ఆదూరి వెంకటసీతారామమూర్తి

తెలుగు రచయిత

ఆదూరి వెంకటసీతారామమూర్తి తెలుగు రచయిత. విశాఖ సాహితి సభ్యుడు. ఇతడు 1947లో పొందూరులో జన్మించాడు. ఇతడు చిన్నతనం నుంచే కథలూ, కవిత్వమూ, నాటికలూ రాయడం మొదలుపెట్టాడు. తెలుగునాట ఉన్న అన్ని పత్రికలలో ఇతని కథలు ప్రచురితమయ్యాయి. తొమ్మిది సార్లు తన కథలకు బహుమతులు పొందాడు. ఇతడు నవలలూ, కొన్ని నవలికలూ, రేడియో నాటికలూ కూడా వ్రాశాడు. ఇతని భార్య ఆదూరి సత్యవతీదేవి కూడా కవయిత్రిగా పేరు గడించింది.

ఆదూరి వెంకటసీతారామమూర్తి
ఆదూరి వెంకటసీతారామమూర్తి
జననంఆదూరి వెంకటసీతారామమూర్తి
(1947-04-22) 1947 ఏప్రిల్ 22 (వయసు 77)
పొందూరు
నివాస ప్రాంతంవిశాఖపట్నం
సంస్థవిశాఖపట్నం పోర్ట్ ట్రస్టు
ప్రసిద్ధితెలుగు కథా రచయిత, నవలా రచయిత
Notable work(s)అదిగో పులి,
ఉత్సవ కానుక,
రాగ వీచికలు,
తీపిగురుతు
పదవి పేరుఅకౌంట్స్ ఆఫీసర్ (రిటైర్డ్)
భార్య / భర్తఆదూరి సత్యవతీదేవి
పిల్లలురాజ్‌కుమార్,
వెంకట భార్గవరామ్‌
బంధువులుసూర్యకాంతం (అక్క),
హేమశంకర్ (తమ్ముడు),
కమలలత (చెల్లెలు)
తండ్రిపేర్రాజు
తల్లిసత్యవతి

జీవిత విశేషాలు

మార్చు

ఆదూరి వెంకటసీతారామమూర్తి 1947, ఏప్రిల్ 22వ తేదీన శ్రీకాకుళం జిల్లా (అప్పటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా), పొందూరులో ఒక నియోగ బ్రాహ్మణ కుటుంబంలో పేర్రాజు, సత్యవతి దంపతులకు రెండవ సంతానంగా జన్మించాడు.[1] ఇతని తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఇతని బాల్యం పొందూరు, వాల్తేరు (విశాఖపట్నం), వంశధార, విజయనగరం లలో గడిచింది. ఇతడు 5వ తరగతి వరకు ప్రైవేటుగా, ఫస్ట్ ఫారం నుండి థర్డ్ ఫారం వరకు విజయనగరం మునిసిపల్ హైస్కూలులో చదివాడు. 1958లో విశాఖపట్నంలోని మిసెస్ ఎ.వి.ఎన్.కాలేజీ హైస్కూలులో ఫోర్త్ ఫారంలో చేరి ఎస్.ఎస్.ఎల్.సి, ప్రి యూనివర్సిటీ వరకు అక్కడే చదివాడు. అదే కళాశాలలో బి.ఎస్.సి డిగ్రీ 1966లో పూర్తి చేశాడు.

చదువు ముగిసిన వెంటనే ఇతడు విశాఖపట్నం పోర్ట్ ట్రస్టు ఫైనాన్స్ విభాగంలో చేరాడు. 1970లో ఫైనాన్స్ విభాగం నుండి అకౌంట్స్ విభాగానికి బదిలీ అయ్యి 2001లో అకౌంట్స్ ఆఫీసర్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ గావించాడు.

1969, మే 23వ తేదీన ఇతడు సత్యవతీదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి రాజ్‌కుమార్, వెంకట భార్గవరామ్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సాహిత్యరంగం

మార్చు

ఇతని తండ్రి సాహిత్యాభిమాని. సాహిత్యానికి చెందిన ఎన్నో పుస్తకాలను, పత్రికలను కొని చదివేవాడు. వారి ఇంటిలో స్వంత గ్రంథాలయం ఉండేది. దీనితో ఇతనికి బాల్యం నుండి పుస్తకాలతో పరిచయం ఏర్పడింది. 1966లో పోర్టు ట్రస్ట్‌లో ఇతనికి పాలూరి వెంకటరావు, అత్తిలి కృష్ణారావు వంటివారితో పరిచయం ఏర్పడి రచనలు చేయడానికి ప్రోత్సాహం లభించింది. అదే సంస్థలో పనిచేస్తున్న మల్లాప్రగడ రామారావు ఇతడిని స్థానిక రచయితల సంఘం విశాఖ సాహితిలో చేరవలసినదిగా ఆహ్వానించాడు. విశాఖ సాహితిలో చేరిన తరువాత ఇతడు తన రచనలకు మరిన్ని మెరుగులు దిద్దుకుని ఉత్సాహంగా రచనలు చేశాడు. పోర్టు ట్రస్ట్‌లో సంస్థాగతంగా ఉన్న "లహరి" అనే సాంస్కృతిక విభాగంలో చురుకుగా పాల్గొన్నాడు. పోర్టు ట్రస్ట్‌ గృహపత్రిక "సాగరిక" సంపాదకవర్గంలో సభ్యుడిగా ఉన్నాడు. ఇతడు ఆకాశవాణి కోసం రత్నగర్భ, ఎదురు చూసిన రోజు, జ్ఞానోదయం, రెక్కలొచ్చాయి, మేడిన్ హెవెన్, సూత్రధారి, ఓనమాలు, అరుణ కిరణాలు మొదలైన హాస్య, వ్యంగ్య నాటికలు రచించాడు. పానుగంటి లక్ష్మీనరసింహారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనలను రేడియో అనుసరణ చేశాడు.[1]

గుర్తింపులు

మార్చు

ఇతని కథలు ఆంగ్లం, హిందీ, తమిళము, ఒడియా భాషలలోకి అనువదించబడ్డాయి. ఇతని నవలలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వడిత్యా అన్నామణి అనే పరిశోధకురాలు 2021లో పి.హెచ్.డి చేసింది. తెలుగు విశ్వవిద్యాలయంలో ఇతని తీపిగురుతు నవలపై ఎం.ఫిల్. పరిశోధన జరిగింది. ఇతని కథ "శిల్పి" యువ మాసపత్రిక నుండి "చక్రపాణి అవార్డ్"ను గెలుచుకుంది. ఈ కథను మహారాష్ట్ర ప్రభుత్వం తమ 10వ తరగతి తెలుగు పుస్తకం "కుమార భారతి"లో పాఠ్యాంశంగా చేర్చింది.

రచనలు

మార్చు

కథా సంపుటాలు

మార్చు
  • అదిగో పులి
  • ఆత్మ ధృతి
  • ఉత్సవ కానుక
  • వర్ణచిత్రం
  • వెన్నెల్లో పావురాళ్లు

కథల జాబితా[2]

మార్చు
  • అంతట నీవేనమ్మా!
  • అంతరాలు
  • అంతస్తులు
  • అంతా బాగానే వుంది
  • అందని జాబిలి
  • అగ్గిపుల్ల ...
  • అగ్ని ఆరితే చీకటే
  • అదిగో పులి
  • అద్దమూ అమ్మాయీ
  • అద్దాల తలుపులకు అటూ ఇటూ
  • అనంతం
  • అనంతలక్ష్మీ అమెరికా ప్రయాణం
  • అనుభవాలకు ఆదికావ్యం
  • అన్నమ్మ
  • అపశృతి
  • అభిమానం
  • అమ్మ
  • అమ్మాయిపెళ్లి
  • అలారాసి పెట్టివుంది
  • అసలు రహస్యం
  • ఆత్మతృప్తి
  • ఆత్మధృతి
  • ఆనందపురం వెళ్లాలి
  • ఆవిష్కరణ
  • ఆశ
  • ఆశల దివ్వెలు
  • ఇంతేలే కథలింతేలే
  • ఇలాగ తీరింది
  • ఈ చీకటి విడిపోలేదు
  • ఈ నిజం తెలుసుకో
  • ఈ లోకంలో యిలాగే
  • ఈర్ష్య
  • ఉత్సవకానుక
  • ఊరట
  • ఎక్స్‌ప్లాయిటేషన్
  • ఎన్నాళ్లో వేచిన ఉదయం
  • ఎన్నిక
  • ఎరువిచ్చి చూడు
  • ఎర్రమందారం
  • ఎవరికి
  • ఎవరికి ఎవరు
  • ఏది నీతి?
  • ఒక ఇరవై నాలుగుగంటలు
  • ఒక భగీరథుని కథ
  • ఓ నీతి కథ
  • ఓ పర్సు కథ
  • ఓ మహిషాత్మ కథ
  • ఓనమాలు
  • కడుపునింపే కళ
  • కథ మారింది
  • కథ...సినిమాకత
  • కథకుడి కథ
  • కన్నీటిబిందు
  • కుడి ఎడమైతే
  • కూడలి
  • గతి
  • గమ్యం
  • గలగలా గోదారి
  • గాలిమొక్క
  • గూడు
  • గోదారి సంబంధం
  • గోరింటపండింది
  • చిట్టిపెళ్లి
  • చిన్నమనసు
  • చిలకాకుపచ్చరంగుజరీచీర
  • చీకటి తెరలు
  • చీట్లిచ్చారు గాదా?
  • చెర
  • చెలియలి కట్ట
  • చేపా చేపా! పడలేదేం?
  • చైతన్యదీపాలు
  • జీవిత మకరందం
  • జీవితానికి అర్ధం
  • జోస్యం
  • జ్ఞానోదయం
  • తంటాతెచ్చిన తాంబులం
  • తప్పు తాళం కప్పదే
  • తరుశాఖ
  • తుఫానులో పిల్లగాలి
  • తెరలు
  • తెరువు
  • తేడా
  • తోడు
  • దర్శనం
  • దొంగలు
  • దోపిడీ
  • నా చిన్నప్పటి కథ
  • నామకరణం
  • నిప్పులేని పొగ
  • నీకోసమే నువ్వు!
  • పంజరం
  • పందెం
  • పచ్చదనం
  • పచ్చని చిలకలు రెండు
  • పల్లవించిన పాట
  • పాట పయనమైన వేళ
  • పాటలతో పాట్లు
  • పారిజాతం
  • పిల్లగాలి
  • పుత్రకామేష్టి
  • ప్రకృతి
  • ప్రకృతి చిత్రం
  • ప్రధానితో మాట్లాడాలి!
  • ప్రయాణం
  • ప్రయాణంలో పదనిసలు
  • ప్రస్థానం
  • ప్రేమకోరిక
  • బంధం
  • బహుళ చంద్రిక
  • బాధితుడు
  • బాధే సౌఖ్యమని...
  • బామ్మా నేనూ నీ మనవడినే
  • బ్రతకనేర్చిన వాళ్లు
  • బ్రహ్మముడి
  • భలేమంచి చౌక బేరము
  • భ్రమ
  • మంటల్లోంచి మల్లెపొదలు
  • మనసు చెప్పని మాట
  • మనసున్న మనిషి
  • మనోరీతి
  • మమకారం
  • మరో హిమాలయం
  • మరోదారి
  • మలుపు
  • మల్లెలు నవ్వేయి
  • మామూలు కథ
  • మీ బిడ్డనే నాన్నా
  • ముకుందరావుగారి ముందుగది
  • మేడమీది జాబిలి
  • మేడిన్ హెవెన్
  • యోగం
  • రాంగ్ నంబర్
  • రామంకథ
  • రాళ్లెత్తిన కూలీ
  • రేపటి వెలుగు
  • లంకా దహనం
  • లోవెలుగు
  • లౌలోనాయుడు
  • వంతెన
  • వర్ణచిత్రం
  • వసంతం వెళ్లిపోయింది
  • వాడిమధ్యాహ్నభోజనం
  • విష్ణుమాయ
  • వెన్నెట్లో సూరీడు
  • వ్యాపారం
  • శిల్పి
  • శివుని ఆజ్ఞ
  • శుభాకాంక్షలు
  • సంక్రాంతి
  • సంగమం
  • సందెగాలి
  • సంధ్య అంచున
  • సంసారంలో హింసావాదం
  • సబ్బుబిళ్ల
  • సర్దుబాటు
  • సర్వం జగన్నాధం
  • సిగ్నల్
  • సుందరమన్మధం
  • సుబ్బారావోపాఖ్యానం
  • సూత్రధారి
  • సొల్యూషన్
  • స్నేహం కన్నా గొప్పది
  • స్నేహం
  • స్వతంత్రదేశంలో ఓ రోజు
  • రాగ వీచికలు
  • చైతన్య దీపాలు
  • ఈశ్వర అల్లా తేరేనామ్‌
  • తీపిగురుతు

నాటికలు[1]

మార్చు
  • ఓనమాలు
  • సూత్రధారి
  • కొమ్మకొమ్మకో సన్నాయి
  • ఆండాళమ్మ

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 వడిత్యా అన్నామణి (12 February 2021). ఆదూరి వెంకట సీతారామమూర్తి నవలలు - పరిశీలన. pp. 1–30. Retrieved 12 December 2023.
  2. వెబ్ మాస్టర్. "రచయిత: ఆదూరి వెంకటసీతారామమూర్తి". కథానిలయం. కథానిలయం. Retrieved 12 December 2023.