహుళార్ధసాధక క్రీడా సముదాయాలతో మొహాలీ, పంజాబ్ క్రీడా కేంద్రంగా అవతరించింది. ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంది. దీనికి తోడుగా ముల్లన్పూర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడ రాబోతోంది . మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియం కూడా ఇక్కడ ఉంది.
క్రికెట్
మార్చుపంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పిసిఎ) ఒక ప్రత్యేకమైన ప్రాక్టీస్ మైదానంతో 25 కోట్ల ఖర్చుతో అత్యాధునిక సదుపాయాన్ని నిర్మించింది. ఈత కొలను, హెల్త్ క్లబ్, టెన్నిస్ కోర్ట్, లైబ్రరీ, రెస్టారెంట్, బార్, అవుట్డోర్ & ఇండోర్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ వంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి
పిసిఎ స్టేడియం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ఐపిఎల్ మొహాలీ ఫ్రాంచైజీ) కు స్వంత స్థావరం.
మూలాలు
మార్చు- ↑ "Capt calls Mohali the state capital, invites investment". hindustantimes.com.
- ↑ 2.0 2.1 "Mohali as next big IT hub: 'Mohali among top 10 Indian cities in IT' - Times of India". The Times of India.
- ↑ "Municipal Corporation Mohali". mcmohali.org. Archived from the original on 3 మే 2017. Retrieved 5 January 2020.
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 7 July 2012.
- ↑ "Religion PCA - Mohali". census.gov.in. Retrieved 3 December 2019.