ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10న జరుపుకుంటారు.[1] ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలను నివారణకోసం ప్రజల్లో అవగాహన కలిగించడానికి 2003వ సంవత్సరం నుండి ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది.[2]

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
జరుపుకొనేవారుఅంతర్జాతీయంగా
ప్రారంభంసెప్టెంబరు 10, 2003
ఆవృత్తివార్షికం

ప్రారంభం

మార్చు

ఆత్మహత్యల నివారణ కోసం అంతర్జాతీయ అసోసియేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్యలతో కలిసి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.[3]

2003లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ మొదటి కార్యక్రమంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ 1999లో ప్రపంచ ఆత్మహత్యల నివారణకు చూపిన చొరవ దాని అమలుకొరకు చేసిన ప్రణాళికలకు సంబంధించి ప్రస్తావించబడింది. ఆత్మహత్యకు ముందు ప్రవర్తనల గురించి అవగాహన పెంచడానికి, వాటిని ఎలా సమర్థవంతంగా నిరోధించాలో తెలియజేయడానికి ప్రపంచ, ప్రాంతీయ, జాతీయ బహుళ-రంగ కార్యకలాపాల సంస్థ ఏర్పాటుచేయాలని, ఆ సంస్థ ద్వారా జాతీయ విధానాలు, ఆత్మహత్యల నివారణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి, అంచనా వేయడానికి దేశాల సామర్థ్యాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.[4]

2014లో విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్య నివేదిక ప్రకారం, తక్కువ ఆదాయం ఉన్న దేశానికి జాతీయ ఆత్మహత్యల నివారణ ప్రణాళిక లేదని, తక్కువ-మధ్యతరగతి ఆదాయపు దేశాలలో 10% కన్నా తక్కువగా, ఎగువ-మధ్య-అధిక ఆదాయ దేశాలలో దాదాపు మూడవ వంతుగా ఉన్నట్లు నివేదించింది.[5]

కార్యక్రమాలు

మార్చు

2011లో ఒక అంచనా ప్రకారం ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ 40 దేశాలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాయి.[6]

  1. ప్రపంచ ఆత్మహత్యల నివారణ వారోత్సవాల సందర్భంగా మానసిక వైద్య నిపుణులచే సదస్సులు నిర్వహిస్తారు.
  2. ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ దినోత్స‌వం గుర్తుగా పసుపు, నారింజ రంగు రిబ్బ‌న్ల‌ను చేతుల‌కు క‌ట్టుకుని ఆత్మ‌హ‌త్య‌లు వ‌ద్దు - నిండైన జీవితం ముద్దు అంటూ నినాదాలు చేస్తూ, అవగాహన ర్యాలీ నిర్వ‌హిస్తారు.

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (10 September 2015). "'ఆత్మహత్య' ఎందుకు చేసుకుంటారంటే..." www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
  2. "Alaska Observes World Suicide Prevention Day and Alaska Suicide Prevention Month". SitNews. 11 September 2004. Retrieved 8 July 2020.
  3. "Suicide in the U.S.A. Based on Current (2007) Statistics" (PDF). American Association of Suicidology. Archived from the original (PDF) on 2 జూన్ 2012. Retrieved 8 July 2020.
  4. "Celebrating the 1st World Suicide Prevention Day 10 September 2003". Press Release. International Association for Suicide Prevention. Archived from the original on 3 నవంబరు 2011. Retrieved 8 July 2020. adapted from the chapter on "Self-Directed Violence" from the World Report on Violence and Health, World Health Organization, Geneva, 2002.
  5. "2014 Mental health Atlas" (PDF). World Health Organization. 2015. Retrieved 8 July 2020.
  6. QMI Agency (10 September 2011). "Inuit youth celebrate life on World Suicide Day". London Free Press. Archived from the original on 20 August 2017. Retrieved 8 July 2020.
  • సాక్షి దినపత్రిక - 10-09-2014 - (ఆత్మహత్య అంటే! ఆపగలిగిన మరణం!! - నేడు ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం)

ఇతర లంకెలు

మార్చు