ఆంధ్ర సచిత్ర వార పత్రిక

ఆంధ్రపత్రిక స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించాడు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1914 సంవత్సరంలో పత్రికను మద్రాసుకు తరలింది. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికగా ఏప్రిల్ 1 వ తేదీన ప్రచురణ ప్రారంభమైనది. వారపత్రికగా కూడా కొనసాగింది. 1943లో యుద్ధకాలంలో ఏర్పడిన కాగితపు కాటకం వల్ల నాలుగు సంవత్సరాలు దినపత్రికకు ఆదివారం అనుబంధంగా వెలువడింది. 1947 సెప్టెంబరు నుండి తిరిగి పూర్వరూపంలో వెలువడటం ప్రారంభించింది. ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక జూలై 7, 1958 సంచిక నుండి ఆంధ్ర సచిత్రవార పత్రికగా రూపుదాల్చింది. ఈ పత్రికకు కాశీనాథుని నాగేశ్వరరావు 1908 నుండి 1938 వరకు, శివలెంక శంభుప్రసాద్ 1938 నుండి 1972 వరకు, శివలెంక రాధాకృష్ణ 1972 నుండి 1989 వరకు వీరాజీ 1989 నుండి పత్రిక మూతపడే వరకు సంపాదకుడిగా ఉన్నారు. ఈ పత్రిక కార్యస్థానం మద్రాసు నుండి విజయవాడకు మళ్లీ విజయవాడ నుండి మద్రాసుకు మారింది.

విషయాలుసవరించు

ఈ పత్రికలో కథలు, నవలలు, వ్యాసాలు, కార్టూనులు, పుస్తక సమీక్షలు, సినిమా సమీక్షలు ఇంకా ఎన్నో అంశాలు ప్రచురింపబడ్డాయి. సంక్రాంతి, దీపావళి, ఉగాది, స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే సందర్బలలో ప్రత్యేక సంచికలు వెలువరించింది. కథల పోటీలు, నవలల పోటీలు, వ్యాసరచన పోటీలు, కార్టూన్ పోటీలు అనేకం ఈ పత్రిక నిర్వహించింది.

జనవరి 9, 1970 సంచిక[1]లోని శీర్షికలు ఈ విధంగా ఉన్నాయి.

విషయానుక్రమణిక

కథలు

 • మానవత్వం
 • ఉద్యోగం

సీరియల్ నవలలు

 • మనుషులూ - మమతలూ
 • లలిత

వ్యాసాలు, శీర్షికలు, సినిమా

 • ఉత్తరాలు
 • ఊమెన్ కార్టూన్
 • న్యూఢిల్లీలేఖ
 • మహాత్మాగాంధిని ఎలా మరచిపోగలం?
 • బృహత్‌కథామంజరి కథలు
 • ...ఫాదర్ ఫెర్రర్
 • 1970లో మీ రాశిఫలం
 • ధర్మపథం
 • వనితాలోకం
 • వారఫలం
 • ప్రశ్నావళి
 • ఒకవారం విపరీతం
 • అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
 • సినిమా
 • ఆత్మవిమర్శ అవసరం
 • సినిమాడైరీ
 • మీకు తెలుసా?
 • పుస్తకాలు

మూలాలుసవరించు

 1. సంపాదకుడు (జనవరి 9, 1970). "విషయానుక్రమణిక". ఆంధ్ర సచిత్ర వారపత్రిక. 63 (17): 4. Retrieved 26 January 2015. Check date values in: |date= (help)