తెలుగు రాష్ట్రాల గ్రామీణ క్రీడలు

(దాగుడుమూతలు నుండి దారిమార్పు చెందింది)

తెలుగు రాష్ట్రాలలో పిల్లలు ఆడుకునే కొన్ని ఆటలు అన్ని చోట్ల వాడుకలో ఉన్నప్పటికీ అవి గ్రామీణ క్రీడలుగా ప్రసిద్ధి పొందాయి.

క్రీడలు

మార్చు
 

తాడు ఆట

మార్చు

ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు ఆడే ఆట.ఇది ఒక రకమైన వ్యాయామంగా చెప్పుకోవచ్చుఆడపిల్లలు దాదాపు తమ పొడవుగల తాడును చేతులతో తమకాళ్ల క్రిందనుంచి తలపైకిత్రిప్పుతూ, కాళ్లకు తగలకుండా గెంతుతుంటారు. అలా ఏకబిగిని ఎవరు ఎక్కువసార్లు త్రిప్పితే వారు గెలిచినట్లు.దీనితోనే మరొక ఆట కూడా ఆడతారు. పిల్లలందరూ ఒకే చోట ఒకేసారి ఇలా గెంతుతూ బయలుదేరి నిర్దేశించుకున్న స్థలానికి ఎవరు ముందు చేరితే వాళ్ళు గెలిచినట్టు.ఇది కాళ్ళకూ, చేతులకూ, ఏకాగ్రతకూ సంబంధించిన శారీరక శ్రమకు చెందిన ఆట. చక్కని పోటీ మనస్తత్వం, పురోగతిపై ఆకాంక్ష కలిగిస్తుంది ఈ ఆట.[1]

దాగుడు మూతలు

మార్చు
 

దీనిని దొంగ - పోలీస్ ఆట ఇని కూడా అంటారు.ఇది పిల్లలు ఆడుకునే ఆట. ఇందులో ఆటగాళ్ళు చుట్టుపక్కల దాగుంటే, ఒకరు లేదా ఇద్దరు వారిని పట్టుకుంటారు. పట్టుబడిన వాడు/వారు తర్వాత దొంగగా మారి ఇతరులు దాగున్నవార్ని పట్టుకొంటూ ఆట కొనసాగుతుంది. దొంగ సాధారణంగా కళ్ళు మూసుకుని కొన్ని అంకెలు లెక్క పెట్టేలోగా మిగతా వాళ్ళు రహస్య స్థలాల్లో దాక్కోవాలి.[2]

దాడి ఆట

మార్చు
 

ఆడే పద్ధతి ఆడేవాళ్ళు ఇద్దరుంటారు. 9 నప్పులుంటాయి. ఒకరి తర్వాత ఒకరు, ఒక్కొక్కటి చొప్పున నప్పాలి. ఎవరివైనా మూడు నప్పులు, అడ్డంగా గాని, నిలువుగా గాని ఒకే వరుసలో వస్తే ఒక దాడి జరిగినట్లు. దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి నప్పులలోంచి ఒక నప్పును (దాడి జరగనది మాత్రమే) తీసుకుంటారు. ఒకసారి దాడి జరిపిన నప్పుని, ప్రక్కకు జరిపి, దానితో మరల దాడి చెయ్యవచ్చును. ఇలా ఆడే ఇద్దరిలో ఎవరివో ఒకరి నప్పులు పూర్తయ్యేవరకు ఆడుకోవచ్చును. మూలలో బాణం గుర్తులున్న కోణాలలో వరసగా నప్పులు పెట్టడం దాడిగా ఒప్పుకోబడదు.

వెన్నెటి గుడ్లు

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు ఆడుకునే ఆట. వెన్నెల్లో ఎక్కువగా ఆడతారు, కాబట్టి దీనికాపేరు వచ్చింది. ఆటగాళ్ళందరూ ముందుగా రెండు జట్లుగా విడిపోతారు. ఆట ఆడడానికి ఒక ప్రాంతాన్ని దాని సరిహద్దులనూ నిర్ణయించుకుంటారు. ఆ ప్రాంతాన్ని రెండు జట్ల కోసం రెండు సమాన భాగాలుగా విభజించుకుంటారు. ఒక్కో జట్టూ దానికి కేటాయించిన స్థలంలో రహస్యంగా మట్టితో చిన్న చిన్న కుప్పలు (గుడ్లు) పోస్తారు. కొద్ది సేపు పోసిన తరువాత ఒక జట్టు సభ్యులందరూ అవతలి జట్టు వారు రహస్యంగా పోసిన గుడ్లను కని పెట్టాలి. ఇలా వారు కనిపెట్టిన తరువాత ఎన్ని గుడ్లైతే మిగిలాయో అవే వారి స్కోరు. ఏ జట్టు ఎక్కువగా స్కోరు చేస్తుందో ఆ జట్టు గెలిచినట్లు లెక్క.

ఇతర ఆటలు

మార్చు
  1. అష్టా చెమ్మ
  2. వైకుంఠపాళి
  3. కాగితం / కొబ్బరాకు బొమ్మలాట
  4. వామన గుంటలు
  5. ఏడు పెంకులాట
  6. కర్ర బిళ్ల
  7. వంగుళ్ళు దూకుళ్ళు
  8. నేల-బండ/ భూమి-ఆకాశం
  9. నాలుగు స్తంబాలాట
  10. అచ్చన గిల్లలు
  11. పులి మేక (పులిజూదం)
  12. గోళీలాట
  13. తొక్కుడు బిళ్ళ
  14. నాలుగు రాళ్ళ ఆట
  15. ఉప్పు చెర
  16. కళ్ళ గంతలు
  17. గుజ్జన గూళ్ళు
  18. బొంగరాలాట
  19. అంత్యాక్షరి
  20. కుర్చీలాట
  21. కుంటాట/కుంటి ఆట
  22. షో/రాముడు సీత/చిట్టీలాట
  23. దాడి ఆట
  24. టైరు ఆట
  25. వాన వాన వల్లప్ప
  26. రైలు ఆట
  27. లాగుళ్ళు పీకుళ్ళు/తాడాట
  28. తాడుతో గెంతులాట
  29. బాణాలు ఆట
  30. జాలి/చేతి మీది చుక్క ఆట
  31. పొడుపు కథలు
  32. గాలి పటాలు ఎగరేయడం
  33. పడవలాట
  34. బచ్చాలాట
  35. వీపు సాపులు/జొరు బాల్
  36. బ్రైన్ వీటా
  37. రాయికి రంగం-పేడలో బర్రి
  38. బొమ్మ-ప్రాణం/ కరెంట్ షాక్
  39. కాటర్ పిల్లర్/ఏటల బర్రి
  40. పచ్చీసు
  41. ముక్కు గిల్లే ఆట
  42. కలర్స్ ఆట
  43. కోడి పుంజులాట
  44. లండన్ ఆట
  45. వీరి వీరి గుమ్మడి పండు
  46. భుం భుం షకలక

మూలాలు

మార్చు
  1. గోదావరిసీమ జానపద కళలు క్రీడలు వేడుకలు, పడాల రామకృష్ణారెడ్డి, 1991, పేజీ: 397.
  2. "హుషారునిచ్చే పాత ఆటలు | మానవి". NavaTelangana. Archived from the original on 2022-07-15. Retrieved 2022-07-15.

వెలుపలి లంకెలు

మార్చు