శ్రీవిష్ణు (నటుడు)

నటుడు
(శ్రీవిష్ణు(నటుడు) నుండి దారిమార్పు చెందింది)

శ్రీ విష్ణు ఒక తెలుగు నటుడు. అతను బాణం, సోలో లో కొన్ని చిన్న పాత్రలతో నటుడిగా పరిచయమయ్యాడు. 2013లో ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రంలో 'రాయల్ రాజు'గా తరువాత సంవత్సరం సెకండ్ హ్యండ్ చిత్రం, 2016లో అప్పట్లో ఒకడుండేవాడు తో మంచి గుర్తింపు పొందాడు.[1]

శ్రీవిష్ణు
2019 లో శ్రీ విష్ణు
జననం (1985-08-30) 1985 ఆగస్టు 30 (వయసు 38)
విశాఖపట్నం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2012–నేటి వరకు
జీవిత భాగస్వామిప్రశాంతి

వ్యక్తిగత జీవితం మార్చు

శ్రీవిష్ణు విశాఖపట్నం లో చదివాడు. విశాఖపట్నం గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్ పట్టా పొందాడు. కాలేజీలో శ్రీవిష్ణు నాటకబృందంలో సభ్యుడు. క్రికెట్ అంటే కూడా అతనికి ఆసక్తి. యువకుడిగా ఉన్నప్పుడు అతను ఆంధ్ర ప్రదేశ్ అండర్ -19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.[1]

నటుడిగా మార్చు

బాణం, సోలో లో కొన్ని చిన్న పాత్రలతో నటుడిగా పరిచయమయ్యాడు. 2013 లో, ప్రేమా ఇష్క్ కాదల్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించటానికి దర్శకుడు పవన్ సాదినేనిని కలుసుకున్నాడు. 2014 లో నారా రోహిత్ నటించిన ప్రతినిథి సినిమాలో ఒక హోం మంత్రి కుమారుడిగా నటించారు.

కొన్ని చిన్న పాత్రలలో నటించిన తరువాత, 2016 లో అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు.

నటించిన చిత్రాలు మార్చు

సంవత్సరం చలన చిత్రం పాత్ర దర్శకుడు గమనిక
2009 బాణం
2011 సోలో గౌతమ్ స్నేహితుడు పరశురామ్
2012 కాదల్ సొదప్పువది ఎప్పిడి రూపేష్ తమిళ చిత్రం
లవ్ ఫెయిల్యూర్
నా ఇష్టం గణేష్ స్నేహితుడు
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అశొక్
2013 ప్రేమ ఇష్క్ కాదల్ రయల్ రాజు పవన్ సాదినేని
సెకండ్‌ హ్యాండ్‌ చైతన్య కిషోర్ తిరుమల
ఒక్కడినే శైలజ సోదరుడు
2014 ప్రతినిధి శ్రీకర్ ప్రశాంత్ మండవ
2015 సన్నాఫ్ సత్యమూర్తి విరాజ్ ఆనంద్ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
అసుర అతిది పాత్ర
2016 అప్పట్లో ఒకడుండేవాడు రైల్వే రాజు సాగర్ కె.చంద్ర
జయమ్ము నిశ్చయమ్మురా కాంతా రావు కనుమూరి శివ రాజ్
2017 మా అబ్బాయి[2] వట్టి కుమార్
ఉన్నది ఒకటే జిందగీ వాసు తిరుమల కిషోర్
మెంటల్ మదిలో అరవింద్ కృష్ణ వివేక్ ఆత్రేయ
2018 నీదీ నాదీ ఒకే కథ సాగర్‌ వేణు ఊడుగుల
వీర భోగ వసంత రాయలు వీర భోగ వసంత రాయలు/ నిఖిల్ ఆర్. ఇంద్రసేన
2019 బ్రోచేవారెవరురా రాహుల్
తిప్పరా మీసం మణిశంకర్
2021 గాలి సంపత్ సూరి
రాజ రాజ చోర భాస్కర్
అర్జున ఫల్గుణ అర్జున
2022 భళా తందనానా చంద్ర [3]
అల్లూరి ఎస్.ఐ. అల్లూరి సీత రామరాజు
2023 సామజవరగమన
2024 ఓం భీమ్‌ బుష్‌ [4]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Interview with Sree Vishnu about 'Appatlo Okadundevadu by Maya Nelluri". Idlebrain.com. 28 December 2016.
  2. "Maa Abbayi Review {1.5/5}: With barely anything positive in this movie, Maa Abbayi doesn't even pass off as a one-time watch". The Times of India.
  3. "Sree Vishnu, Catherine Tresa's Bhala Thandanana goes on floors". The Times of India. 7 April 2021.
  4. Eenadu (24 February 2024). "శ్రీవిష్ణు చిత్రం... 'ఓం భీమ్‌ బుష్‌'". Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.