ఎగిరే పావురమా

1997 సినిమా

ఎగిరే పావురమా 1997 లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో శ్రీకాంత్ , లైలా, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రలలో నటించగా ఇతర ముఖ్యపాత్రలలో సుహాసిని, తనికెళ్ళ భరణి, నిర్మలమ్మ, చరణ్‌రాజ్ మొదలైన వారు నటించారు.ఈ చిత్రం సల్లపం అనే మళయాలచిత్ర రిమేక్.

ఎగిరే పావురమా
సినిమా పోస్టర్
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచన
  • మరుధూరి రాజా (సంభాషణలు)
  • లోహిత్ దాస్ (మూలకథ)
  • ఎస్. వి. కృష్ణారెడ్డి (చిత్రానువాదం)
నిర్మాతపి. ఉషారాణి
తారాగణంశ్రీకాంత్,
లైలా,
జె.డి. చక్రవర్తి
ఛాయాగ్రహణంశరత్
కూర్పుకె. రాంగోపాల్ రెడ్డి
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
1997 జనవరి 30 [1]
భాషతెలుగు

చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన జ్యోతి కి పాటలంటే పిచ్చి. జ్యోతి తండ్రి తాగుబోతు. జ్యోతి మేనమామ అయిన శివ రైల్వే గ్యాంగ్ మాన్ గా పని చేస్తుంటాడు. అతనికి మేనకోడలంటే అంతులేని అభిమానం. తనకొచ్చే జీతం కొద్దిగా అయినా మేనకోడలికి కావల్సినవన్నీ కొనిస్తుంటాడు. ఒకసారి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జూనియర్ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంగా పిలుచుకునే బాలు అనే గాయకుడిచేత కచేరీ ఏర్పాటు చేస్తారు.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం సమకూర్చాడు.[2] వేటూరి సుందర్రామ్మూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భువనచంద్ర పాటలు రాయగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, హరిహరన్, మనో, సునీత ఉపద్రష్ట పాటలు పాడారు.

పాట పాడినవారు రాసిన వారు
ఆహా ఏమి రుచి చిత్ర సిరివెన్నెల
మాఘమానం ఎప్పుడొస్తుందో చిత్ర వేటూరి
గుండె గూటికి పండగొచ్చింది ఉన్ని కృష్ణన్ సిరివెన్నెల
దిస్ ఈస్ ది రిథం ఆఫ్ ద లైఫ్ మనో భువన చంద్ర
రూనా లైలా వానా లాగా హరిహరన్ భువన చంద్ర
బ్రహ్మలు గురుబ్రహ్మలు బాలు వేటూరి
చిటపట చినుకుల బాలు, చిత్ర సిరివెన్నెల

ఎగిరే పావురమా ,. బాలు. వేటూరి.

మూలాలు

మార్చు
  1. 10TV (30 January 2019). "22 ఏళ్ళ ఎగిరేపావురమా". 10TV (in telugu). Archived from the original on 30 జూన్ 2021. Retrieved 30 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. "ఎగిరే పావురమా పాటలు". naasongs.com. Archived from the original on 30 అక్టోబరు 2016. Retrieved 18 October 2016.