అసర్
ప్రథమ్[1] అనే స్వచ్ఛంద సంస్థ భారతదేశం వ్యాప్తంగా అన్ని జిల్లాలలో గ్రామీణ ప్రదేశాలలో విద్యా ప్రమాణాలపై 2005 నుండి అసర్ (Annual Status of Education Report - ASER) అనబడే వార్షిక సర్వే నిర్వహిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో 2006 నుండి సర్వే జరపబడుతున్నది. విద్యా ప్రమాణ గణాంకాలు, మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది.
విద్యాప్రమాణాల కొలబద్ద
మార్చుచదువుట
మార్చుదీనిలో ఏమి చదవలేకపోవుట, ఆక్షరాలను మాత్రమే చదువుట, పదాలను చదువుట, చిన్న వాక్యాలను చదవగలుగుట (ఒకటవ తరగతి స్థాయి ), చిన్ని వ్యాసాలను చదువగలుగుట (రెండవ తరగతి స్థాయి) విభాగాలున్నాయి.[2]
గణితం
మార్చుఏ అంకె గుర్తించక పోవుట, 1-9 అంకెలను మాత్రమే గుర్తించుట, 10-99 అంకెలను గుర్తించుట, తీసివేత, భాగాహారం చేయుట, సమయం చెప్పటం, డబ్బు లెక్కించుట ముఖ్య విభాగాలు.[3]
అసర్ 2013 నివేదిక
మార్చురాష్ట్రంలోని 21 జిల్లాల్లో 621 గ్రామాలకు వెళ్లి అక్కడి 616 స్కూళ్లలోని 15,841 మంది పిల్లల విద్యాప్రమాణ స్థాయిలను అధ్యయనం చేశారు. జిల్లా విద్యాశిక్షణ సంస్థ (DIETడైట్) లోని 1320 మంది బోధన విద్య విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే నివేదికను 'వార్షిక విద్యాస్థితి (అసర్-2013 ) ' ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.[4] దీని ముఖ్యాంశాలు[5]
- విద్యా ప్రమాణాలు
- 2013లో బడి ఈడు పిల్లల్లో (5-14 సంవత్సరాలు) 97.1 శాతం మంది పాఠశాలలలో నమోదవగా, వారిలో 70 శాతం మందే పాఠశాలలకు హాజరవుతున్నారు.
- రెండో తరగతిలో 11.4 శాతం మంది విద్యార్థులు అసలు అక్షరాలు గుర్తించలేకపోతున్నారు.ఇది 2012లో ఇది 6 శాతం నుండి 2013లో అసాధారణంగా పెరిగింది. పదాలు చదవగలిగే వారు 35.2%, సామాన్యమైన వాక్యాలు చదవగలిగే సామర్థ్యం కలవారు 25.6శాతం మంది.
- ఒకటో తరగతిలో అక్షరాలు గుర్తించలేని వారు 15 % (2012) నుండి 36% (2013) కు పెరిగింది.
- ప్రాథమిక పాఠశాల విద్య పూర్తవుతున్న ప్రతి 10 మంది విద్యార్థుల్లో 6 మందికి భాగాహారం చేయటంతెలియదు.
- మొత్తానికి చదవటం, లెక్కలు చేయడంలో ప్రైవేట్ స్కూళ్ల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల కంటే మెరుగ్గా ఉన్నారు.
- విద్యాహక్కు ప్రకారం సదుపాయాలు
- పాఠశాలల్లో విద్యా హక్కు నిబంధనల అమలులో లోపంవుంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30,, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు వుండవలసిన నిబంధన 45.8 శాతం పాఠశాలల్లో మాత్రమే పాటించబడుతున్నది.
- 55 శాతం పాఠశాలలలో మరుగు దొడ్డి సౌకర్యం ఉంది. 43 శాతం పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది.
- 35 శాతం పాఠశాలలలో తాగునీటి సౌకర్యం లేదు.
- 64 శాతం పాఠశాలలలో ఆట స్థలాలు ఉన్నాయి.
- 48 శాతం పాఠశాలలకు మాత్రమే కంచె ఉంది.
అసర్ 2012 నివేదిక
మార్చుఅసర్ 2012 నివేదిక [6][7] ముఖ్యాంశాలు.
- 6 నుండి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలలో 2.60% శాతం మంది పాఠశాలవెలుపలనే ఉన్నారు. ఈ సంఖ్య 2006లో 4.19%గా ఉంది.
- అంకగణిత సామర్థ్యం గత సంవత్సరంతో పోల్చితే దేశంలో పలుచోట్ల తగ్గినా ఆంధ్రప్రదేశ్ లోతగ్గలేదు.
- ప్రైవేటు పాఠశాలలో పిల్లలనమోదు పెరుగతూవున్నది. రెండవతరగతిలో ప్రైవేటు పాఠశాలలో చదివేపిల్లల శాతం 45.10%గా ఉంది. ఇది 2006 లో 26.23%గా ఉంది. ఇలాగే కొనసాగితే దేశంలో 2018కి 50 శాతం పిల్లలు ప్రైవేటుపాఠశాలలో చదువుతారు. కేరళలో ఇప్పటికే ఇది 60 శాతంపైగా ఉంది.
- ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో చదివేస్థాయి ఫలితాలలో తేడా తగ్గింది.
- 2011 నివేదిక ప్రకారం పాఠశాలలో చదివేపిల్లలలో 30.8 శాతం మంది ఇంటి భాష కాని మాధ్యమంలో చదువుతున్నారు.
వివరమైన పట్టికలు
మార్చుచదవగలిగే స్థాయి
మార్చుఆంధ్రప్రదేశ్ లోని 5-16 సంవత్సరాల వయస్సుగల బడిలో నమోదైన పిల్లల స్థితి [8]
సంవత్సరం | ఏమి చదవలేకపోవుట | అక్షరం | పదం | పేర | కథ | మొత్తం |
---|---|---|---|---|---|---|
3.42% |12.36%| 17.13%| 20.16%| 46.92%| 100.00% | ||||||
6.18% |12.05% |14.18% |12.56% |55.04% |100.00% | ||||||
3.71% |12.23% | 15.43% | 16.09%| 52.55%| 100.00% | ||||||
5.89% |13.57% |14.90% |15.17% |50.47% | 100.00% | ||||||
4.67% | 12.98%| 14.91%| 15.43%| 52.02%| 100.00% | ||||||
4.56% |13.60% |15.76% |15.78% |50.30% |100.00% | ||||||
6.90% |14.10% |15.30%| 13.20%| 50.60%| 100% | ||||||
8.40%| 12.10%| 15.50%| 16.30% |47.70% |100% |
అంకగణితం స్థాయి
మార్చుఆంధ్రప్రదేశ్ లోని 5-16 సంవత్సరాల బడిలో నమోదైన విద్యార్థుల స్థితి
సంవత్సరం | ఏమి గుర్తించ లేకపోవుట | అంకెలు పదిలోపు | అంకెలు 99 లోపు | తీసివేత | భాగహారం | మొత్తం |
---|---|---|---|---|---|---|
4.48% | 9.27%| 26.69%| 24.15%| 35.41%| 100.00% | ||||||
3.26% |9.67%| 24.75%| 25.87%| 36.45%| 100.00% | ||||||
5.02% | 10.92%| 20.82%| 22.24%| 41.00% |100.00% | ||||||
4.02% |10.02% |23.33% | 23.88% |38.76% | 100.00% | ||||||
3.97% |10.13%| 24.58%| 25.66%| 35.66%| 100% | ||||||
3.80%| 9.90%| 23.80%| 25.20%| 37.30%| 100% | ||||||
6.50%| 9.20%| 28% |24.70%| 31.60%| 100% |
పిల్లల బడి నమోదు వివరాలు
మార్చుఆంధ్రప్రదేశ్ లోని 5-16 సంవత్సరాల విద్యార్థుల స్థితి
సంవత్సరం | ప్రభుత్వ | ప్రైవేట్ | ఇతర | నమోదు కాని | మొత్తం |
---|---|---|---|---|---|
75.23% | 18.52% |0.17% |6.08% | 100.00% | |||||
63.90%| 29.32%| 0.46%| 6.32%|100.00% | |||||
67.07% | 27.43%| 0.11%| 5.39% |100.00% | |||||
61.90% | 29.30% | 0.18%| 8.62% |100.00% | |||||
58.65%| 35.56%| 0.31%| 5.48%|100.00% | |||||
60.14% |34.43%| 0.24% | 5.19%|100.00% | |||||
57.80%| 37.20% |0.50%| 4.50%| 100% | |||||
60.20%| 34.80%| 0.40%| 4.60%| 100% |
మూలాలు
మార్చు- ↑ "అసర్ సెంటర్ వెబ్సైట్". Archived from the original on 2014-02-10. Retrieved 2014-01-31.
- ↑ "చదువట పరీక్ష ఉపకరణం" (PDF). అసర్ సెంటర్. Archived from the original (PDF) on 2014-09-20. Retrieved 2014-01-31.
- ↑ "గణిత పరీక్ష ఉపకరణం" (PDF). అసర్ సెంటర్. Archived from the original (PDF) on 2015-04-19. Retrieved 2014-01-31.
- ↑ "Andhra Pradesh Rural 2013" (PDF). అసర్ సెంటర్. 2011-01-15. Archived from the original (PDF) on 2014-01-23. Retrieved 2014-01-31.
- ↑ ఆంధ్రజ్యోతి.కాం, " ఇదేమి అక్షరమో! ముద్రణ, 18-01-2014 07:23 AM
- ↑ "2012 నివేదిక" (PDF). Archived from the original (PDF) on 2015-04-24. Retrieved 2014-01-31.
- ↑ "గ్రామీణ విద్యపై అసర్ నివేదిక....పెరిగిన నమోదు- తరిగిన నాణ్యత". సూర్య. 2013-02-08. Retrieved 2014-01-31.[permanent dead link]
- ↑ "అసర్ దత్తాంశ ప్రశ్న అంతర్జాల పేజి". Archived from the original on 2014-09-05. Retrieved 2014-01-31.