ప్రధాన మెనూను తెరువు

సురేంద్రనాథ్ బెనర్జీ

భారత రాజకీయవేత్త మరియు పండితుడు

సర్ సురేంద్రనాథ్ బెనర్జీ (నవంబర్ 10, 1848ఆగష్టు 6, 1925) బ్రిటిష్ పరిపాలనలో తొలినాటి భారత రాజకీయ నాయకులలో ఒకరు. ఆయన తొలి భారతీయ రాజకీయ సంస్థలలో ఒకటైన ఇండియన్ నేషనల్ అసోసియేషన్‌ను స్థాపించారు, మరియు ఆ తరువాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రధాన నాయకుడు అయ్యారు. ఆయన రాష్ట్రగురు (జాతి యొక్క గురువు) అనే మారుపేరుతో కూడా ప్రసిద్ధులు.[1]

Surendranath Banerjee
Surendranath benerjee.jpg
Surendranath Banerjee
జననం(1848-11-10) 1848 నవంబరు 10
Calcutta, Bengal, British India
మరణం1925 ఆగస్టు 6 (1925-08-06)(వయసు 76)
Barrackpore, Bengal, British India
జాతీయతIndian
జాతిBengali Hindu
వృత్తిProfessor
మతంHinduism

ప్రారంభ జీవితంసవరించు

సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో, ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. డాక్టరు అయిన ఆయన తండ్రి దుర్గా చరణ్ బెనర్జీచే, ఉదార, అభ్యుదయ ఆలోచనలలో ఆయన తీవ్రంగా ప్రభావితం చేయబడ్డారు. బెనర్జీ, పేరెంటల్ అకడెమిక్ ఇన్స్టిట్యూషన్ మరియు హిందూ కాలేజ్‌లలో విద్యనభ్యసించారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడు అయిన తరువాత, ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్షలలో పోటీపడేందుకు ఆయన రొమేష్ చందర్ దత్ మరియు బెహరీ లాల్ గుప్తాలతో కలిసి 1868వ సంవత్సరంలో ఇంగ్లాండుకు ప్రయాణించారు. 1869వ సంవత్సరంలో ఆయన పోటీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు, కానీ ఆయన కచ్చితమైన వయసుపైన ఏర్పడిన వివాదం కారణంగా బహిష్కరింపబడ్డారు. న్యాయస్థానాలలో విషయాన్ని పరిష్కరించుకున్న తరువాత, 1871వ సంవత్సరంలో బెనర్జీ మరలా పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు మరియు సిల్హెట్లో మాజిస్ట్రేట్ గా నియమించబడ్డారు. ఎలాగైతేనేమి, జాతి వివక్ష వలన బెనర్జీ త్వరగా తన ఉద్యోగం నుండి తొలగించబడ్డారు. ఈ నిర్ణయాన్ని ఆక్షేపించేందుకు బెనర్జీ ఇంగ్లాండు వెళ్ళారు, కానీ విఫలమయ్యారు. ఇంగ్లాండులో నివసించిన సమయంలో (1874–1875) ఆయన ఎడ్మండ్ బర్క్ మరియు ఇతర ఉదార తత్వవేత్తల యొక్క రచనలను చదివారు.

రాజకీయ జీవితంసవరించు

1875వ సంవత్సరం జూన్‌లో, భారతదేశానికి తిరిగివచ్చిన తరువాత, బెనర్జీ మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్, ఫ్రీ చర్చ్ ఇన్స్టిట్యూషన్ మరియు 1882వ సంవత్సరంలో ఆయనచే స్థాపించబడిన రిపన్ కాలేజ్‌లలో ఆంగ్ల భాష ఆచార్యుడయ్యారు. ఆయన జాతీయవాద మరియు ఉదారవాద రాజకీయ అంశాలతోపాటు, భారతీయ చరిత్రపై కూడా బహిరంగ ఉపన్యాసాలివ్వడం ప్రారంభించారు. 1876వ సంవత్సరం జూలై 26న ఆయన ఆనందమోహన్ బోస్‌తో కలిసి, ఆ తరహా వాటిలో మొదటి రాజకీయ సంస్థ అయిన ఇండియన్ నేషనల్ అసోసియేషన్‌ను స్థాపించారు. ICS పరీక్షలకు హాజరయ్యే భారతీయ విద్యార్థుల వయో-పరిమితి అంశాన్ని ఎదుర్కొనేందుకు ఆయన ఈ సంస్థను ఉపయోగించారు. ఆయన దేశమంతటా ఉపన్యాసాలతో భారతదేశంలో బ్రిటీషు అధికారులచే నిర్వహించబడిన జాతి వివక్షను ఖండించారు, ఇది ఆయనను జనాకర్షకునిగా చేసింది.

1879వ సంవత్సరంలో, ఆయన ది బెంగాలీ వార్తాపత్రికను స్థాపించారు. 1883వ సంవత్సరంలో, తన పత్రికలో వ్యాఖ్యలను ప్రచురించినందుకు న్యాయస్థాన ధిక్కారం క్రింద బెనర్జీ నిర్బంధింపబడినప్పుడు, బెంగాల్ అంతటా మరియు ఆగ్రా, ఫైజాబాద్, అమ్రిత్‌సర్, లాహోర్ మరియు పూణే వంటి భారతీయ నగరాలలో నిరసనలు మరియు హర్తాళులు భగ్గుమన్నాయి. చాలా వరకు INA విస్తరించింది, మరియు కలకత్తాలో దాని వార్షిక సమావేశానికి హాజరయ్యేందుకు భారతదేశం అంతటి నుండి వందలాది మంది ప్రతినిధులు వచ్చారు. 1885వ సంవత్సరంలో బొంబాయిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ను స్థాపించిన తరువాత, వారి యొక్క ఉమ్మడి లక్ష్యాలు మరియు సభ్యత్వాల వలన బెనర్జీ తన సంస్థను దానిలో విలీనం చేశారు. 1895వ సంవత్సరంలో పూనాలో మరియు 1902వ సంవత్సరంలో అహ్మదాబాదులో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.

1905వ సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రం యొక్క విభజనను వ్యతిరేకించిన ప్రజా నాయకులలో సురేంద్రనాథ్ అత్యంత ప్రముఖులు. బెనర్జీ ఉద్యమం యొక్క నాయకత్వ స్థానంలో ఉన్నారు మరియు నిరసనలు, అర్జీలు మరియు బెంగాల్ మరియు భారతదేశం అంతటా విస్తారమైన జన సమర్థనను సంఘటితం చేశారు, ఇది చివరకు 1912వ సంవత్సరంలో విభజనను వెనక్కు తెసుకునేట్టుగా బ్రిటీషు వారిపై వత్తిడితెచ్చింది. బెనర్జీ గోపాల కృష్ణ గోఖలే మరియు సరోజినీ నాయుడు వంటి ఎదుగుతున్న భారతీయ నాయకుల యొక్క సంవర్థకుడు అయ్యారు. బాల గంగాధర్ తిలక్‌చే నడిపించబడి - తిరుగుబాటు మరియు రాజకీయ స్వాతంత్ర్యానికై వాదించిన "అతివాదులు" 1906వ సంవత్సరంలో పార్టీని విడిచిపెట్టిన తరువాత - బ్రిటీషు వారితో సర్దుబాటు మరియు సంభాషణకు ఇష్టపడిన అత్యంత జ్యేష్ఠ "మితవాద" కాంగ్రెస్ నాయకులలో బెనర్జీ కూడా ఒకరు. విదేశీ ఉత్పత్తులకు వ్యతిరేకంగా భారతదేశంలో తయారుచేయబడిన వస్తువులకై వాదించిన బెనర్జీ స్వదేశీ ఉద్యమంలో ఒక ముఖ్య వ్యక్తి - మరియు శిఖరాగ్రంపై ఉన్న ఆయన జనాకర్షణ, అభిమానుల యొక్క మాటలలో, "బెంగాల్ యొక్క కిరీటంలేని రాజు"ను చేసింది.

తదుపరి వృత్తి జీవితంసవరించు

మితవాది భారతీయ నాయకుల యొక్క క్షీణిస్తున్న జనాదరణ భారత రాజకీయాలలో బెనర్జీ యొక్క పాత్రను ప్రభావితం చేసింది. అధిక శాతం భారతీయ ప్రజలు మరియు జాతీయవాద రాజకీయ నాయకులచే అల్పమైనవిగా మరియు అర్థరహితమైనవిగా వ్యతిరేకించబడిన మరియు పరిహసించబడిన - మార్లే-మింటో సంస్కరణలు 1909ని బెనర్జీ సమర్ధించారు. బెనర్జీ భారత జాతీయవాదుల మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎదుగుతున్న జనాకర్షక నాయకుడు, మొహనదాస్ గాంధీచే సమర్ధించబడిన, ప్రతిపాదించబడిన శాసనోల్లంఘనం విధానం యొక్క విమర్శకులు. బెంగాల్ ప్రభుత్వంలో మంత్రి పదవిని స్వీకరించడం ఆయనకు జాతీయవాదుల మరియు ఎక్కువగా ప్రజల ఆగ్రహాన్ని సంపాదించి పెట్టింది, ఆయన రాజకీయ వృత్తి జీవితాన్ని అన్ని క్రియాశీల ప్రయోజనాల కొరకు అంతం చేస్తూ - 1923వ సంవత్సరం బెంగాల్ శాసన సభ ఎన్నికలలో స్వరాజ్య పార్టీ యొక్క అభ్యర్థి బిధాన్ చంద్ర రాయ్‌కు ప్రతిగా ఓడిపోయారు. రాజకీయంగా సామ్రాజ్యాన్ని సమర్థించినందుకు ఆయన నైట్ బిరుదుతో సత్కరింపబడ్డారు. బెంగాల్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించే సమయంలో బెనర్జీ కలకత్తా మునిసిపల్ కార్పోరేషన్‌ను మరింత ప్రజాస్వామిక వ్యవస్థగా చేశారు.

1925వ సంవత్సరంలో బెనర్జీ మరణించారు. భారత రాజకీయాల అధికారీకరణకు మొదటిగా బాట వేసిన వానిగా - నేడు ఆయన భారత రాజకీయాల యొక్క మార్గదర్శ నాయకునిగా బాగా గుర్తుంచుకోబడుతున్నారు. విరివిగా శ్లాఘించబడిన ఎ నేషన్ ఇన్ మేకింగ్ , అనే ఒక ముఖ్యమైన రచనను ఆయన ప్రచురించారు.

బ్రిటీషు వారు ఆయన చివరి సంవత్సరాలలో ఆయనను "సరెండర్ నాట్" బెనర్జీగా గౌరవించారు మరియు పేర్కొన్నారు.

కానీ భారతదేశంలోని జాతీయవాద రాజకీయాలు వ్యతిరేకతను ఎదుర్కున్నాయి మరియు ఎవరి వ్యతిరేకత అయితే మరింత బలంగా ఉందో వారు ప్రధాన స్థానాలలోకి వచ్చారు. అటు రాజకీయ చర్య యొక్క అతివాద అభిప్రాయాలను కానీ లేదా అప్పుడు జాతీయవాద ఉద్యమంలో ఒక ప్రధాన కారకంగా ఉన్న గాంధీ యొక్క సహాయ నిరాకరణను కానీ బెనర్జీ అంగీకరించలేకపోయారు. 1919వ సంవత్సరపు మాంటేగ్-చేమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు చాలా వరకు కాంగ్రెస్ యొక్క కోరికలను నెరవేర్చేవిగా బెనర్జీ భావించారు, ఈ స్థానం ఆ తరువాత ఆయనను ఏకాకిని చేసింది. 1921వ సంవత్సరంలో సంస్కరించబడిన బెంగాల్ శాసన సభకు ఆయన ఎన్నికయ్యారు, అదే సంవత్సరంలో నైట్ అనే బిరుదుతో గౌరవించబడ్డారు, మరియు 1921 నుండి 1924 వరకు స్థానిక స్వపరిపాలన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1923వ సంవత్సరంలో ఆయన ఎన్నికలలో ఓడిపోయారు. ఆయన 1925వ సంవత్సరం ఆగష్టు 6న బారక్‌పూర్‌లో మరణించారు.

వీటిని కూడా చూడండిసవరించు

కొలకత్తా ప్రెసిడెన్షియన్స్ యొక్క జాబితా

గమనికలుసవరించు

  1. "About KMC". Kolkata Municipal Corporation website. Cite web requires |website= (help)

కానీ భారతదేశంలోని జాతీయవాద రాజకీయాలు వ్యతిరేకతను ఎదుర్కున్నాయి మరియు ఎవరి వ్యతిరేకత అయితే మరింత బలంగా ఉందో మరియు ఎవరు ప్రాధాన్యతలోకి వచ్చారో అటువంటి వారు ఇతరులు ఎక్కువగా ఉన్నారు. అటు రాజకీయ చర్య యొక్క అతివాద అభిప్రాయాలను కానీ లేదా అప్పుడు జాతీయవాద ఉద్యమంలో ఒక ప్రధాన కారకం ఉన్న గాంధీ యొక్క సహాయ నిరాకరణను కానీ బెనర్జీ అంగీకరించలేకపోయారు. 1919వ సంవత్సరపు మోంటగు-చేమ్స్ ఫోర్డ్ సంస్కరణలు చాలా వరకు కాంగ్రెస్ యొక్క కోరికలను నెరవేర్చేవిగా బెనర్జీ భావించారు, ఈ స్థానం ఆ తరువాత ఆయనను ఏకాకిని చేసింది. 1921వ సంవత్సరంలో ఆయన సంస్కరించబడిన బెంగాల్ శాసన సభకు ఎన్నికయ్యారు, అదే సంవత్సరంలో నైట్ అనే బిరుదుతో గౌరవించబడ్డారు, మరియు 1921 నుండి 1924 వరకు ప్రాంతీయ స్వపరిపాలనంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1923వ సంవత్సరంలో ఆయన ఎన్నికలలో ఓడిపోయారు. ఆయన 1925వ సంవత్సరం ఆగష్టు 6న బారక్‌పూర్‌లో మరణించారు.

బాహ్య లింకులుసవరించు