శ్రీకాంత్ (నటుడు)

సినీ నటుడు

శ్రీకాంత్ గా ప్రసిద్ధిచెందిన మేకా శ్రీకాంత్ (జననం: మార్చి 23, 1968) ప్రముఖ తెలుగు సినిమా నటుల్లో ఒకడు. 125 సినిమాల్లో నటించాడు. విరోధి (2011) అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. తెలుగు సినిమా నటుల సంఘం మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) లో శ్రీకాంత్ సభ్యుడిగా పని చేశాడు. సినిమా నటి ఊహను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రోహన్, రోషన్, మేధ అనే ముగ్గురు పిల్లలు.

శ్రీకాంత్
Meka Srikanth CCL.jpg
జననం
మేకా శ్రీకాంత్

(1968-03-23) 1968 మార్చి 23 (వయసు 55)
గంగావతి, కొప్పల్ జిల్లా, కర్ణాటక
విద్యబి.కామ్
విద్యాసంస్థకర్ణాటక విశ్వవిద్యాలయం, ధర్వాడ్
వృత్తిసినిమా నటుడు
జీవిత భాగస్వామిఉహ
పిల్లలురోషన్, రోహన్, మేధ

వ్యక్తిగత జీవితంసవరించు

శ్రీకాంత్ కర్ణాటక రాష్ట్రం, కొప్పల్ జిల్లాలోని గంగావతిలో జన్మించాడు. చిన్నతనంలో క్రికెట్ మీద ఆసక్తి ఉండేది. ధర్వార్ లోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో బీకాం పట్టా పొందాడు. ఒక ఫిల్మ్ ఇన్‌స్టిస్ట్యూట్ నుంచి డిప్లోమా కూడా పొందాడు. హీరోయిన్ ఊహను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.[1] వీరికి ముగ్గురు (రోషన్, మేధా, రోహన్) పిల్లలు.[2] వారికి రోషన్ అనే కొడుకు, మేధ అనే కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు రోషన్ చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడు. తర్వాత నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో నటుడిగా మారాడు. రెండో కొడుకు రోహన్ లాస్ ఏంజిలెస్ లో నటనకు సంబంధించి శిక్షణ తీసుకున్నాడు. ప్రైవేటుగా బి.బి.ఎం చదువుతున్నాడు. కూతురు మేధ బాస్కెట్ బాల్ ఆడుతుంది. అండర్ 14 తరపున జాతీయ జట్టులో ఆడింది.[3]

సినీ ప్రస్థానంసవరించు

ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ శ్రీకాంత్ కు నటుడిగా మొదటి సినిమా. ఈ సినిమాకు ఐదువేల రూపాయల పారితోషికం అందుకున్నాడు.[3] మొదట్లో చిన్న చిన్న పాత్రలతో, విలన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారాడు. వన్ బై టు (1993) హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా. తర్వాత వచ్చిన తాజ్ మహల్ (1995) సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు. సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్ళి సందడి (1996) చిత్రం కూడా మంచి విజయం సాధించింది.

ఖడ్గం, ఆపరేషన్ ధుర్యోధన సినిమాల్లో ఆయన పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. స్వతహాగా చిరంజీవి అభిమానియైన శ్రీకాంత్ ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరికగా ఉండేవాడు. ఆయన కోరిక శంకర్‌దాదా ఎం.బీ.బీ.ఎస్ తో తీరింది. దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్‌దాదా జిందాబాద్ లో కూడా ఆయనతో కలిసి నటించాడు .బాలకృష్ణతో కలిసి శ్రీరామరాజ్యం సినిమాలో, వెంకటేష్తో కలిసి సంక్రాంతి, నాగార్జునతో కలిసి నిన్నే ప్రేమిస్తా, .మోహన్ బాబుతో తప్పుచేసి పప్పుకూడు, రాజేంద్ర ప్రసాద్తో సరదాగా సరదాగా మొదలయిన వాటిలో నటించాడు. జగపతిబాబుతో మనసులో మాట, జె.డి. చక్రవర్తితో ఎగిరే పావురమా, రవితేజతో ఖడ్గం లాంటి సినిమాల్లో కలిసి నటించాడు.

చిత్రాలుసవరించు

 1. వారసుడు (2023)
 2. హంట్ (2023)
 3. జేమ్స్ (2022)
 4. మార్షల్ (2019)
 5. ఆపరేషన్ 2019 (2019)
 6. రా..రా.. (2018)
 7. యుద్ధం శరణం (2017)
 8. టెర్రర్ (2016 సినిమా) (2016)
 9. సరైనోడు (2016)
 10. మెంటల్ (2016)
 11. ఢీ అంటే ఢీ (2015)
 12. వేట (2014)
 13. గోవిందుడు అందరివాడేలే (2014)
 14. షాడో (2013 సినిమా) (2013)
 15. సేవకుడు (2013)
 16. దేవరాయ (2012 సినిమా) (2012)
 17. లక్కీ (2012 సినిమా) (2012)
 18. శ్రీరామరాజ్యం (2011)
 19. అ ఆ ఇ ఈ (2009)
 20. మహాత్మ (2009) ఇది ఇతని 100 వ చిత్రం
 21. స్వరాభిషేకం (2004)
 22. నగరం
 23. యమగోల మళ్ళీ మొదలైంది
 24. శంకర్ దాదా జిందాబాద్ (2007)
 25. ఆదిలక్ష్మి
 26. ఆపరేషన్ ధుర్యోధన
 27. నేను పెళ్ళికి రెడీ (2003)
 28. వన్ బై టూ (2003)
 29. ప్రేమసందడి (2001)
 30. డార్లింగ్ డార్లింగ్ (2001)
 31. నా మనసిస్తా రా (2001)
 1. దొంగరాముడు అండ్ పార్టీ (2003)
 2. చాలా బాగుంది (2000)
 3. అమ్మో ఒకటోతారీఖు (2000)
 4. మాయాజాలం
 5. నిన్నే ప్రేమిస్తా (2000)
 6. రాధా గోపాళం
 7. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి (2000)
 8. సంక్రాంతి (వెంకటేష్ కు తమ్ముడిగా)
 9. ఖడ్గం
 10. అనగనగా ఒక అమ్మాయి (1999)
 11. పంచదార చిలక (1999)
 12. శంకర్ దాదా ఎం.బీ.బీ.ఎస్
 13. పెళ్ళాం ఊరెళితే
 14. గిల్లికజ్జాలు (1998)
 15. శుభలేఖలు (1998)
 16. ఓ చినదాన
 17. కన్యాదానం (1998)
 18. ఒట్టేసి చెబుతున్నా
 19. ఊయల (1998)
 20. మా నాన్నకు పెళ్ళి (1997)
 21. మాణిక్యం (1999)
 22. తాళి (1997)
 23. పెళ్ళిసందడి (1996)
 24. హలో ఐ లవ్ యూ (1997)
 25. పిల్ల నచ్చింది (1999)
 26. ఆమె
 27. సింహ గర్జన (1995)
 28. పండగ
 29. ఆహ్వానం (1997)
 30. ప్రేయసి రావే!
 31. వినోదం (1996)
 32. ఎగిరే పావురమా (1997)
 33. దొంగ రాస్కెల్ (1996)
 34. తాజ్ మహల్ (1995)
 35. మధురా నగరిలో (1991)
 36. మనసులో మాట (1991)
 37. పీపుల్స్ ఎన్‌కౌంటర్ (1991)

వెబ్‌సిరీస్‌సవరించు

సంవత్సరం పేరు పాత్ర నెట్వర్క్ ఇతర విషయాలు
2020 చదరంగం పెమ్మసాని గంగాధర్ రావు జీ5 ఓటీటీ
2020 షూట్ అవుట్ ఎట్ ఆలేర్ ఐజి ప్రవీణ్ చాంద్ జీ5 ఓటీటీ

అవార్డులుసవరించు

ఫిల్మ్ ఫేర్ అవార్డులు

మూలాలుసవరించు

 1. సాక్షి, ఫ్యామిలీ (9 February 2020). "అలా ఊహతో ప్రేమలో పడ్డా : శ్రీకాంత్‌". Sakshi. డి.జి. భవాని. Archived from the original on 28 June 2020. Retrieved 28 June 2020.
 2. "Interview with Srikanth". Archived from the original on 15 December 2019. Retrieved 26 June 2020.
 3. 3.0 3.1 "చెక్క బ్యాటుతో తెగ ఆడేసేవాణ్ని". eenadu.net. ఈనాడు. 23 December 2018. Archived from the original on 24 December 2018.

బయటి లింకులుసవరించు