మిథునం (2012 సినిమా)
మిథునం 2012 లో విడుదలైన తెలుగు చిత్రం. సుప్రసిద్ద తెలుగు రచయిత శ్రీ రమణ దాదాపు పాతిక సంవత్సరాల క్రితం రచించిన 25 పేజీల మిథునం కథకు తనికెళ్ళ భరణి అందించిన చిత్రరూపమే ఈ చిత్రం.
మిథునం | |
---|---|
దర్శకత్వం | తనికెళ్ళ భరణి |
రచన | శ్రీరమణ |
స్క్రీన్ ప్లే | తనికెళ్ళ భరణి జొన్నవిత్తుల ఆనంద్ మువిదా రావు |
నిర్మాత | ఆనంద్ మువిదా రావు |
తారాగణం | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం లక్ష్మి (నటి) |
ఛాయాగ్రహణం | రాజేంద్రప్రసాద్ తనికెళ్ళ |
కూర్పు | ఎస్. బి. ఉద్దవ్ |
సంగీతం | స్వర వీణాపాణి |
పంపిణీదార్లు | AMR ప్రొడక్షన్స్ J & J ఫిలింస్ |
విడుదల తేదీ | డిసెంబరు 21, 2012[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఅప్పదాసు (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) విశ్రాంత ఉపాధ్యాయుడు. అర్ధాంగి బుచ్చి (లక్ష్మి) తో కలిసి స్వగ్రామంలో నివసిస్తుంటాడు. పిల్లలందరూ విదేశాలలో స్థిరపడటం వలన దంపతులిద్దరూ మాత్రమే శేషజీవితాన్ని గడుపుతూ, జీవితాన్ని విచారంగా గాక ఎంత రమణీయంగా...రసమయంగా మలుచుకుని తమ శేషజీవితాన్ని ఓ మధురానుభూతిగా మిగిల్చారన్నదే స్థూలంగా కథ... ఈ క్రమంలో వీరిద్దరి మధ్యన జరిగే విశేషాల సమాహారమే ఈ చిత్రం.
కేవలం రెండు పాత్రలు తప్ప సినిమాలో ఏ పాత్ర కనిపించదు. పద్మభూషణ్ కెజె యేసుదాసు ఒక పాట, పాత తరం ప్రముఖ గాయని జమునారాణి ఒక జానపదం గీతం ఈ చిత్రంలో పాడారు. జొన్నవిత్తుల ‘కాఫీ దండకం’ రచించారు. ఈ చిత్రం ఆడియో సి.డి. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో, డల్లాస్‌లో, న్యూజెర్సీలో ప్రవాసాంధ్రుల సమక్షంలో విడుదల చేశారు.
పాటల జాబితా
1; ఆది దంపతులు ,జేసుదాస్ ,రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు.
2:ఆవకాయ మనందరిది , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, స్వప్న , రచన: తనికెళ్ల భరణి.
3: ఎవరు గెలిచారు ఇప్పుడు , కె.జమునా రాణి , రచన: ఆనంద్ మోయీద రావు.
4: కాఫీ దండకం , జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
ఆస్కార్ అవార్డుకు నామినేట్
మార్చుసినిమా ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఇచ్చిన సూచనల మేరకు ఈ సినిమా ఆస్కార్ అవార్డు కు నామినేట్ అయ్యింది. ఈ చిత్ర నిర్మాతకు 'మిధునం' సినిమా ఉత్తమ విదేశీ భాషా సినిమా అవార్డు క్యాటగిరి' లో నామినేట్ అయినట్లు లెటర్ అందింది.
పురస్కారాలు
మార్చు- నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలులో తృతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ మాటల రచయిత (తనికెళ్ళ భరణి), ప్రత్యేక బహుమతులు లక్ష్మి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం) విభాగంలో అవార్డులు వచ్చాయి.[2][3][4][5]
మూలాలు
మార్చు- ↑ "Midhunam in Cinemas on 21st December". Ragalahari. Archived from the original on 2013-01-02. Retrieved 18 డిసెంబరు 2012.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 30 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
బయటి లంకెలు
మార్చు- అధికారిక వెబ్సైటు Archived 2013-05-27 at the Wayback Machine
- చిత్ర విశేశాలు
- శ్రీరమణ రచించిన గ్రంథము- చిత్ర మూల కథ ఇదే Archived 2013-03-15 at the Wayback Machine
- తనికెళ్ల భరణి తో ఈటీవి ఇంటర్వ్యూ