ఆంధ్ర ప్రగతి గ్రామీణ బాంక్
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు భారత దేశం లోఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు. ఇది కడప, కర్నూలు,అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో బ్యాంకింగ్ సేవలు అందించడానికి ప్రాంతీయ గ్రామీణ బాంక్ ల చట్టం 1976 క్రింద, 2006 లోఏర్పడిన ఒక షెడ్యుల్డ్ వాణిజ్య బాంక్.
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బాంక్ | |
---|---|
తరహా | ప్రభుత్వ రంగ సంస్థ , సిండికేట్ బ్యాంక్ సౌజన్యం |
స్థాపన | 1 జూన్ 2006 |
ప్రధానకేంద్రము | కడప , ఇండియా |
పరిశ్రమ | బ్యాంకింగ్ రంగ పరిశ్రమ |
శ్రీ అనంత గ్రామీణ బాంక్, పినాకిని గ్రామీణ బాంక్, రాయలసీమ గ్రామీణ బాంక్, లను కలిపి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బాంక్ గా సిండికేట్ బాంక్ ఏర్పరచింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని అత్యంత వెనుకబడిన ప్రాంతం లోని గ్రామీణ పేదలకు ఈ బాంక్ సేవలు అందిస్తోంది.[1]
కడప లో కేంద్ర కార్యాలయం కలిగి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని 5 జిల్లాల్లో ఈ బాంక్ తన కార్య కలాపాలు కొనసాగిస్తోంది.[2]
2010 లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వర్యులు కొణిజేటి రోశయ్య గారిచే బెస్ట్ బాంక్ అవార్డు ను పొందింది.
మూలాలు
మార్చు- ↑ "APGB". Archived from the original on 2016-03-05. Retrieved 2022-06-21.
- ↑ "Andhra Pragathi Grammena Bank expands; to recruit 350 staff". deccanchronicle.com. 14 October 2017. Retrieved 12 October 2021.