ఆనంద్ మువిదా రావు
ఆనంద్ మువిదా రావు తెలుగు సినిమా నిర్మాత. అతను మిథునం సినిమా ద్వారా గుర్తింపు పొందాడు. ఈ సినిమా ఉత్తమ విదేశీ భాషా సినిమా అవార్డు క్యాటగిరి లో ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.
జీవిత విశేషాలు
మార్చుఆనంద్ మువిదారావు విజయనగరం జిల్లా ,రేగిడి మండలం ,వావిలవలస గ్రామస్తుడు. అతను ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. తరువాత వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. సంఘసేవకునిగా మంచి గుర్తింపు పొందాడు. అతనికి సాహిత్యమంటే మక్కువ. తన గ్రామంలో ఒక గ్రంధాలయాన్ని ఏర్పాటు చేశాడు. పర్యావరణ హిత పద్యాలను రాసి కోటిగాడు పేరుతో ప్రచురించేవారు. [1]
అతను ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ కీలక పాత్రల్లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో "మిధునం" సినిమాన్ని 2012లో నిర్మించాడు. ఈ సినిమా 2017లో నంది పురస్కారాన్ని సొంతం చేసుకుంది.
వ్యక్తిగత జీవితం
మార్చుఅతనికి భార్య పద్మినితో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
అతను డయాబెటిస్ తో 2023 మార్చి 15న విశాఖపట్నంలో మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ "మిథునం నిర్మాత కన్నుమూత". Sakshi. 2023-03-16. Retrieved 2023-04-15.