ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర
ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర 1986 లో విడుదలైన తెలుగు రచన.[1] దీనికి భూసురపల్లి వెంకటేశ్వర్లు రచించి, సంపాదకత్వం వహించారు. ఈ పుస్తకానికి ముఖచిత్రాన్ని బాపు చిత్రీకరించారు.
ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర | |
Andhra pradesh nadaswara dolu kalakarula charitra.png | |
కృతికర్త: | భూసురపల్లి వెంకటేశ్వర్లు |
---|---|
అంకితం: | పదాల సుబ్బారావు |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | చరిత్ర |
ప్రచురణ: | |
విడుదల: | 1986 |
దీనికి బెజవాడ గోపాలరెడ్డి, పుట్టపర్తి నారాయణాచార్యులు, సి. నారాయణరెడ్డి, దాశరథి, యం. ఆర్. అప్పారావు, యస్వీ జోగారావు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, తుమ్మల సీతారామమూర్తి మొదలైనవారు అభినందించారు.
రచయిత ఈ కృతిని పదాల సుబ్బారావు, లక్ష్మీ సరోజిని దంపతులకు అంకితమిచ్చారు.
నేపధ్యం
మార్చుహిందూ ఆరాధనా సంప్రదాయంలోను, వైవాహిక వ్యవస్థలోను అత్యంత ప్రముఖ్యం కలిగిన మంగళప్రదమైన వాద్యాలు నాదస్వరం, డోలు. ఈ రంగంలో విశేషమైన కృషిచేసిన వారి చరిత్రలను సేకరించి అందరికీ అందించాలని ఈ రచన చేశారు. వారి చరిత్రతో పాటు సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆయా వాద్యాల ప్రస్థానాన్ని కూడా పూర్వభాగంలో అందించారు.
సహాయసహకారాలు
మార్చుఈ పుస్తక రచనకు తమ అనుభవంతో విలువైన సమాచారాన్ని అందించిన డోలువాద్య పితామహులు ఈమని రాఘవయ్య గారికి, షేక్ చినమౌలానా, వెల్లటూరి నారాయణ మొదలైన వారికి రచయిత కృతజ్ఞతలను అందించారు. గ్రంథముద్రణకు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయాన్ని అందించింది.