అరసిశ్రీ
ఈ వ్యాస విషయం వికీపీడియా సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా లేనట్లుగా తోస్తోంది. (2011-2022) |
అరసి శ్రీ(Arasi Sri).Dr.Lakshman Adimulam. ఆగస్ట్ 26 1988 లో జన్మించారు . నృత్య కళాకారులు , రచయిత , పత్రిక ఎడిటర్ , కాలమిస్ట్ .
చదువు మార్చు
డిగ్రీ లో స్పెషల్ తెలుగు పూర్తి చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఏం .ఏ , ఏం .ఫీల్ , పి .హెచ్ .డి పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు .
నృత్యం మార్చు
చిన్నతనంలో శ్రీమతి మద్దనాల లక్ష్మి జ్యోతి గారి వద్ద శాస్త్రీయ నృత్యాల్లో శిక్షణ ప్రారంభించారు . తర్వాత కాలంలో ఆంద్ర నాట్యం , ఆలయ నృత్యంలో కళా రత్న డా .సప్పా దుర్గా ప్రసాద్ గారి వద్ద పదేళ్లు శిష్యరికం చేశారు . శ్రీమతి శ్రీలక్ష్మి చింతలూరు పర్యవేక్షణలో కూచిపూడిలో సర్టీఫి కేట్ , డిప్లమో పూర్తి చేసారు .
సహా సంపాదకులు మార్చు
అంతర్జాలంలో నడుస్తున్న తొలి తెలుగు మహిళా పత్రిక "విహంగ "పత్రికకు సహా సంపాదకులుగా పదేళ్లుగా విహంగ పయనంలో కీలక భూమిక పోషిస్తున్నారు.
విహంగ మహిళా సాహిత్య పత్రిక. ఈ పత్రిక వ్యవస్థాపకులు డా.హేమలత పుట్ల 2011 -11 -11 న అంతర్జాలంలో ప్రారంభించారు. ఈ పత్రికలో సుదీర్ఘ కాలంగా సహా సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు అరసిశ్రీ.
అంతర్జాలంలో తొలి మహిళా పత్రిక. ISSN గుర్తింపు పొందిన తొలి అంతర్జాల తెలుగు పత్రిక కావడం విశేషం.[1]
డా.పుట్లహేమలత తర్వాత యువ రచయిత్రి మానస ఎండ్లూరి , డా.అరసిశ్రీ నేతృత్వంలో ప్రస్తుతం విహంగ పత్రిక ప్రతి నెల అంతర్జాలంలో వెలువడుతుంది.
పత్రికలో వీరు రాసిన పుస్తక సమీక్షలు, ముఖాముఖీలు, సంపాదకీయాలు ఉన్నాయి. ఈ క్రమంలో డా.అరసి శ్రీ “నర్తన కేళి “[2] శీర్షికతో శాస్త్రీయ నాట్యంలో రాణిస్తున్న ఎందరో నాత్యాచారిణిల విజయగాధను, వారి అంతరంగ విశేషాలను తెలియజేసిన ఈ శీర్షిక విశేష ఆదరణ పొందింది.
విహంగ పత్రిక పదేళ్ళ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వెబ్ నార్ లో అరసిశ్రీ మాట్లాడిన ప్రసంగం పదేళ్ళ కి ముందు తర్వాత అంతర్జాలంలో తెలుగు పత్రికలు , వాటి నిర్వహణ ఎంత కష్టంగా ఉండేది, ఇప్పుడు ఎంత సులభతరం అయ్యిందో తెలియజేసారు.
ప్రతినెల విహంగ లో వస్తున్న సంపాదకీయాలు వాస్తవ సంఘటనలతో పాటు నేటి తరం తెలుసుకోవాల్సిన మహనీయుల గురించి వీరు రాస్తున్న సంపాదకీయాలు ఆలోచించే విధంగా ఉంటాయి.[3]
కాలమిస్ట్ మార్చు
కొంత కాలం కాలమిస్ట్ గా విశాఖ సంస్కృతి పత్రికలో “కమనీయమైన కళ “ పేరుతో శీర్షికను నిర్వహించారు. [4] .
అకాడమీ నృత్య శిక్షణ మార్చు
రాజమహేంద్ర వరంలో " శ్రీ నాట్య మయూరీ కళాక్షేత్ర" డాన్స్ అకాడమీ స్థాపించి ఎందరో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు .
నాట్య ప్రదర్శనలు మార్చు
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు యిచ్చారు . రాజమండ్రి , హైదరాబాద్ , కాకినాడ , విజయవాడ , ఏలూరు , విశాఖ పట్నం ,సత్తుపల్లి ,అన్నవరం , తణుకు , కొత్తగూడెం , ద్వారకా తిరుమల , నెల్లూరు, వంటి చేయట్లా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు .[5]
బిరుదులు మార్చు
అభినయ నాట్య చూడామణి , శివ నంది పురస్కారం , నాట్య యువ కిశోరం ,విద్య కళారత్న , విహంగ సాహిత్య పురస్కారం , నాట్య చంద్రిక ,నాట్య చూడామణి, నర్తన విపంచి , వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.[6]
పరిశోధన మార్చు
కళారత్న డా .సప్పా దుర్గాప్రసాద్ రచించిన "ప్రేమాంజలి చారిత్రిక కథ మీద ఏం ఫీల్ పూర్తి చేసి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి 2013 లో ఏం ఫీల్ పట్టా అందుకున్నారు .
కూచిపూడి , ఆంద్ర నాట్య కళాకారుల సాహిత్య సేవ అనే అంశం పై పరిశోధన చేసి పి .హెచ్ డి పరిశోధన గ్రంధాన్ని తెలుగు విశ్వవిద్యాలయం నుంచి 2017 లో డాక్టరేట్ అందుకున్నారు .
2016-17 సంవత్సరానికి CCRTఅందించే జూనియర్ ఫెలోషిప్ కి అర్హత సాధించి ... 2017-19 లో తెలుగు నాటకం , నాటిక రచయితలుగా కూచిపూడి నర్తకులు అనే అంశం పై పరిశోధన పూర్తి చేసారు.
విహంగ పత్రిక లింక్ ....http://vihanga.com/
పదేళ్ల విహంగ ప్రయాణం పై వచ్చిన సంపాదకీయ వ్యాసం .....అలుపెరగని విహంగం (సంపాదకీయం )- అరసి శ్రీ......http://vihanga.com/?p=29875
నర్తనకేళి ముఖాముఖీ మొదటి భాగం ఇక్కడ చూడవచ్చు http://vihanga.com/?p=5450
విహంగలో అన్ని ఆర్టికల్స్ యిక్కడ చూడవచ్చు http://vihanga.com/?s=%E0%B0%85%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF+
మూలాలు మార్చు
- ↑ "| Telugu Women Magazine". vihanga.com. Retrieved 2022-02-15.
- ↑ అరసి. "నర్తన కేళి -1 |" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-02-15.
- ↑ "సంపాదకీయం |" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-02-15.
- ↑ విశాఖ సంస్కృతి మే 2014(Visakha Samskruthi May 2014) By sirela sanyasi rao - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2022-02-15. Retrieved 2022-02-15.
- ↑ Madhura nagarilo|| Javali||Dr.arasisri, retrieved 2022-02-15
- ↑ DR.arasi sri ...sathulala chudare..., retrieved 2022-02-15