పల్లవి రామిశెట్టి

తెలుగు టెలివిజన్ నటి

పల్లవి రామిశెట్టి తెలుగు టెలివిజన్ నటి. ఈటీవీలో వచ్చిన సీరియళ్ళ ద్వారా గుర్తింపు పొందిన పల్లవి, భార్యామణి సీరియల్‌లోని పాత్రకు ఉత్తమనటిగా నంది అవార్డు (2011) అందుకుంది.[1]

పల్లవి రామిశెట్టి
జననంఅక్టోబరు 11, 1993
జాతీయతభారతీయురాలు
వృత్తితెలుగు టెలివిజన్ నటి
జీవిత భాగస్వామిదిలీప్ కుమార్

జీవిత విషయాలు

మార్చు

పల్లవి 1993, అక్టోబరు 11న కృష్ణా జిల్లా, అవనిగడ్డలో జన్మించింది. తండ్రి ఉద్యోరిత్యా కుటుంబంతో కొంతకాలం బెంగళూరుకు వెళ్ళింది. ఆ తరువాత హైదరాబాదుకు వచ్చి, ఉప్పల్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 10వ తరగతి వరకు చదివింది. 2019లో దిలీప్ కుమార్‌తో పల్లవి వివాహం జరిగింది.[2]

టివిరంగం

మార్చు

10వ తరగతి చదువుతున్న సమయంలో ఈటివి ఆడిషన్స్‌కు వెళ్ళింది. ఈటివిలో వచ్చిన రంగుల కళ కార్యక్రమంకి వ్యాఖ్యాతగా ఎంపికై, టీవీరంగంలోకి ప్రవేశించింది.[3][4] ఆ తరువాత నటిగా సీరియళ్ళలో నటించింది. భార్యామణి సీరియల్‌లో అలేఖ్య పాత్రలో, ఆడదే ఆధారం సీరియల్‌లో అమృత పాత్రలో నటించింది.[5]

సీరియళ్ళు

మార్చు

కార్యక్రమాలు

మార్చు

అవార్డులు

మార్చు
  1. ఉత్తమ నటి - 2011 టివి నంది అవార్డు (భార్యామణి)[6]

మూలాలు

మార్చు
  1. "Telugu television actress Pallavi status in teleserials". nettv4u. Retrieved 2020-07-31.
  2. Celebrity Wikis, Television Actress (13 March 2020). "Pallavi Ramisetty Bio". www.celebritywikis.com. Archived from the original on 23 అక్టోబరు 2020. Retrieved 31 July 2020.
  3. "Pallavi is a big fan of Suriya - Times of India". The Times of India. Retrieved 2020-07-31.
  4. "New show 'Maate Mantramu', starring Ali Reza and Pallavi to begin from tonight - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-07-31.
  5. Andhrajyothi (26 April 2021). "అచ్చ తెలుగు అభినయం". Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 26 April 2021.
  6. vittal (2012-11-13). "2011 బుల్లితెర నందివర్ధనాలు". www.telugumirchi.com. Archived from the original on 2023-01-31. Retrieved 2023-01-31.

ఇతర లంకెలు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పల్లవి రామిశెట్టి పేజీ