అసుర
చలనచిత్రం
అసుర 2015, జూన్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. కృష్ణ విజయ్ దర్శకత్వంలో నారా రోహిత్, ప్రియా బెనర్జీ, శ్రీవిష్ణు, డా. మల్లేశ్ బలష్టు తదితరులు నటించిన ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందించాడు.[3]
అసుర | |
---|---|
![]() అసుర సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | కృష్ణ విజయ్ |
స్క్రీన్ ప్లే | కృష్ణ విజయ్ |
నిర్మాత | శ్యామ్ దేవభక్తుని, కృష్ణ విజయ్, నారా రోహిత్[1] |
తారాగణం | నారా రోహిత్, ప్రియా బెనర్జీ, శ్రీవిష్ణు, డా. మల్లేశ్ బలష్టు |
ఛాయాగ్రహణం | ఎస్.వి. విశ్వేశ్వర్ |
కూర్పు | ధర్మేంద్ర కాకరాల |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థలు | దేవాస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, కుశాల్ సినిమా, ఆరాన్ మీడియా వర్క్స్ |
విడుదల తేదీ | 2015 జూన్ 5 |
సినిమా నిడివి | 122 నిముషాలు[2] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ సవరించు
ధర్మ (నారా రోహిత్) ఓ నిజాయితీ పరుడైన జైలర్ గా ఉంటూ వృత్తి విషయంలో ఎవరికీ తలొగ్గని, చట్టానికి లోబడి పనిచేసే జైలర్‌గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూంటాడు. కొద్దికాలం తరువాత చార్లీ (రవివర్మ) అనే ఉరిశిక్ష పడిన క్రిమినల్ ధర్మ జైలులోకి వస్తాడు. తన క్రిమినల్ అలోచనలతో జైలు నుంచి తప్పించుకోవడానికి చార్లీ ప్లాన్ వేస్తాడు. ధర్మకు ఈ విషయం ఎలా తెలుస్తుంది? చార్లీ జైలు నుంచి తప్పించుకోకుండా ధర్మ ఏం ప్లాన్ చేశాడు? చివరకు ఏమైంది?అనేది మిగతా కథ.
నటవర్గం సవరించు
- నారా రోహిత్ (ధర్మతేజ)
- ప్రియా బెనర్జీ (హారిక)
- రవివర్మ (చంద్రశేఖర్ "చార్లీ")
- మధుసూధన్ రావు (ముత్యమన్న)
- సత్యదేవ్ కంచరాన (దయా)
- డా. మల్లేశ్ బలష్టు
- భాను
- రూప దేవి
- వెన్నెల రామారావు
- శ్రీవిష్ణు (అతిథి పాత్ర)
సాంకేతికవర్గం సవరించు
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణ విజయ్
- నిర్మాత: శ్యామ్ దేవభక్తుని, కృష్ణ విజయ్, నారా రోహిత్
- సంగీతం: సాయి కార్తిక్
- ఛాయాగ్రహణం: ఎస్.వి. విశ్వేశ్వర్
- కూర్పు: ధర్మేంద్ర కాకరాల
- నిర్మాణ సంస్థ: దేవాస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, కుశాల్ సినిమా, అరన్ మీడియా వర్క్స్
పాటలు సవరించు
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "పోటెత్తిన తూర్పు (రచన: వశిష్ఠ శర్మ)" | సాయి కార్తీక్, ఎన్. సి. కారుణ్య | 3:25 | ||||||
2. | "పేరు తెలియని (రచన: కృష్ణ కాంత్)" | హేమచంద్ర, దివిజ కార్తీక్ | 3:51 | ||||||
3. | "యుద్ధం చేయరా (రచన: వశిష్ఠ శర్మ)" | ఎం.ఎల్.ఆర్. కార్తీకేయన్ | 2:50 | ||||||
4. | "నీ తలపే (రచన: సుబ్బరాయశర్మ)" | సాయిచరణ్ భాస్కరుని | 2:22 | ||||||
5. | "సుకుమార (రచన: కృష్ణ కాంత్)" | శ్రావణ భార్గవి, లోకేష్ | 3:01 | ||||||
15:29 |
ఇతర వివరాలు సవరించు
మూలాలు సవరించు
- ↑ "Nara Rohiths Asura release date confirmed". indiaglitz.com. 25 May 2015. Retrieved 5 July 2019.
- ↑ 2.0 2.1 "Nara Rohith's Asura gets 'U/A'". 123telugu. Retrieved 5 July 2019.
- ↑ "Nara Rohith Asura new audio launch on 14th". indiaglitz.com. 12 May 2015. Retrieved 5 July 2019.
- ↑ "I've got my money, says Nara Rohith". timesofindia.indiatimes.com. 19 Jun 2015. Retrieved 5 July 2019.
- ↑ "Asura jeevi review". idlebrain.com. Archived from the original on 2019-07-15. Retrieved 5 July 2019.
- ↑ "Review : Asura – Unique Action Thriller". 123telugu.com. Retrieved 5 July 2019.