అహమ్మద్ మహమ్మద్

(అహమ్మద్‌ మహమ్మద్‌ నుండి దారిమార్పు చెందింది)

అహమ్మద్‌ మహమ్మద్‌ సామాజిక రుగ్మతలను విమర్శనాత్మకంగా విశ్లేషిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడగల సాహిత్యాన్ని అందించే సాహితీకారుడు.

బాల్యము

మార్చు

అహమ్మద్‌ మహమ్మద్‌ మెదక్ జిల్లా మెదక్‌లో 1962 డిసెంబర్ 25న జన్మించారు. వీరి తల్లితండ్రులు... యాకూబీ, మహమ్మద్‌ మూసా. చదువు: ఎం.ఎ., బి.ఇడి. ఉద్యోగం ఉపాధ్యాయులు.

రచనా వ్యాసంగము

మార్చు

ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి ప్రేరణతో 1984లో సాహిత్యరంగ ప్రవేశం చేశారు. 1986 'మౌనం' కవిత ప్రచురితం. అప్పటినుండి వివిధ పత్రికలు, కవితా సంకలనాలలో పలు కవితలు, కథానికలు ప్రచురితం అయ్యాయి. ప్రచురణలు: పానాది (కవితా సంపుటి, 2008). ఇతని లక్ష్యం: సామాజిక రుగ్మతలను విమర్స నాత్మకంగా విశ్లేషిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడగల సాహిత్యాన్ని వ్రాశారు.

మూలాలు

మార్చు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 41