ఆది శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయనను 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వేములవాడ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

ఆది శ్రీనివాస్

ప్ర‌భుత్వ విప్‌
పదవీ కాలం
2023 డిసెంబర్ 15 - ప్రస్తుతం

పదవీ కాలం
2023 డిసెంబర్ 3 - ప్రస్తుతం
నియోజకవర్గం వేములవాడ

వ్యక్తిగత వివరాలు

జననం 15 సెప్టెంబర్ 1966
రుద్రంగి, రుద్రంగి మండలం, రాజన్న జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు గోవిందు
జీవిత భాగస్వామి వనజ
సంతానం మానస, కార్తీక్

రాజకీయ జీవితం మార్చు

ఆది శ్రీనివాస్ 1985లో నిజామాబాద్ ఐటీఐ విద్యార్థి సంఘం కార్యదర్శి పని చేసి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1987 నుండి 1995 వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి, 1995లో జడ్పీటీసీగా, 1997లో ఏపీసీసీ సభ్యునిగా, 1997 నుండి 2000 వరకు కరీంనగర్ జడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా పని చేశాడు.[3]

ఆది శ్రీనివాస్ 2001 నుంచి చందుర్తి ఎంపీపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 1,821 ఓట్ల స్వల్ప తేడాతో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో చివరిక్షణంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 5,286 ఓట్ల తేడాతో, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయాడు.

ఆది శ్రీనివాస్ ఆ తరువాత రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతూ, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుపై 14581 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై[4][5][6], 2023 డిసెంబర్ 9న శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[7] ఆది శ్రీనివాస్ ను 2023 డిసెంబర్ 15న ప్ర‌భుత్వ విప్‌గా ప్ర‌భుత్వం నియ‌మించింది.[8]

మూలాలు మార్చు

  1. Eenadu (10 November 2023). "పట్టు వదలని విక్రమార్కులు". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  2. TV9 Telugu (15 October 2023). "తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. పోటీలో నిలిచేది వీరే." TV9 Telugu. Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (4 December 2023). "ఆది నుంచి ఆధిక్యమే". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  4. Namaste Telangana (4 December 2023). "తొలిసారి అధ్యక్షా..!". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  5. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  6. Eenadu (4 December 2023). "ఎట్టకేలకు గెలుపు తలుపు తట్టింది". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  7. Namaste Telangana (10 December 2023). ".. అనే నేను శాసనసభ సభ్యుడిగా!". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  8. Namaste Telangana (15 December 2023). "ప్ర‌భుత్వ విప్‌లుగా న‌లుగురు ఎమ్మెల్యేలు.. నియమించిన ప్రభుత్వం". Archived from the original on 15 December 2023. Retrieved 15 December 2023.