ఆనందవర్ధన్

నటుడు

ఆనందవర్ధన్ ఒక తెలుగు సినిమా నటుడు. బాలనటుడిగా సినీరంగంలోకి ప్రవేశించాడు. [1]పాతిక సినిమాల్లో బాలనటుడిగా నటించిన అతని పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస ఆనందవర్ధన్. నేపథ్య గాయకుడు దివంగత పీబీ శ్రీనివాస్ మనుమడు. ఆకాశవాణి అనే సినిమాలో హీరోగా నటించాడు.[2]

అతని తండ్రి ఫణీందర్ చార్టర్డ్ అకౌంటెంట్. అతనికి చిన్నతనం నుంచి రామాయణం కథ వినిపించేవాడు. అది బాగా వినడం వల్ల తిరిగి చెప్పగలిగేలా జ్ఞాపకం ఉండిపోయింది. అప్పటికే బాల రామాయణం తీయడానికి నటుల కోసం వెతుకుతున్న గుణశేఖర్ దృష్టిలో పడ్డాడు. అలా బాల రామాయణం సినిమాలో వాల్మీకి పాత్ర ఇచ్చారు. అదే సినిమాలో బాల హనుమంతునిగా కూడా నటించాడు. అప్పుడు అతని వయసు ఐదేళ్లు. అదే అతని మొదటి సినిమా.

తరువాత ప్రియరాగాలు, సూర్యవంశం మొదలైన 25 సినిమాల్లో బాలనటుడిగా చేశాడు. బాల నటునిగా జగపతి బాబు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లతో నటించాడు. బాలకృష్ణతో ఓ జానపద సినిమా చేశాడు కానీ, నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. సూర్యవంశం హిందీ వెర్షన్‌లో మరో బాల నటుడు అమితాబ్ ఎదురు కాగానే ఏడవటం మొదలుపెట్టాడు. తరువాత ఆ పాత్రకు ఇతన్ని ఎంపిక చేశారు. అమితాబ్ నుంచి నటనలో సలహాలు కూడా అందుకున్నాడు. ఒకటి నుంచి ఐదో తరగతి చదివినప్పుడు రోజుకు రెండు మూడు షెడ్యూల్స్ కూడా చేసేవాడు. అతని తాత పీబీ శ్రీనివాస్ అతన్ని నటుడిగా చూడాలనుకునేవాడు.

సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. విలేఖరి. "సాక్షి". sakshi.com. జగతి పబ్లికేషన్స్. Retrieved 14 July 2016.
  2. "Popular child artist Anand Vardhan set to make his entry on silver screen as a hero". chitramala.in. Retrieved 21 August 2016.