శరీరక సౌష్టవం కొరకు, మానసిక ఉల్లాసం కొరకు తర తరాలనుండి ఆటలు ఒక అద్భుతమైన సాధనముగా ఉన్నాయి.ఎవరికి తగిన ఆటలు వారు ఆడుతూ ఉంటారు.

 

ఆడే పద్ధతిః ఆడేవాళ్ళు ఇద్దరుంటారు. 9 నప్పులుంటాయి. ఒకరి తర్వాత ఒకరు, ఒక్కొక్కటి చొప్పున నప్పాలి. ఎవరివైనా మూడు నప్పులు, అడ్డంగా గాని, నిలువుగా గాని ఒకే వరుసలో వస్తే ఒక దాడి జరిగినట్లు. దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి నప్పులలోంచి ఒక నప్పును (దాడి జరగనిది మాత్రమే) తీసుకుంటారు. ఒకసారి దాడి జరిపిన నప్పుని, ప్రక్కకు జరిపి, దానితో మరల దాడి చెయ్యవచ్చును. ఇలా ఆడే ఇద్దరిలో ఎవరివో ఒకరి నప్పులు పూర్తయ్యేవరకు ఆడుకోవచ్చును. మూలలో బాణం గుర్తులున్న కోణాలలో వరసగా నప్పులు పెట్టడం దాడిగా ఒప్పుకోబడదు.

పులి-మేక

మార్చు
 

ఆడే పద్ధతిః

ఆటగాళ్ళుః యిద్దరు, కావలసినవిః 3-పులులు, 15-మేకలు

పైనున్నది కొండ, క్రింద గళ్ళు అడవి, పులులు 3 కొండపైనే వుండాలి. ముందుగా ఒక మేకని అడవిలో వదలాలి, దాన్ని చంపేందుకు ఒక పులిని కొండమీంచి అడవిలోకి దించాలి. పులి కదలికలను బట్టి, మొదటి మేకకు కాపుగా ఇంకో మేకని నప్పాలి. అవసరాన్నిబట్టి ఒక్కొక్క పులిని కొండమీంచి దింపనూనచ్చు, కొండమీదకు పంపనూవచ్చు. ఇలా పులుల కదలికల్ని బట్టి, వాటికి అందకుండా 15 మేకల్ని క్రాస్ ల మీద పేర్చాలి, పులి తన తర్వాతి క్రాస్ మీద ఇన్న మేక మీంచి పైనుండి క్రిందికి కాని, అడ్డంగా గాని దూకవచ్చు. అలా దూకితే ఆ మేక చని పోయినట్లు భావించి ఆటలోనించి తీసేయ్యాలి. ఆయితే ఒక గడి ఎడంగాఉన్నా, లేదంటే వరుసగా వున్న రెండు మూడు మేకల మీంచి గాని పులి దూకకూడదు. ఆలాగే 15 మేకల్తోనూ 3 పులుల్ని కదలకుండా కట్టెయ్యచ్చును. అలా ఎక్కువ మేకలు చనిపోతే పులుల పార్టీ, పులులు కట్టుబడిపోతే మేకల పార్టీ నెగ్గినట్లు. మేకలు పులుల మీంచి దూకలేవు సుమా! ఆడటం అలవాటైతే చదరంగం లాగానే ఆడుకోవచ్చు.

అష్టా చెమ్మ

మార్చు
 

ఆడే పద్ధతిః అష్టా చెమ్మ ఆటలో 4 గవ్వలు ఉంటాయి. వీటిని చేతితో పట్టుకొని తిప్పి నేలమీద వేస్తారు. అవి పడిన తీరును బట్టి గడులలో ఉంచిన కాయలను ముందుకు జరుపుతారు.

వైకుంఠ పాళీ

మార్చు

గోటిబిళ్ళ / బిళ్ళంగోడు / గిల్లి డండా / ఛిల్లా కట్టే

మార్చు

మూరెడు పొడుగున్న (గోడు), జానెడు పొడుగున్న (బిళ్ళ) కావాలి. జానెడు పొడుగున్నబిళ్ళ చివరలని నున్నగా అటూ ఇటూ కదురు లాగా చెక్కాలి. మూరెడు పొడుగున్న గోడుని ఒక పక్క కదురు లాగా చెక్కాలి. నేల మీద సన్నగా చిన్న గుంట తీసి దాని మీద అడ్డంగా చిన్న కర్ర (బిళ్ల) ని పెట్టి, పెద్ద కర్రతో లేపి ఎగిరేలా కొడతారు. 1. అవతలి జట్టు వాళ్ళు ఎగిరిన బిళ్ళ పట్టుకోజూస్తారు. పట్టుకుంటె కొట్టిన వాడు దొంగ అవుతాడు. అంటే ఆట లోంచి తప్పుకోవాలి. 2. కొట్టిన బిళ్ల ఎంత దూరం వెళితే, అంత మంచిది. గుంట నుండి బిళ్ల పడిన పడిన చోటకి ఉన్న దూరాన్ని గోడుతో కొలుస్తారు. ఎవరిది ఎక్కువ దూరం పడితే వాళ్ళు గెలిచినట్టు

కబడ్డీ

మార్చు
 
గ్రామాలలో కబడ్డీ ఆడుతున్న దృశ్యం

కోతి కొమ్మచ్చి

మార్చు

ఈ ఆటలో ముందుగా ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. మిగతా వారిలో ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో గీచిన గీతలోనుండి విసురుతారు. ఇలా వృత్తాకారంలో గీచిన గీతను గిరి అని కూడా పిలుస్తారు. అలా విసిరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరో ఒకరిని తాకగల్గితే అలా దొరికిన అతను తర్వాత దొంగ అవుతాడు. ఒక వేళ దొంగ ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు గిరిలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు.

నేల-బండ

మార్చు

ఈ ఆట ముఖ్యంగా 6 నుండి 13 వరకు వయసు గల బాల బాలికలు ఆడు ఆట. ఈ ఆటను ఎంత మందయినా ఆడవచ్చును. మొదటగా ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. ఈ ఆట ఆడు ప్రదేశమందు మట్టి ప్రదేశము (నేల), రాతి పృదేశము (బండ) ఉండవలెను. ముందుగా దొంగని నేల కావాలో బండ కావాలో కోరుకోమంటారు. ఉదాహరణకి దొంగ నేల కోరుకున్నచో, దొంగ నేల మీద, మిగిలిన వారందరు బండ మీద ఉంటారు. బండ మీద ఉన్నవారు నేల మీదకి వచ్చి దొంగని ఆటపట్టిస్తూ ఉంటారు. దొంగ బండ మీదకి వెళ్లకుండా నేల మీదకి వచ్చిన వాళ్లని పట్టుకోవటానికి ప్రయత్నించవలెను. ఇదియే దొంగ యొక్క ముఖ్య లక్ష్యం. దొంగకి చిక్కిన వారు దొంగ స్థానమును భర్తీ చేస్తారు. ఈ ఆట చిన్న పిల్లలకు బాగా ఇష్టమైన ఆట.

తొక్కుడు బిళ్ళ

మార్చు

బొమ్మల పెళ్ళి

మార్చు

పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు ఆట బొమ్మలను తెచ్చుకుని పెళ్ళి ఆట ఆడుకునేవారు. ఆట బొమ్మలకు పెళ్ళి వస్త్రాలు తొడిగి, వియ్యపువారి బొమ్మలను కూడా పెట్టేవారు. పిల్లలందరూ పెద్దల వేషధారణలో వచ్చి కూర్చుంటారు. పెళ్ళిలోని కన్యాదానం, జీలకర్ర-బెల్లం వంటి ఘట్టాలను నిర్వహించి చివరకు వరుడి బొమ్మ చేతికి చిట్టి మంగళ సూత్రాన్ని తగిలించి వధువు బొమ్మ మెడలో పడేలా చేస్తారు. అయితే సంసారపు శిక్షణ ఇచ్చే ఈ ఆట ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, ఆధునిక చధువులు, పాశ్చాత్య పోకడల వల్ల నేడు ఆట పూర్తిగా అంతరించిపోయింది. భారతీయ సంప్రదాయాన్ని, కుటుంబ వ్యవస్థను ప్రతిబంబించే ఈ ఆటను పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావానికి గురైన నేటి పిల్లలకు తల్లిదండ్రులు తెలిపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది.

గుజ్జన గూళ్ళు

మార్చు

దాగుడుమూతలు

మార్చు
 
అడవిలో దాగుడు మూతలాట ఆడుతున్న పిల్లలు

క్రికెట్

మార్చు

భారతదేశంలో బాగా ఆడే ఆట ఈ క్రికెట్. ఈ ఆట ఆడటానికి రెండు టీంలు వుండాలి. ఒక్కొక్క టీంలో 11 మంది వుంటారు. రమ.

వివిధ రకాల హాకీ గురించి తెలుసు కోవడానికి ప్రధాన వ్యాసం చదవండి.

టెన్నిస్

మార్చు

చదరంగం

మార్చు
 
ఎడమ నుండి వరుసగా సిపాయి, ఏనుగు, గుర్రం, శకటు, మంత్రి, రాజు

భారతీయులచే కనిపెట్ట బడిన ఈ క్రీడ చాలా పురాతనమైనది. ఈ ఆటలో 12 నిలువు 12 అడ్డం వరసలతో కూడిన గళ్ళ బోర్డు ఉంటుంది. ఒకటి నల్ల గడి అయితే ఒకటి తెల్ల గడి. ఆడటానికి పావులు ఉంటాయి. నల్లవి 24 పావులు, తెల్లవి 24 పావులు. వీటిల్లో 12 సిపాయిలు లేదా కాలి బంట్లు, 2 ఏనుగులు,2 శకటాలు,2 గుర్రాలు,1 రాజు,1 మంత్రి లేదా రాణి.

ఆడే విధానం ముందు పావులు పేర్చే విధానం.బోర్డు మన ఎదురుగా పెట్టుకున్నప్పుడు మన ఎడమ పక్క చివర నల్ల గడి ఉండాలి. ఆ చివరి గడిలో, ఈ చివరి గడిలో 2 ఏనుగులూ పెట్టాలి. వాటికి లోపలి పక్కన రెండు వైపులా 2 గుర్రాలూ పెట్టాలి. తరువాత శకటాలు, ఇప్పుడు 2 గళ్ళు మిగులుతాయి. 1 నల్లది, 1 తెల్లది. నల్ల పావులు ఐతే నల్ల రాజు తెల్ల గడిలో, తెల్లవైతే తెల్ల రాజు నల్ల గడిలో ఉంచాలి. మిగిలిందాంట్లో మంత్రి లేదా రాణిని ఉంచాలి.

ఎత్తులు

  • సిపాయి మొట్టమొదట 2 లేదా 1 గడి ముందుకు జరగచ్చు. అక్కడ నుంచి ఒక్క గడి మాత్రమే ముందుకి జరుగుతుంది. చంపడం మాత్రం ఐమూలగా ఎదుట ఉన్న వాటిని చంపుతుంది.
  • ఏనుగు అడ్డంగా గాని, నిలువుగా గానీ ఏవీ అడ్డం లేకపోతే ఆచివరి నుంచి ఈచివరి దాకా రావచ్చు. చంపడంకూడా అలానే చంపుతుంది.
  • గుర్రం ఒక గడి నిలువు, రెండు గళ్ళు అడ్డంగా లేదా రెండు గళ్ళు నిలువు ఒక గడి అడ్డంగా జరుగుతుంది. చంపడం అది ఉన్న చోటి నుంచి ముందు చెప్పినట్లు వెళ్ళి అక్కడ మూడో గళ్ళో పావుని చంపుతుంది.
  • శకటు ఐమూలగా అడ్డం లేకపోతే ఆ చివర నుండి ఈ చివరదాకా వెళ్ళచ్చు. చంపడం కూడా అలానే చంపుతుంది.
  • మంత్రి లేదా రాణి అడ్డం, నిలువు, ఐమూలగా అడ్డం లేకపోతే ఆ చివర నుంచి ఈ చివర దాకా వెళ్ళచ్చు. చంపడం కూడా అలానే చంపుతుంది.
  • రాజు అడ్డం, నిలువు, ఐమూల ఎటైనా ఒక్క గడి జరుగుతుంది. మొదట పావులు కదిపేది మాత్రం ఎప్పుడైనా తెల్ల పావులతో ఆడేవాళ్ళే.

కప్ప తల్లి ఆట

మార్చు

వర్షకాలం ఆరంభమైన, వానలు అనుకున్న సమయానికి రాకుంటే వానల కోసం  గ్రామాల్లో బాలలు ఆటలాడుతూ కప్ప కు పూజలు చేస్తారు.

వామనగుంటలు

మార్చు
 
ఆధునిక వామన గుంటల పీట

ఐదు రాళ్ళ ఆట

మార్చు

ఇంటిపట్టున ఉండే ఆడపిల్లలు ఆడుకునే ఈ ఆటను అచ్చెనగండ్లు అని కూడా అంటారు. ఈ ఆటను చింతగింజలతోను, గచ్చకాయలతో కూడా ఆడుకొందురు.

నాలుగుస్తంభాలాట

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఆటలు&oldid=3963531" నుండి వెలికితీశారు