ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రతిసంవత్సరము ఫిబ్రవరి నెలలో శాసనసభలో ప్రవేశపెడతారు, వచ్చే ఏప్రిల్ నుండి తదుపరి సంవత్సరము మార్చి వరకు ప్రభుత్వ రాబడులు, ఖర్చులు వివరాలు దీనిలో వుంటాయి. బడ్జెట్ కు ముందు ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు.
2023-24 సవరించు
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ అంచనా రూ.2,79,279 లక్షల కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూల ధన వ్యయం రూ.31,061 కోట్లు. రెవెన్యూ లోటు రూ.22,316కోట్లు కాగా ద్రవ్యలోటు రూ.54,587 కోట్లతో జీఎస్డీపీలో 3.7% గా వుంది.[1][2]
శాసనసభలో జరిగిన చర్చలో ప్రధాన ప్రతిపక్షం తెదేపా నేత ఏలూరి సాంబశివరావు బడ్జెట్ ను అంకెలగారడీగా వర్ణించాడు. 22% రెవిన్యూఆదాయం పెరుగుదల చాలా ఎక్కువని, ప్రజలపై భారం పెంచుతుందని, మూలధన వ్యయం తక్కువగా వుందని తెలిపాడు. గత నాలుగేళ్లలో నీటి పారుదల ప్రాజెక్టులకు రూ. 61,000 కోట్లు కేటాయించగా,రూ. 20,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపాడు. శాసనసభ అనుమతి లేకుండా, వివిధ కార్పోరేషన్ల ద్వారా బుణాలు పొందటం ప్రజలను మోసం చేయటమేనని, భవిష్యత్తులో ఆర్ధిక సంక్షోభానికి దారితీస్తుందని విమర్శించాడు. [3]
2022-23 సవరించు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ. 2,56,256 కోట్ల అంచనాతో 2022 మార్చి 10 నాడు ప్రవేశపెట్టాడు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,08,261 కోట్లు, మూలధన వ్యయం రూ. 47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లు. [4][5][6]
మొత్తం తీర్చవలసిన ప్రజారుణం 439394.35 కోట్లతో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 32.79 శాతంగా అంచనా వేశారు. [7]
Year | Open Market Loans | Loans From Central Govt. | Loans from Other Institutions | Small Savings | Provident Fund | Deposits and Reserve Funds | Total in Crores | % of GSDP |
---|---|---|---|---|---|---|---|---|
2017-18 | 1,31,553 | 8,977 | 14,602 | 13,659 | 13,509 | 41,406 | 2,23,706 | 27.83 |
2018-19 | 1,55,376 | 10,223 | 15,393 | 12,504 | 16,583 | 47,430 | 2,57,510 | 28.02 |
2019-20 | 1,88,820 | 10,943 | 16,319 | 11,331 | 16,745 | 57,645 | 3,01,802 | 31.02 |
2020-21 | 2,29,318 | 14,171 | 16,612 | 10,158 | 23,276 | 57,022 | 3,50,557 | 35.53 |
2021-22RE | 2,64,837 | 16,758 | 19,542 | 8,998 | 23,388 | 57,146 | 3,90,670 | 32.51 |
2022-23BE | 3,08,153 | 19,827 | 22,916 | 7,785 | 23,272 | 57,441 | 4,39,394 | 32.79 |
2021-22 సవరించు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2021-22ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ. 2,29,779.27 కోట్ల అంచనాతో 2021 మే 20 నాడు ప్రవేశపెట్టాడు. గత ఏడాది బడ్జెట్ రూ. 2,24,789.18 కోట్లు కావున 2.2% పెరుగుదల వుంది. మహిళలకు, చిన్నారులకు కొత్తగా ఉప ప్రణాళికలు ప్రారంభించాడు. ఎస్సి, ఎస్టి, బిసి ఉప ప్రణాళికలకు వరుసగా 22%,27%,32% వృద్ధి ప్రతిపాదించాడు.[8][9]
బడ్జెట్లో నవరత్నాల పథకాలకు ప్రాధాన్యం కొనసాగింది. 22 పథకాల ద్వారా రైతులు, మత్స్యకారులు, మహిళలు, విద్యార్థులు, వివిధ సామాజికవర్గాల్లోని పేదలకు నేరుగా ప్రజలకు నిధులు పంచే పద్ధతిలో రాష్ట్రంలోని లబ్ధిదారులకు రూ.48,083.92 కోట్లు ప్రయోజనం కలగనుంది. రాష్ట్ర బడ్జెట్‌లో వంద రూపాయలు ఖర్చులో 20 రూపాయలు నేరుగా ప్రజల ఖాతాలకు బదిలీ చేయనుంది. [10]
కొవిడ్‌పై పోరుకు రూ.500 కోట్లు, కరోనా టీకాల కోసం రూ.500 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో ప్రతిపాదించారు. [9]
2020-21 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడి రూ.1,61,958.50 కోట్లుగా అంచనా వేయగా వచ్చిన రాబడి రూ.1,18,063 కోట్లు. అంటే అంచనాలో 82 శాతమే వచ్చింది. దీనికంటే దాదాపు రూ.59 వేల కోట్లు అదనంగా వస్తుందని లెక్కించారు. దాదాపు 44 వేల కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్ నుంచి రుణం ప్రతిపాదన వుంది. 2021-22 చివరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పులు రూ.3,87,125.39 కోట్లకు చేరుకుంటాయి. [10]
గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదనల్లో మూలధన వ్యయం సగం కన్నా కాస్త ఎక్కువ మేర మాత్రమే ఖర్చు చేశారు. మూలధన వ్యయం కింద రూ.29,907.62 కోట్లు వ్యయంగా ప్రతిపాదిస్తే ఖర్చు చేసింది రూ.18,797.39 కోట్లే. ప్రస్తుత బడ్జెట్ లో రూ.31,198.38 కోట్ల మూలధన వ్యయం ప్రతిపాదించారు. [10]
2020-21 సవరించు
2020-21 బడ్జెట్ జూన్ 16 న శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టాడు. రూ.2,24,751.18 కోట్ల అంచనా గల బడ్జెట్ లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఉంది. కోవిడ్-19 మహమ్మారి వలన ఆర్థిక వ్యవస్థ మందగిచడం వల్ల 2019-20 బడ్జెట్ అంచనా కంటే 1.4 శాతం తక్కువగా ఉంది. రెవెన్యూలోటు రూ.18,414 కోట్లు, ఆర్థిక లోటు రూ.48,295 కోట్లుగా ఉంది. రెవెన్యూ లోటు 1.82 శాతం. ఉన్నత విద్యకు 12.38 శాతం, పంచాయితీ రాజ్‌కు 47 శాతం, పర్యాటకం 53 శాతం, ఐటీ రంగానికి 56 శాతం కోత పడింది.[11][12]
2019-20 సవరించు
2019-20 బడ్జెట్ జూలై 12 న శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టాడు. 2,27,975 కోట్లతో బడ్జెట్ లో ఒక్క సంక్షేమానికే ప్రభుత్వం రూ.75 వేల కోట్లకుపైగా కేటాయించింది. రూ1,778.52 కోట్ల రెవెన్యూ లోటును చూపింది. [13][14]
అంశం | మొత్తం (రూ.కోట్లలో) |
---|---|
బడ్జెట్ అంచనా | 2,27,975.00 |
రెవెన్యూ వ్యయం | 1,80,475.94 |
మూలధన వ్యయం | 32,293.39 |
రెవెన్యూ మిగులు అంచనా | -1,778.52 |
ఆర్థిక లోటు అంచనా | 35,280.00 |
బడ్జెట్‌కు నవరత్నాల రూపంలో ఒక లక్ష్యం, గమ్యం ఉన్నా, 19 శాతం పెరిగిన బడ్జెట్ కు నిధులు సమకూర్చుకోవడం కష్టమే. రాష్ట్ర రుణభారం ఇప్పటికే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 28.18 శాతానికి చేరుకోవడం (తెలంగాణలో ఇది 21.4 శాతం మాత్రమే), నిధుల కోసం కేంద్ర దయాదాక్షిణ్యాలపై అధారపడటం, బడ్జెట్ కేటాయింపులు విజయవంతం కావడానికి అడ్డంకిగా ఉంది. [15]
2019-20 VOA సవరించు
అంశం | మొత్తం (రూ.కోట్లలో) |
---|---|
బడ్జెట్ అంచనా | 2,26,117.53 |
రెవెన్యూ వ్యయం | 1,80,369.33 |
మూలధన వ్యయం | 29,596.33 |
రెవెన్యూ మిగులు అంచనా | 2,099.47 |
ఆర్థికలోటు అంచనా | 32,390.68 |
2018-19 సవరించు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.1,91,063.61 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయంగా రూ.1,50,270 కోట్లు. [18]
ప్రధాన రంగాలకు బడ్జెట్ కేటాయింపులు
- వ్యవసాయం: రూ.12,355 కోట్లు
- విద్య (సాంకేతిక విద్యతో కలిపి) : రూ.25,003 కోట్లు
- ఇరిగేషన్: రూ.16,978 కోట్లు
- గ్రామీణాభివృద్ధి: రూ.20,851 కోట్లు
- పరిశ్రమలు: రూ.3,074.87 కోట్లు
- బీసీ సంక్షేమం: రూ.12,200 కోట్లు
- పోలవరం ప్రాజెక్టు: రూ.9,000 కోట్లు
- రైతు రుణమాఫీ: రూ.4,100 కోట్లు
- ఎన్టీఆర్ పింఛన్లు: రూ.5,000 కోట్లు
2014-15 సవరించు
2014-15 బడ్జెటు [19]
2013-14 సవరించు
2013-14 బడ్జెట్ [20]
2012-13 సవరించు
18 ఫిబ్రవరి 2012 న 2012-13 సంవత్సరానికి 1,45,854.67 కోట్ల అంచనాతో రూపొందించిన రాష్ట్ర బడ్జెట్ ను 19 ఫిభ్రవరి2012 నాడు ఆనం రామనారాయణరెడ్డి ప్రవేశపెట్టారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కాగితరహితంగా ఎలక్ట్రానిక్ రూపంలో విడుదలచేయబడింది. [21]
ఇవీ చూడండి సవరించు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2021-22 లో వీటిని ఉటంకించినందున)
మూలాల జాబితా సవరించు
- ↑ Durgaraju, Sayee Pramodh (2023-03-16). "AP Budget: ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన, రూ. 2.79 లక్షల కోట్ల అంచనా వ్యయం". Economic times Telugu. Retrieved 2023-03-27.
- ↑ బుగ్గన (2023-03-16). ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగం 2023-24. వికీసోర్స్.
- ↑ M, Sambasiva Rao (2023-03-17). "Andhra Pradesh: Budget misleading and lacks transparency, alleges TDP". The Hindu. Retrieved 2023-03-27.
- ↑ "ఆంధ్రప్రదేశ్: రూ. 2.56 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్, కేటాయింపులు ఇలా..." బిబిసి. 2022-03-11.
- ↑ బుగ్గన, రాజేంద్రనాథ్ (2022). ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగం 2021-22. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. వికీసోర్స్.
- ↑ "Budget 2022-23". AP Government-Finance dept. 2022.[permanent dead link]
- ↑ Andhra Pradesh Budget in Brief 2022-23 (PDF). AP Government-Finance dep. 2022-03-11. p. 14.[permanent dead link]
- ↑ "ఆంధ్రప్రదేశ్: రూ. 2.29 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి.. మహిళలు, చిన్నారులకు పెద్దపీట". బిబిసి. 2021-05-20.
- ↑ 9.0 9.1 బుగ్గన, రాజేంద్రనాథ్ (2021). ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. వికీసోర్స్.
- ↑ 10.0 10.1 10.2 "AP Budget: సంక్షేమ బాటలోనే ఏపీ బడ్జెట్ బండి". ఈనాడు. 2021-05-20.
- ↑ బుగ్గన, రాజేంద్రనాథ్ (2020). ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2020-21. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. వికీసోర్స్.
- ↑ "ఏపీ బడ్జెట్: వాటికి మాత్రే నిధులు.. ఆ రంగాలకు భారీగా కోత". సమయం. 2020-06-16.
- ↑ బుగ్గన, రాజేంద్రనాథ్ (2019). ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. వికీసోర్స్.
- ↑ "నవరత్నాల ధగధగలు". ఈనాడు. 2019-07-13. Archived from the original on 2019-07-14.
- ↑ "ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019: కేటాయింపులు ఘనం, మరి నిధుల మాటేంటి? :అభిప్రాయం". బిబిసి. 2019-07-13. Archived from the original on 2019-07-15.
- ↑ యనమదల, రామకృష్ణుడు (2019). ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. వికీసోర్స్.
- ↑ "ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019: రైతుల కోసం పథకం 'అన్నదాత సుఖీభవ'". బిబిసి. 2019-02-05.
- ↑ అరుణ్, శాండిల్య (2018-03-08). "ఏపీ బడ్జెట్‌లో ఏముంది?.. ఇతర రాష్ట్రాల బడ్జెట్లు ఎలా ఉన్నాయ్?". బిబిసి.
- ↑ యనమదల, రామకృష్ణుడు (2014). ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. వికీసోర్స్.
- ↑ "Andhra Pradesh Budget in Brief" (PDF). Government of AP. 2013. Archived from the original (PDF) on 2015-07-23. Retrieved 2021-06-05.
- ↑ "Andhra Pradesh Budget in Brief" (PDF). Government of AP. 2012.