ఆట్టో వాన్ గెరిక్

వైద్యునిగా, ఇంజనీరుగా, తత్వవేత్తగా ఆట్టో వాన్ గెరిక్ (Otto von Guericke) కు శాస్త్ర లోకంలో ఎంతో పేరు ఉంది. మొట్టమొదటి ఎయిర్ పంపుని రూపొందించిన వాడు గెరిక్. దహన క్రియలో, శ్వాస క్రియలో గాలి పాత్ర గురించిన ఆలోచనలకు బీజాలు వేసింది ఈయనే. శూన్య ప్రదేశం గురించి వివరణలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేసింది కూడా ఈయనే యని చెప్పాలి.

ఆట్టో వాన్ గెరిక్
ఆట్టో వాన్ గెరిక్,
జననంనవంబర్ 20, 1602
మాగ్డెబర్గ్, జర్మనీ
మరణంమె 11, 1686 (వయస్సు 83)
హాం బర్గ్, జర్మనీ
పౌరసత్వంజర్మన్
జాతీయతజర్మన్
రంగములుభౌతిక శాస్త్రము, రాజనీతిజ్ఞుడు
ప్రసిద్ధిశూన్య ప్రదేశం గూర్చి ప్రయోగములు

గెరిక్ ఆగర్భ శ్రీమంతుడు. లెయిప్జిగ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం కొనసాగించాడు. జీనా విశ్వవిద్యాలయం నుంచి 1621 లో న్యాయ శాస్త్రం లోనూ, లీడన్ విశ్వవిద్యాలయం నుంచి 1622 లో గణిత శాస్త్రం, ఇంజనీరింగ్ లలోనూ, పట్టాలను స్వీకరించిన గెరిక్ 1631 లో రెండవ గస్తవస్ ఆడోల్ఫన్ సైన్యంలో (స్వీడన్) ఇంజనీర్ గా ప్రవేశించాడు.

1646 నుంచి 1681 వరకు మాబ్డసర్గ్ కు మేయర్ అవడం కూడా చాలా గమ్మత్తుగా జరిగింది. 1618 లో జర్మనీలో యుద్ధం ప్రారంభమై 30 సంవత్సరాలు వరకు సాగింది. గెరిక్ ఇంజనీర్ గా యుద్ధంలో ఎంతో చురుకుగా పాల్గొన్నప్పటికీ ఓడిపోయి శత్రువుల చేత మాగ్డె బర్గ్ కు తరలించబడ్డాడు. ఆ పట్టణం మొత్తం నాశనమై పోయింది. 30 వేల మందిదాకా మరణించారు. కాని గెరిక్ ఎలాగో బతికి బట్టకట్టి ఆ పట్టణాన్ని తిరిగి నిర్మించి దానికి మేయర్ కాగలిగాడు. 35 ఏళ్ళ పాటు ఆ పదవిలోనే ఉండగలిగాడు.

మేయర్ గా విసుగు విరామం లేకుండా ఉన్నప్పటికీ పరిశోధనలను మాత్రం గెరిక్ మానలేదు. అరిస్టాటిల్ శూన్య ప్రదేశం ఉండడం అసంభవమని అనటాన్ని ఈయన ఒప్పుకోలేక పోయాడు. గెలీలియో గాలికి బరువు ఉందని చెప్పిన సంగతి కూడా ఈయనకు తెలుసు. టోరసెల్లీ భారమితి గురించి కూడా ఈయన విని ఉన్నాడు. ఈ పరిశీలనలను దృష్టిలో పెట్టుకును 1650 లో శూన్య ప్రదేశాన్ని ఏర్పరచ గెలిగే ఎయిర్ పంప్ ను ఈయన ఆవిష్కరించాడు. అంతే కాదు. శూన్యం గుండా కాంతి ప్రసారం అవుతుంది. కాని శబ్దం ప్రసారం కాలేదని కూడా ఈయన తెలియ జేశాడు. పోతే శూన్య ప్రదేశంలో దీపాలు వెలగవని, ప్రాణులు బతకలేవని కూడా ఈయనప్రకటించాడు.

Guericke's experiments with the sulfur globe published 1672

ఈయన ఎన్నో రకాల వాక్యూం మెషీన్లను తయారుచేశాడు. శూన్య ప్రదేశం లేదా వాక్యూంకు ఉన్న శక్తి ఎంతటిదో కూడా ఈయన ఋజువు చేశాడు. 14 అంగుళాల వ్యాసం ఉన్న రెండు రాగి అర్థ గోళాలను ఒకటిగా చేర్చి మధ్యలో శూన్య ప్రదేశాన్ని సృష్టిస్తే ఆ అర్థ గోళాలను విడగొట్టడం అసథ్యమని నిరూపించాడు. 16 గుర్రాలు లాగితే తప్ప అర్థ గోళాలు విడిపోవక పోవటం ఆశ్చర్యం గానే తోస్తుంది. శూన్య ప్రదేశానికి ఉన్న శక్తి అటువంటిది.

1663 లో జాన్ గెరిక్ ఇలక్ట్రిక్ జనరేటర్ ను కూదా రూపొందించాడు. అంతే కాదు విద్యుత్ ఉద్దీపనాన్ని గురించి 1672 లో ఈయనే మొదటిసారిగా తెలిపాడు. వాన్ గెరిక్ " తోకచుక్కలు క్రమానుగతంగా దర్శనమిస్తూ ఉంటాయని" కూడా చెప్పాడు. 1686 లో హాంబర్గ్ లో ఈయన చనిపోయే నాటివరకు విజ్ఞాన తృష్ణ ఈయనను వన్నంటే ఉంది. ఈయన గతించినా ఆ తుష్ణ అంతకంతకు పెరుగుతూనే ఉంది.

బయటి లింకులు

మార్చు