కళాకృష్ణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన నృత్యకారుడు, నాట్యగురువు. ఆంధ్ర నాట్యం, పేరిణి నృత్యం, కూచిపూడి వంటి నృత్యాలను ప్రదర్శించాడు. ఇతడు ‘నవజనార్దన పారిజాతం’ నృత్యరూపకం చేయడంద్వారా పేరు గడించాడు.[2][3] సత్యభామ పాత్రలో అపూర్వమైన అభినయానికి మెచ్చి కళాభిమానులు ఆయనను ‘అభినవ సత్యభామ’ అని ప్రశంసించారు. కళాకారుడిగా, అధ్యాపకుడిగా 45 ఏళ్లుగా సేవలందిస్తూ వేలాది ప్రదర్శనలిచ్చాడు.

కళాకృష్ణ
కళాకృష్ణ
జననం1951 ఆగస్టు 11
వృత్తివిజిటింగ్ ఫాకల్టీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలుగు విశ్వవిద్యాలయం, ఎంఎ నృత్యవిభాగం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నాట్యాచార్యుడు, నాట్య కళాకారుడు
జీవిత భాగస్వామిడి. ఉమా మహేశ్వరి[1]
తల్లిదండ్రులు
  • లక్ష్మయ్య (తండ్రి)
  • గౌరి (తల్లి)

జీవిత విశేషాలు

మార్చు

కళాకృష్ణ 1951 ఆగస్టు 11న లక్ష్మయ్య, గౌరి దంపతులకు కరీంనగర్ జిల్లా కల్లేపల్లి గ్రామంలో జన్మించాడు. ఇతడు సిరిదె మాణిక్యమ్మ, అన్నాబత్తుల సత్యభామ, జంపా ముత్యంల వద్ద ఆంధ్రనాట్యాన్ని అభ్యసించాడు. తరువాత నటరాజ రామకృష్ణ వద్ద శిక్షణ పొందాడు. జగన్నాథ శర్మ, వెంపటి చినసత్యం లవద్ద కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నాడు.విశాలాక్షి వద్ద భరతనాట్యం అభ్యసించాడు.

నాట్యరంగం

మార్చు

1987లో హరిహర నృత్యనికేతన్ స్థాపించి వేలాదిమంది శిష్యులు, ప్రశిష్యుల ద్వారా నృత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు. కళాకృష్ణ పేరిణి నట్టువాంగానికి ఎంతో పేరు గడించాడు. ఇతడు పేరిణి లాస్యం ప్రదర్శించడానికి శాస్త్రాల ఆధారంగా రూపకల్పన చేశాడు.

ఇతడు కొన్ని వేల నృత్య ప్రదర్శనలు ఇచ్చాడు. ఖండాంతరాలకు కూచిపూడి గొప్పతనాన్ని వ్యాపింపజేశాడు. వివిధ రాష్ట్రాలతో పాటు ఆఫ్రికా, మారిషస్, యుఎస్‌ఎ, యుకె, ఇండోనేషియా, మలేసియా, సింగపూర్, మస్కట్, జపాను మొదలైన ఎన్నో దేశాలలో ప్రదర్శనలిచ్చి మన కళలను ప్రచారం చేశాడు. పలు వీడియోలను రూపకల్పన చేశాడు. వివిధ సంస్థలు, ప్రభుత్వం తరపున దేశ విదేశాలలో వర్క్‌షాప్స్ నిర్వహించి ఎందరో కళాకారులకు మార్గనిర్దేశం చేశాడు.

పురస్కారాలు, బిరుదులు

మార్చు
  • తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం - 2019 (తెలుగు విశ్వవిద్యాలయం, 12.12.2021)[4][5]
  • తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం -2015, తెలంగాణ ప్రభుత్వం
  • వేదాంత జగన్నాథ శర్మ బంగారు పతకం, నృత్య కిన్నెర 2010
  • కళా సుబ్బారావు పురస్కారం, హైదరాబాద్ 2010
  • కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు 2009
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస (కళారత్న) 2008
  • స్థానం నరసింహారావు అవార్డు 2007
  • కెవిఎస్ అవార్డు, ఏలూరు 2007
  • ప్రతిభా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం 2006
  • అక్కినేని నాగేశ్వరరావు బంగారు పతకం, 2005
  • బంగారు పతకం, కూచిపూడి ఆర్ట్ అకాడమీ, హైదరాబాద్ 2004
  • స్ఫూర్తి అవార్డు, భాగ్యనగర్ ఫైన్ ఆర్ట్స్ 1995
  • నంది అవార్డు, నవ జనార్దనం డాక్యుమెంటేషన్, 1987.
  • "అభివ సత్యభామ" - శ్రీ వేంపర్ల సత్యనారాయణ శాస్త్రి 1986
  • "మధురలాస్య కళానిధి" - సంగీత విద్వత్ సభ, కాకినాడ 1986
  • ఇంటర్నేషనల్ డాన్స్ డే అవార్డు, రసమయి, హైదరాబాద్
  • ఇంటర్నేషనల్ డాన్స్‌డే కల్చరల్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
  • వివేకానంద ఎక్స్‌లెన్సీ అవార్డు, వివేకానంద 150 జయంతి సందర్భంగా.

మూలాలు

మార్చు
  1. Sakshi (26 January 2024). "ఎంతో ఆనందంగా ఉంది." Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  2. శ్రీలేఖ కొచ్చెర్లకోట (26 December 2017). "అభినవ సత్యభామ.. కళాకృష్ణ (కళాంజలి )". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 6 February 2021.
  3. సంగీత నాటక అకాడమీ సైటేషన్[permanent dead link]
  4. ఈనాడు, ప్రధానాంశాలు (4 December 2021). "విఠలాచార్య, కళాకృష్ణలకు తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారాలు". EENADU. Archived from the original on 5 December 2021. Retrieved 7 December 2021.
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ (4 December 2021). "కూరెళ్ల విఠాలాచార్య, కళాకృష్ణకు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాలు". Namasthe Telangana. Archived from the original on 4 December 2021. Retrieved 7 December 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=కళాకృష్ణ&oldid=4095147" నుండి వెలికితీశారు