ఆంధ్రా బ్యాంకు

భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకు
(ఆంధ్రా బ్యాంక్ నుండి దారిమార్పు చెందింది)

భారతదేశపు వాణిజ్య బ్యాంకులలో ఆంధ్రా బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకును 1923, నవంబరు 20 న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో స్థాపించాడు. 1980లో ఈ బ్యాంకు జాతీయం చేశారు. 1981లో క్రెడిట్ కార్డు లను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను ఈ బ్యాంకు పరిచయం చేసింది. 2003 నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. 2007లో బయోమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసింది. 2007 సెప్టెంబర్ నాటికి ఈ బ్యాంకు 1,289 (గ్రామీణ-396, Semi-urban-376, పట్టణ-338, మెట్రో-179) బ్రాంచీలతో 99 ఎక్స్‌టెన్షన్ శాఖలతో, 37 శాటిలైట్ ఆఫీసులతో, 505 ఏటిఎంలతో, 22 రాష్ట్రాలలో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉంది. పెట్టుబడులను రాబట్టటంలో ఈ బ్యాంకు ఆసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం మొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 1.372 కోట్ల ఖాతాదారులు ఉన్నారు. ప్రారంభం నుండి నేటి వరకు మొత్తం ఋణాలలోకనీసం 50 శాతానికి తగ్గకుండా ఋణాలను గ్రామీణ భారతానికే అందిస్తున్నబ్యాంక్ ఇది. దేశంలో బ్యాంకుల జాతీయం చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో ఇది ప్రధానమైనది. ఇలా ఎన్నో రికార్డులను సృష్టించిన ఈ బ్యాాంక్ ఇప్పుడు కనుమరుగు కాబోతోంది. 2020 ఏప్రిల్ 1 నుండి యూనియన్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో విలీనమైంది.[1][2]

ఆంధ్రా బ్యాంకు
తరహాపబ్లిక్
స్థాపన1923, నవంబర్ 20
ప్రధానకేంద్రము హైదరాబాదు, భారతదేశం
కీలక వ్యక్తులుకే.రామకృష్ణన్, ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్
పరిశ్రమఫైనాన్స్
వాణిజ్య బ్యాంకులు
ఉద్యోగులు19,921 (2018 నాటికి)
వెబ్ సైటుhttp://www.andhrabank.in

వనరులు

మార్చు

మూలాలు

మార్చు
  1. NEWS 18 తెలుగు, ట్రెండింగ్ (1 April 2020). "ఆంధ్రా బ్యాంక్ చరిత్ర ఎంత గొప్పదో.. కానీ నేటి నుంచి కనుమరుగు." Archived from the original on 1 ఏప్రిల్ 2020. Retrieved 1 April 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Rao, Samba Siva (29 March 2020). "ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రాబ్యాంక్ సహా ఆ 5 బ్యాంకులు లేనట్లే". www.hmtvlive.com. Archived from the original on 1 ఏప్రిల్ 2020. Retrieved 1 April 2020.

బయటి లింకులు

మార్చు