పిల్లలు ఆటలలో పాటలు చేర్చి ఆడుకోవడం కోసం ఎన్నో సులభమైన అర్ధవంతమైన గేయాలు తెలుగులో రచించబడ్డాయి. వాటిలో కొన్ని.

తెలుగు తల్లి శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభం, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలం. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారం

చెమ్మచెక్క

మార్చు
  • చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
  • అట్లు పొయ్యంగ ఆరగించంగ
  • ముత్యాల చెమ్మచెక్క ముగ్గులెయ్యంగ
  • రత్నాల చెమ్మ చెక్క రంగులెయ్యంగ
  • పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ
  • పందిట్లో మా బావ పెండ్లి చెయ్యంగ
  • చూచి వద్దాం రండి సుబ్బరాయడి పెళ్ళి
  • మా వాళ్ళింట్లో పెళ్ళి మళ్ళీవద్దాం రండి
  • దొరగారింట్లో పెళ్ళి దోకుకు వద్దాం రండి.

పిండీ

  • తాటీ బెల్లం తవ్వెడు నెయ్యి
  • గుప్పెడు తింటే కులుకూలాడి
  • నడుమూకట్టే నామాట చిట్టీ
  • దూదూ పుల్ల దూరాయ్ పుల్ల
  • చూడాకుండా జాడా తియ్యీ
  • ఊదాకుండా పుల్లా తీయ్యీ==ఒప్పులకుప్పా ఒయ్యారిభామా==
  • ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా
  • మినపా పప్పూ మెంతీ
  • ఒప్పులకుప్పా ఒయ్యారిభామా! ఒప్పులకుప్పా ఒయ్యారి భామా.

కాళ్ళగజ్జ-కంకాలమ్మ

మార్చు
  • కాళ్ళగజ్జ - కంకాలమ్మ
  • వేగుచుక్క - వెలగామొగ్గ
  • మొగ్గాకాదు - మోదుగనీరు
  • నీరూకాదు - నిమ్మలవాయ
  • వాయాకాదు - వాయింటకూర
  • కూరాకాదు - గుమ్మడిపండు
  • పండూకాదు - పాపడమీసం
  • మీసం కాదు - మిరియాలపోతు
  • పోతూకదు - బొమ్మలశెట్టి
  • శెట్టీ కాదూ - శామమన్ను
  • మన్నూకాదు - మంచి గంధం చెక్క
  • లింగులిటుకు - పందెమాల పటుకు
  • కాలు పండినట్లు - కడకు తీసిపెట్టు.

గుడు గుడు కుంచం

మార్చు
  • గుడుగుడు కుంచం గుండేరాగం
  • పావడ పట్టల పడిగే రాగం
  • అప్పడాల గుర్రం ఆడుకోబోతే
  • పేపే గుర్ర పెళ్ళికి పోతే
  • అన్నా అన్నా నీ పెళ్ళెపుడంటే
  • రేపు కాదు ఎల్లుండే - కత్తీకాదు బద్దాకాదు గప్ చుప్.

దాగుడు మూతలు

మార్చు
  • దాగుడుమూతా దండాకోర్
  • పిల్లీవచ్చే ఎలకాదాగే
  • కళ్ళూ మూసీ కాలీకోర్
  • గప్ చుప్ సాంబార్ బుడ్డీ
  • ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్--

వానా వనా వల్లప్ప

మార్చు
  • వానా వాన వల్లప్ప
  • వాకిలి తిరుగు చెల్లప్ప
  • కొండమీద గుండురాయి
  • కొక్కిరాయి కాలు విరిగె
  • దానికేమి మందూ ?
  • వేపాకు పసుపు వెల్లుల్లిపాయ
  • నూనమ్మ బొట్టు
  • పూటకొక్క తూరి

చుట్టాల సురభి

మార్చు
  • తిందాం తిందాం ఒక వేలు
  • ఎట్లా తిందాం ఒక వేలు
  • అప్పుచేసి తిందాం ఒక వేలు
  • అప్పెట్టా తీరుతుంది ఒక వేలు
  • ఉన్నాడు కదా అన్నిటికీ
  • పొట్టివాడు గట్టివాడు బొటన వేలు

అల్లీ బిల్లీ

మార్చు
  • కొండాపల్లీ కొయ్యాబొమ్మా
  • నీకోబొమ్మా నాకోబొమ్మా
  • నక్కాపల్లీ లక్కపిడతలు
  • నీకో పిడత నాకో పిడత
  • నిర్మల పట్నం బొమ్మల పలకలు
  • నీకో పలకా నాకో పలకా
  • బంగిన పల్లీ మామిడి పండ్లూ
  • నీకో పండూ నాకో పండూ
  • ఇస్తానుండూ తెచ్చేదాకా
  • చూస్తూఉండూ వచ్చేదాకా...

ఒక్కటి ఓ చెలియా

మార్చు
  • ఒక్కటి ఓ చెలియా
  • రెండు రోకళ్లూ
  • మూడు ముచ్చిలకా
  • నాలుగు నందన్నా
  • అయిదూ బేడల్లూ
  • ఆరూ జవ్వాది
  • ఏడూ ఎలమంద
  • ఎనిమిది మనమంద
  • తొమ్మిది తోకుచ్చు
  • పది పారిపోయిందోచ్.....

ఎందుకురా

మార్చు
  • ఎండలు కాసేదెందుకురా ?
  • మబ్బులు పట్టేటందుకురా..
  • మబ్బులు పట్టేదెందుకురా ?
  • వానలు కురిసేటందుకురా...
  • వానలు కురిసేదెందుకురా ?
  • చెరువులు నిండేటందుకురా..
  • చెరువులు నిండేదెందుకురా ?
  • పంటలు పండేటందుకురా...
  • పంటలు పండేదెందుకురా ?
  • ప్రజలు బతికేటందుకురా..
  • ప్రజలు బతికేదెందుకురా ?
  • దేవుని కొలిచేటందుకురా..
  • దేవుని కొలిచేదెందుకురా ?
  • ముక్తిని పొందేటందుకురా............

రింగు రంగు బిళ్ళ

మార్చు
  • రింగురింగు బిళ్ళ - రూపాయిదండ
  • దండకాదురా - తామర మొగ్గ
  • మొగ్గ కాదురా - మోదుగనీడ
  • నీడకాదురా - నిమ్మల బావి
  • బావి కాదురా - బచ్చలి కూర
  • కూర కాదురా - కుమ్మరి మెట్టు
  • మెట్టు కాదురా - మేదరి సిబ్బి
  • సిబ్బి కాదురా - చీపురు కట్ట
  • కట్ట కాదురా - కావడి బద్ద
  • బద్దకాదురా - బారెడు మీసం
  • మీసం కాదురా - మిరియాల పొడుం
  • పొడుం కాదురా - పోతురాజే...బాబోయ్....
"https://te.wikipedia.org/w/index.php?title=ఆటలపాటలు&oldid=4318105" నుండి వెలికితీశారు