ఆమంచి కృష్ణ మోహన్
ఆమంచి కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చీరాల నియోజకవర్గం నుండి 2009 నుండి 2019 వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.
ఆమంచి కృష్ణ మోహన్ | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 - 2019 | |||
నియోజకవర్గం | చీరాల నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 22 ఆగష్టు 1975 పందిళ్లపల్లి గ్రామం, వేటపాలెం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | వెంకటేశ్వర్లు, సుబ్బరావమ్మ | ||
జీవిత భాగస్వామి | సుజాత | ||
సంతానం | సేతునాయుడు, వెంకటేశ్వర్లు |
జననం, విద్యాభాస్యం
మార్చుఆమంచి కృష్ణ మోహన్ 22 ఆగష్టు 1975లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, వేటపాలెం మండలం, పందిళ్లపల్లి గ్రామంలో వెంకటేశ్వర్లు, సుబ్బరావమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన డిగ్రీ (బీఎస్సీ) వరకు చదువుకున్నాడు.[1]
రాజకీయ జీవితం
మార్చుఆమంచి కృష్ణ మోహన్ 2000లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వేటపాలెం జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచాడు. ఆయన కొణిజేటి రోశయ్య ప్రోతాహంతో 2006లో వేటపాలెంలోని దేశాయిపేట–2 నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి వేటపాలెం ఎంపీపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో చీరాల నియోజకవర్గం నుండి పోటీ చేసిన కొణిజేటి రోశయ్య విజయానికి కీలకంగా వ్యవహరించి ఆయన రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందాడు. కొణిజేటి రోశయ్య 2009లో ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా కావడంతో ఆమంచి కృష్ణ మోహన్ చీరాల నియోజకవర్గం నుండి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జంజనం శ్రీనివాసరావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తరువాత ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పని చేశాడు.
ఆమంచి కృష్ణ మోహన్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నవోదయం పార్టీ నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2] ఆయన తదనంతరం 3 సెప్టెంబర్ 2015లో టీడీపీలో చేరాడు.[3] ఆమంచి కృష్ణ మోహన్ 13 ఫిబ్రవరి 2019న టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4][5] ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలై ప్రతుతం చీరాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి గా ఉన్నాడు.
ఆమంచి కృష్ణ మోహన్ 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల వైసీపీ టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన 2024 ఏప్రిల్ 04న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు.[6]
మూలాలు
మార్చు- ↑ Sakshi (18 March 2019). "ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలు". Archived from the original on 16 September 2021. Retrieved 17 September 2021.
- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Telugu One India (3 September 2015). "చంద్రబాబే కండువా కప్పి 'ఆమంచి'ని టీడీపీలోకి ఆహ్వానించారు". Retrieved 9 December 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ News18 తెలుగు (13 February 2019). "టీడీపీకి ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hans India (13 February 2019). "TDP MLA Amanchi Krishna Mohan quits party" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2021. Retrieved 9 December 2021.
- ↑ Zee News Telugu (4 April 2024). "వైఎస్ జగన్‌కు భారీ షాక్.. వైసీపీకి ఆమంచి కృష్ణ మోహన్ రాజీనామా". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.