ఆగ్రా కోట (Agra Fort), ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో ఉంది. దీనిని యునెస్కో వారు, ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఇది ప్రఖ్యాత తాజ్ మహల్కు వాయవ్యంలో 2.5 కి.మీ. దూరాన గలదు. ఈ కోటకు 'లాల్ ఖిలా' (ఎర్రకోట కాదు) అని కూడా అంటారు.

భారతదేశం లోని ముఖ్యమైన కోటలలో ఒకటి. మొఘలులు బాబరు, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాను, ఔరంగజేబులు నివసించారు. దీనిని విదేశీ దౌత్యవేత్తలు, యాత్రికులు, ఉన్నత పదవులను అలంకరించినవారు సందర్శించారు.

చరిత్ర

మార్చు

వాస్తవంగా దీనిని రాజపుత్రులు చౌహానులు నిర్మించారు. ఇది ఇటుకలతో నిర్మించిన కోట. అక్బర్ దీని ప్రాముఖ్యతను గుర్తించి, శిథిలమైన ఈ కోటను పునర్నిర్మించి, 1558లో ఆగ్రాను రాజధానిగా చేసుకొని, ఈకోట యందే జీవించాడు. అక్బర్ దీనిని, ఇసుక రాతితో నిర్మించాడు. అంతర్భాగం ఇటుకలతోనూ, బాహ్యభాగం ఇసుకరాతితోనూ నిర్మించాడు. దీనిని నిర్మించుటకు 1444000 మంది పనిచేశారు. 1573 లో దీని నిర్మాణం పూర్తయింది.

 
ఆగ్రా కోట అంతర్భాగం, ఇక్కడ షాజహాను తన ఆఖరు సంవత్సరాలు గడిపాడు.

భారత ప్రభుత్వం ఈ కోట సంస్మణార్థం 28-11-2004 న, ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

 
అలంకరించబడ్డ స్తంభం.

బయటి లింకులు

మార్చు

Diwan-e-am panorama pictures[permanent dead link]

వనరులు

మార్చు


Coordinates: 27°10′46″N 78°01′17″E / 27.17944°N 78.02139°E / 27.17944; 78.02139

"https://te.wikipedia.org/w/index.php?title=ఆగ్రా_కోట&oldid=4055320" నుండి వెలికితీశారు