ఆనందమోహన్ బోస్
ఆనందమోహన్ బోస్, (జ.1847 సెప్టెంబరు 23- మ.1906 ఆగష్టు 20) బ్రిటిష్ భారతదేశం, బెంగాల్ ప్రావిన్స్‌లోని మైమెన్సింగ్ జిల్లా, జయసిద్ధి గ్రామంలో జన్మించాడు. (ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని కిషోర్‌గంజ్ జిల్లా, ఇట్నా ఉపజిల్లా).ఇతను బ్రిటిష్ పరిపాలన సమయంలో ఒక భారతీయ రాజకీయవేత్త, విద్యావేత్త, సామాజిక సంస్కర్త, న్యాయవాది, భారతదేశ మొదటి రాంగ్లర్, స్వాతంత్ర్య ఉద్యమానికి మార్గదర్శకుడు.[1]
ఆనందమోహన్ బోస్ | |
---|---|
జననం | |
మరణం | 1906 ఆగస్టు 20 | (వయసు 58)
విద్యాసంస్థ | కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం |
వృత్తి | రాజకీయవేత్త, విద్యావేత్త, సామాజిక సంస్కర్త, న్యాయవాది |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఇండియన్ నేషనల్ అసోసియేషన్ సహ వ్యవస్థాపకుడు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | స్వర్ణప్రభా బోస్ |
అతను భారత ప్రారంభ రాజకీయ సంస్థలలో ఒకటైన భారత జాతీయ సంఘాన్ని స్థాపించాడు. భారత జాతీయ కాంగ్రెసులో సీనియర్ నాయకుడు.1874లో అతను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో కశాశాల సమస్యలలో పోరాడే మొదటి భారతీయ విద్యార్థి. గణితశాస్త్రంలో నిష్ణాతుడుగా మూడవ సంవత్సరం మొదటి తరగతి గౌరవాలతో పూర్తిచేసిన విద్యార్థిగా గణతికెక్కాడు. అతను ప్రముఖ బ్రహ్మోయిజం మతనాయకుడు, శివనాథ్ శాస్త్రి స్థాపించిన ఆదిధర్మో ప్రధాన ప్రతినిధి.[2] [3]
జీవితం తొలిదశ
మార్చుఆనంద మోహన్ బ్రిటిష్ భారతదేశం, బెంగాల్ ప్రావిన్స్‌లోని మైమెన్సింగ్ జిల్లా, జయసిద్ధి గ్రామంలో జన్మించాడు (ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని కిషోర్‌గంజ్ జిల్లా, ఇట్నా ఉపజిల్లా). అతని తండ్రి పద్మలోచన్ బోస్, తల్లి ఉమాకిషోరి దేవి.అతను కలకత్తా విశ్వవిద్యాలయం కింద, మైమెన్సింగ్ జిల్లా స్కూల్ నుండి తన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.1862లో మొదటి శ్రేణిని పొందాడు. అతను తన యఫ్ఎ., బిఎ., పరీక్షలను కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాల నుండి ఉత్తీర్ణత సాధించాడు. రెండు పరీక్షలలో మొదటి స్థానాన్ని పొందాడు.1870లో అతను కేశవ్ చంద్ర సేన్‌తో పాటు ఉన్నత విద్యకోసం ఇంగ్లాండ్ వెళ్లాడు.
మోహన్ బోస్ 1870లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి మొదటిశ్రేణిలో పట్టాను పొందాడు.[4] కళాశాల మొత్తం విద్యార్థులలో, ఏమైనా సమస్యలపై కళాశాల పోరాటాలలో ముందుండే విద్యార్థి. బ్రిటన్‌లో ఉన్నప్పుడు, బోస్ న్యాయవాది వృత్తికి మారటానికి న్యాయవిద్య అభ్యసించాడు. 1874లో న్యాయవాద వృత్తికి అర్హత పొందాడు.[4] 1870లో అతను ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ విద్యార్హతను పొందాడు.
సాధరన్ బ్రహ్మోసమాజ్
మార్చుఆనందమోహన్ తన విద్యార్థి జీవితం నుండి బ్రహ్మోధర్మానికి మద్దతుదారుడు. అతను 1869లో కేశబ్ చంద్ర సేన్ ద్వారా అతని భార్య స్వర్ణప్రభాదేవి (జగదీష్ చంద్ర బోస్ సోదరి)తో కలిసి అధికారికంగా బ్రహ్మోమతం లోకి మారాడు. బ్రహ్మోసమాజం లోని యువసభ్యులు కేశవ్ చంద్రసేన్‌తో బాల్య వివాహం, సంస్థ నిర్వహణ, ఇంకా అనేక ఇతర విషయాలకు సంబంధించి విభేదించాడు.దాని ఫలితంగా,1878 మే 15 న, అతను, శివనాథ్ శాస్త్రి, సిబ్ చంద్రదేబ్, ఉమేష్ చంద్రదత్తా, ఇతరులు సాధరన్ బ్రహ్మోసమాజ్‌ను ను స్థాపించారు. అతను దానికి మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.1879 ఏప్రిల్ 27 న అతను సాధరణ బ్రహ్మోసమాజ్ ఉద్యమ విద్యార్థి విభాగం ఛత్రసమాజ్‌ను స్థాపించాడు. 1879లో అతను ఉద్యమ చొరవలో భాగంగా కలకత్తాలోని సిటీ కళాశాలను స్థాపించాడు.
రాజకీయ విద్యారచనలు
మార్చుఆనందమోహన్ కోల్‌కతాలో సిటీ పాఠశాలను, సిటీ కళాశాలను స్థాపించాడు. అతను విద్యార్థులలో జాతీయతను పెంపొందించే లక్ష్యంతో విద్యార్థుల సంఘాన్ని స్థాపించాడు. సురేంద్రనాథ్ బెనర్జీ, శివనాథ్ శాస్త్రి విద్యార్థుల సంఘంలో నిరంతరం ఉపన్యాసాలు నిర్వహించారు.కలకత్తా విశ్వవిద్యాలయంతో అతనికి మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. విద్యా కమిషన్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.అతను విద్యాసేవ సిలబస్ మార్చడాన్నినిరసించాడు.
ఆనందమోహన్ కు విద్యార్థి దశనుండే రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు అతను మరికొంత మంది భారతీయులతో కలిసి "ఇండియా సొసైటీ" ని స్థాపించాడు.అతను సిసిర్ కుమార్ ఘోష్ స్థాపించిన "ఇండియన్ లీగ్" తో సంబంధం ఉంది.1884 వరకు "ఇండియన్ అసోసియేషన్ " సెక్రటరీగా పనిచేసాడు. అతని జీవితాంతం దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ , భారత ఫౌర సేవలు పరీక్షలకు గరిష్ట వయస్సు తగ్గించడం వంటి చర్యలకు, నిరసన తెలిపాడు.1905 లో ఫెడరేషన్ హాల్‌లో జరిగిన బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన నిరసన సభకు అధ్యక్షత వహించాడు. అక్కడ అతని అనారోగ్యం కారణంగా సభా పరిచయం రవీంద్రనాథ్ టాగూర్ చదివాడు.
ఇవి కూడ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Indian National Congress". Indian National Congress. Retrieved 2021-10-05.
- ↑ Islam, Sirajul (2012). "Bose, Ananda Mohan". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.
- ↑ Ananda Mohan Bose Britannica.com.
- ↑ 4.0 4.1 "Ananda Mohun Bose profile". The Open University website. Retrieved 26 August 2019.