ఆదిరెడ్డి భవాని

ఆదిరెడ్డి భవాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు కూతురు, శ్రీకాకుళం లోక్‍సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన నాయుడు సోదరి.[1]

ఆదిరెడ్డి భవాని
ఆదిరెడ్డి భవాని


శాసనసభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 నుండి ప్రస్తుతం
నియోజకవర్గం రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1985
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి ఆదిరెడ్డి శ్రీనివాస్
సంతానం జయేష్ నాయుడు
నివాసం రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
పూర్వ విద్యార్థి ఐ.ఐ.ఎల్.ఎం యూనివర్సిటీ

జననం,విద్యాభాస్యంసవరించు

ఆదిరెడ్డి భవాని 1985లో కింజరాపు ఎర్రన్నాయుడు, విజయకుమారి దంపతులకు జన్మించింది. ఆమె న్యూ ఢిల్లీలోని ఐ.ఐ.ఎల్.ఎం యూనివర్సిటీలో ఎం.ఎస్సీ పూర్తి చేసింది.

రాజకీయ జీవితంసవరించు

ఆదిరెడ్డి భవాని రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె నాన్న కింజరాపు ఎర్రన్నాయుడు మాజీ కేంద్రమంత్రి, ఆమె మామ ఆదిరెడ్డి అప్పారావు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ. భవాని 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్సీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్‌రావు పై 30,065 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టింది.[2][3]

మూలాలుసవరించు

  1. The Hans India, The Hans (6 March 2019). "Adireddy Bhavani to be TDP candidate in Rajamahendravaram". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
  2. Sakshi (24 May 2019). "Rajahmundry city Constituency Winner List in AP Elections 2019". www.sakshi.com. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
  3. BBC News తెలుగు (24 May 2019). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే". BBC News తెలుగు. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.