అన్నపూర్ణ (నటి)
అన్నపూర్ణ, (August 23, 1954) ఏడువందల సినిమాల్లో నటించిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు ఉమామహేశ్వరి.[1] పదమూడేళ్ళ వయసు నుంచీ నాటకాల్లో నటించడం మొదలుపెట్టింది. తర్వాత సినిమాల్లోకి ప్రవేశించింది.[2]
అన్నపూర్ణ | |
---|---|
జననం | ఉమామహేశ్వరి (ఉమ) 1954 ఆగస్టు 23 |
ఇతర పేర్లు | ఉమామహేశ్వరి, అన్నపూర్ణమ్మ |
వృత్తి | రంగస్థల, సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1970–ప్రస్తుతం |
నాటకరంగం
మార్చుచిన్నతనంలోనే రంగస్థల ప్రవేశం చేసిన ఈమె తెనాలి నాటక సమాజాలలో అనేక పాత్రలు పోషించింది.[3] వీనిలో భయం, ఉలిపికట్టె, పల్లెపడుచు, పేదరైతు, కన్నబిడ్డ, కాంతా-కనకం, పూలరంగడు మొదలైనవి.
సినీ జీవితం
మార్చు1975లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబు సరసన కథానాయకిగా తెలుగు సినీరంగంలో పరిచయమైంది. ఆ సినిమా నిర్మాణ సమయంలోనే దర్శకుడు దాసరి నారాయణరావు ఈమె పేరును అన్నపూర్ణగా మార్చాడు. ఈమె పుట్టి,పెరిగింది కృష్ణాజిల్లాలోని విజయవాడ. తండ్రి ప్రసాదరావు ఆర్టీసీలో పనిచేసాడు.తల్లి సీతారావమ్మ. ముగ్గురు ఆడపిల్లల్లో ఈమె పెద్ద. ఒక తమ్ముడు ఉన్నాడు. ఈమెకు 1974లో పెళ్ళి జరిగింది. 25 సంవత్సరాల పాటు మద్రాసులో ఉండి తరువాత 1996లో హైదరాబాదు వచ్చి స్థిరపడింది.
పురస్కారాలు
మార్చుమనిషికో చరిత్ర, డబ్బు భలే జబ్బు, మా ఇంటి ఆడపడుచు సినిమాలకుగాను నంది అవార్డులు అందుకుంది.
అన్నపూర్ణ నటించిన తెలుగు చిత్రాలు
మార్చు- అనసూయమ్మ గారి అల్లుడు (1986)
- చిరునవ్వుల వరమిస్తావా
- సింధూరం
- ప్రతిబింబాలు (1982)
- మురారి
- నీడలేని ఆడది
- స్వర్గం నరకం
- శుభోదయం
- కొదమసింహం
- త్రినేత్రుడు
- ఆడది
- భార్గవ్
- అజేయుడు
- ఆడది (1990)[4]
- చిట్టెమ్మ మొగుడు (1992)
- హలో డార్లింగ్ (1992)
- గాయం (1993)
- మామా కోడలు (1993)
- పెళ్ళి చేసుకుందాం (1997)[5]
- పవిత్ర ప్రేమ (1998)
- డార్లింగ్ డార్లింగ్ (2001)
- మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)
- పిస్తా
- క్షేత్రం (2011 సినిమా)
- జీనియస్ (2012)
- జోరు (2014)[6]
- అవతారం (2014)
- గలాట (2014)
- ఎలుకా మజాకా (2016)
- తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ (2019)
- మళ్ళీ మళ్ళీ చూశా (2019)
- డిస్కో రాజా (2020)[7][8]
- ఒరేయ్ బుజ్జిగా (2020)
- అమరం అఖిలం ప్రేమ (2020)
- సైకిల్ (2021)
- అన్నపూర్ణమ్మ గారి మనవడు (2021)
- మళ్ళీ మొదలైంది
- పల్లె గూటికి పండగొచ్చింది (2022)
- కృష్ణ వ్రింద విహారి (2022)
- పెళ్లిసందD (2022)
- మళ్ళీ పెళ్ళి (2023)
- ఓ సాథియా (2023)
- నా..నీ ప్రేమకథ (2023)
- స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ (2023)
- రాఘవరెడ్డి (2024)
- మారుతి నగర్ సుబ్రమణ్యం (2024)
- 100 క్రోర్స్ (2024)
- క (2024)
- ఎర్రచీర - ది బిగినింగ్ (2024)
మూలాలు
మార్చు- ↑ నవతెలంగాణ, సోపతి, స్టోరి (9 August 2015). "కోరుకున్న పాత్రలే చేశాను". బి.మల్లేశ్వరి. Archived from the original on 22 June 2018. Retrieved 22 June 2018.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "విజయశాంతి ఇచ్చిన సలహా అది!". www.eenadu.net. Retrieved 2020-12-23.
- ↑ శ్రీమతి అన్నపూర్ణ, నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీలు: 310.
- ↑ Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]
- ↑ తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.
- ↑ The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. Archived from the original on 9 July 2018. Retrieved 20 June 2019.
- ↑ సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 2020-01-24. Retrieved 24 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 January 2020. Retrieved 24 January 2020.