ఆడదే ఆధారం (ధారావాహిక)
ఆడదే ఆధారం (ధారావాహిక) 2009, జనవరి 26న ఈటివి తెలుగులో ప్రారంభమైన తెలుగు ధారావాహిక. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం ప్రసారం చేయబడిన ఈ సీరియల్[1] మొత్తం 3329 ఎపిసోడ్లతో 2020, మార్చి 14న ముగిసింది.[2][3][4]
ఆడదే ఆధారం | |
---|---|
తరం | కుటుంబ నేపథ్యం |
తారాగణం | పల్లవి రామిశెట్టి మధులిక షాక్ మధన్ బీ |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సిరీస్‌ల | సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 3,329 |
ప్రొడక్షన్ | |
నడుస్తున్న సమయం | సుమారు 22 నిముషాలు |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | ఈటీవీ |
వాస్తవ విడుదల | 2009 జనవరి 26 14 మార్చి 2020 | –
బాహ్య లంకెలు | |
Website |
కథా సారాంశంసవరించు
తన జీవితంలో వివిధ సమస్యలను ఎదుర్కొంటూ, కష్టపడుతూ, ముందుకు సాగే ఒక మహిళ గురించిన సీరియల్ ఇది. ఇందులో లాయర్ ‘అమృత’ ప్రధాన పాత్ర. వికాస్ అనే ధనవంతుడు రేణుకపై కన్నేశాడు. వికాస్ స్నేహితుడు సాగర్ పొరపాటున అమృతను కిడ్నాప్ చేస్తాడు. మరుసటి రోజు, ఆమె తన హాస్టల్ కు తిరిగి వస్తుంది. ఒక రాత్రి వేరేచోట గడిపినందుకు సమాజం, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఒంటరిని చేయగా, బాధితురాలిగా మారుతుంది. అధిగమించలేని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె జీవితంలో ముందుకు సాగుతుంది. ఆమె ధైర్యం వికాస్‌తో సహా నేరస్తులతో పోరాడేలా చేస్తుంది. సమాజంలో తనదైన ముద్ర వేయడానికి ఆమె తన జీవితంలో ఒక్కోమెట్టు ఎక్కుతూ విజేతగా నిలుస్తుంది.
నటవర్గంసవరించు
- పల్లవి రామిశెట్టి (అమృత)
- మధులిక
- షాక్ మధన్ బీ (మధు)
- రాజశ్రీ నాయర్
- సుజాత రెడ్డి
- సాధన
- సింధూర
- లక్ష్మిశ్రీ
- శోభ
- అమూల్య
- దీప్తి
- ఆదిత్య
- సింధుర దర్శనం