అసెంబ్లీ రౌడీ

1991 సినిమా

అసెంబ్లీ రౌడీ 1991 లో బి. గోపాల్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో మోహన్ బాబు, దివ్యభారతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మంచి ప్రజాదరణ పొంది మోహన్ బాబుకు కలెక్షిన్ కింగ్ అనే బిరుదును సాధించి పెట్టింది. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు .

అసెంబ్లీరౌడీ
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.గోపాల్
తారాగణం మోహన్ బాబు ,
దివ్య భారతి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు

శివాజీ (మోహన్ బాబు) డిగ్రీ పూర్తి చేసుకుని అల్లరి చిల్లరగా తిరిగే యువకుడు. అతని తండ్రి (జగ్గయ్య) అదే ఊర్లో ఒక ఉపాధ్యాయుడు. ఆయనకు కొడుకు అలా ఊరికే ఉండటం నచ్చదు. పూజ (దివ్యభారతి) అదే ఊర్లో పనిచేసే మరో ఉపాధ్యాయుడి (గొల్లపూడి మారుతీ రావు) కూతురు. శివాజీ ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు.

ఊర్లో దాదాగిరీ చెలాయించే బాషా అనే రౌడీ ఒక హత్య చేస్తుండగా శివాజీ చూస్తాడు. శివాజీ ఆ రౌడీ ని ఎదుర్కోవడానికి పోతుండగా తల్లి వారించి ఇంటికి తీసుకొస్తుంది. ఈ విషయం తెలిసినా తండ్రి కుటుంబం బాగోగులు చూడని నువ్వు దేశాన్ని ఉద్దరించడానికి బయలు దేరావా, నీ కష్టం తో ఏనాడైనా మాకు కట్టుకునే ఒక జత బట్టలు తీసుకరాగలవా, ముందు పనివెతుక్కో అంటూ తిట్టిపోస్తాడు.మరో రోజు ఆ గొడవలో తన తల్లి తలకు గాయం అవుతుంది. దాంతో . బాషా శివాజీ మీద కక్షతో అతన్ని ఓ నేరం మీద జైలుకి పంపిస్తాడు. శివాజీ తల్లిదండ్రులు అతన్ని కేసునుంచి బయట పడేయటానికి ఊర్లో వాళ్ళనెవరైనా సాక్ష్యం చెప్పమని అడుగుతారు. కానీ బాషాకు భయపడి ఎవరూ ముందుకు రారు. శివాజీ జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఇంతలోనే ఎన్నికలు వస్తాయి. ఒక లాయరు ఎన్నికల్లో గెలవడం ద్వారా శివాజీ ప్రజల సాక్ష్యం కోరవచ్చునని సలహా ఇస్తాడు. శివాజీని జైల్లో నుంచే ఎమ్మెల్యే పదవికి పోటీకి నిలబెట్టి అతని తల్లిదండ్రులు అతని తరపున ప్రచారం చేస్తారు. ఆ ఎన్నికల్లో శివాజీ గెలిచి ఎమ్మెల్యే అవుతాడు. అది భరించలేని బాషా అతని తల్లిదండ్రులని చంపేస్తాడు. శివాజీ ఆ రౌడీలను మట్టుబెట్టి కత్తిపోట్లతో తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చేరతాడు. చివర్లో అతను కోలుకుని ప్రజలందరికీ అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: బి.గోపాల్

సంగీతం: కె.వి.మహాదేవన్

నిర్మాత: ఎం.మోహన్ బాబు

నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్

సాహిత్యం: జాలాది రాజారావు, రసరాజు, సిరివెన్నెల సీతారామశాస్త్రి , గురుచరన్

నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.జె.యేసుదాస్, కె.ఎస్.చిత్ర .

పాటలు

మార్చు
పాట పాడినవారు రాసినవారు
పంతులూ పంతులు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర జాలాది
అందమైన వెన్నెల లోనా కె. జె. యేసుదాసు, చిత్ర రసరాజూ
పేకల్లో జోకర్లా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సిరివెన్నెల
తానాల గదిలోకి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర గురుచరణ్
తూరుపు కొండల్లో ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర జాలాది

మాతర్నమామి కమలే కమలాయ తాక్షి (శ్లోకం) ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.