ఆచార్య
ఆచార్య, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్[1] సంయుక్తంగా నిర్మించిన తెలుగు చలనచిత్రం.[2] ఈ సినిమాలో చిరంజీవి, రాం చరణ్ తేజ, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటించారు.[3] కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందించాడు. 2021 మే 13న ఈ చిత్రం[4] విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని 2022 ఫిబ్రవరి 4న విడుదల[5] కావలసి వుండగా కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా వేసి [6] ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 2022 ఏప్రిల్ 29న విడుదలై,[7] మే 20న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలయింది.[8]
ఆచార్య | |
---|---|
![]() | |
దర్శకత్వం | కొరటాల శివ |
రచన | కొరటాల శివ |
నిర్మాత | రామ్చరణ్, నిరంజన్ రెడ్డి |
నటవర్గం | చిరంజీవి, రాం చరణ్ తేజ, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే |
ఛాయాగ్రహణం | తిరు |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థలు | |
విడుదల తేదీలు | 2022 ఏప్రిల్ 29(థియేటర్) 2022 మే 20 (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ) |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
నటవర్గంసవరించు
- చిరంజీవి
- రాం చరణ్ తేజ[9]
- కాజల్ అగర్వాల్
- పూజా హెగ్డే
- సోనుసూద్
- కిషోర్
- తనికెళ్ళ భరణి
- జిష్షూసేన్ గుప్తా
- అజయ్
- కిషోర్ [10]
- రెజీనా (ప్రత్యేక గీతం)[11]
- సౌరవ్ లోకేష్[12]
పాటలుసవరించు
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
సం. | పాట | పాట రచయిత | Singer(s) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "లాహే లాహే[13]" | రామజోగయ్య శాస్త్రి | హారిక నారాయణ్, సాహితి చాగంటి | 4:11 |
2. | "సానా కష్టం వచ్చిందే మందాకినీ" | భాస్కరభట్ల రవికుమార్ | రేవంత్, గీతామాధురి |
కాజల్ పాత్ర లేదుసవరించు
ఈ చిత్రం 2022 ఏప్రిల్ 29న విడుదల కాబోతుండగా ఏప్రిల్ 25న దర్శకుడు కొరటాల శివ కాజల్ పాత్ర లేదని తేల్చిచెప్పాడు. ఆచార్య చిత్రంలో చిరంజీవి పాత్రకు ప్రేమపై ఆసక్తి ఉండదు. అయితే కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని కాజల్ పాత్రను చొప్పించి తొలి షెడ్యూల్ పూర్తి చేసాక సంతృప్తిగా అనిపించలేదని దర్శకుడు అన్నాడు. సరైన ప్రాధాన్యత లేని పాత్రతో హీరోయిన్ ను అవమానించడం సరికాదని అభిప్రాయపడ్డారు. దీనికి చిరంజీవి, కాజల్ ఏకీభవించారన్నారు.[14]
మూలాలుసవరించు
- ↑ "Chiranjeevi's next titled Acharya, actor accidentally reveals film's title". Hindustan Times. 2020-03-02. Retrieved 2020-03-31.
- ↑ "Chiranjeevi's 'Acharya' to release worldwide on May 13, check out the teaser!". The New Indian Express. 30 January 2021.
- ↑ World, Republic. "Chiranjeevi starrer 'Acharya' film's budget reduced due to the Coronavirus crisis?". Republic World. Retrieved 2020-03-31.
- ↑ "Chiranjeevi starrer 'Acharya' teaser dropped; film to release on this date". Zee News. 2021-01-29. Retrieved 2020-03-31.
- ↑ "Acharya: 'చిరు' అభిమానులకు గుడ్ న్యూస్.. 'ఆచార్య' రిలీజ్ డేట్ ఫిక్స్" [Acharya: Good news for 'Chiru' fans .. 'Acharya release date is fixed]. Eenadu. 9 October 2021. Archived from the original on 9 అక్టోబరు 2021. Retrieved 9 October 2021.
- ↑ Andhrajyothy (16 January 2022). "కొత్త విడుదల తేదీ ఖరారు". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
- ↑ "'ఆచార్య ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-16. Archived from the original on 2022-04-25. Retrieved 2022-04-25.
- ↑ TV5 News (13 May 2022). "చిరు 'ఆచార్య' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!" (in ఇంగ్లీష్). Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
- ↑ "Ram Charan as Siddha in Chiranjeevi's Acharya - Moviezupp" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-01-17. Retrieved 2022-05-04.
- ↑ HMTV (23 March 2021). "'ఆచార్య' లో C/o కంచరపాలెం నటుడు". Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
- ↑ "Acharya: 'ఆచార్య' ప్రత్యేక గీతం.. స్టెప్పులతో మెస్మరైజ్ చేస్తున్న చిరు - telugu news saana kastam song from acharya starring chiranjeevi". www.eenadu.net. Retrieved 2022-01-03.
- ↑ The New Indian Express (21 January 2021). "Bhajarangi-fame Loki makes his Telugu debut with Chiranjeevi's 'Acharya'". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
- ↑ Sakshi (12 April 2021). "ఆచార్య 'లాహే లాహే' సాంగ్ తెలుగు లిరిక్స్.. మీ కోసం". Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
- ↑ "Acharya - Koratala Siva : 'ఆచార్య'లో కాజల్ పాత్రపై డైరెక్టర్ కొరటాల శివ క్లారిటీ". Samayam Telugu. Retrieved 2022-04-25.