ఆర్తి చాబ్రియా

(ఆరతీ ఛాబ్రియా నుండి దారిమార్పు చెందింది)

ఆర్తి చాబ్రియా భారతీయ సినిమా నటి, ప్రచారకర్త. 1999లో మిస్ ఇండియాగా ఎంపికయ్యింది. ఒకరికి ఒకరు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు, హిందీ, కన్నడ, పంజాబీ చిత్రాలలో నటించింది.

ఆర్తి చాబ్రియా
జననం (1982-11-21) 1982 నవంబరు 21 (వయసు 42)
ముంబై, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, ప్రచారకర్త

ఆర్తి చాబ్రియా 1982, నవంబరు 21న ముంబైలో జన్మించింది.[1]

తొలిజీవితం

మార్చు

ఆర్తి చాబ్రియా మూడు సంవత్సరాల వయసులోనే మెదటిసారిగా ఫారెక్స్ కు ప్రచారకర్తగా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించంది. మాగి నూడుల్స్, పెప్సోడెంట్ టూత్ పేస్ట్, క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్, అమూల్ ఫ్రోస్టిక్ ఐస్ క్రీం, ఎల్.ఎం.ఎల్. ట్రెండీ స్కూటర్, క్రాక్ క్రీమ్, కళ్యాణ్ జ్యూవలరీ వంటి అనేక ప్రకటనలలో నటించింది.[1]

సినీరంగ ప్రస్థానం

మార్చు

మోడల్ గా మంచి ఉన్నత స్థితిలో ఉన్న సమయంలోనే సినిమాలలో అడుగుపెట్టింది. ఈమె మొదటి హిందీ సినిమా 'తుమ్ సే అచ్చా కౌన్ హై' ద్వారా పరిచయమైంది.

దర్శకురాలిగా

మార్చు

ఆర్తి చాబ్రియా 'ముంబై వారణాసి ఎక్స్‌ప్రెస్‌' అనే లఘుచిత్రానికి దర్శకత్వం వహించింది.[2]

నటించిన చిత్రాల జాబితా

మార్చు
సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2001 లజ్జ సుష్మ హిందీ
2002 ఆవార పాగల్ దివాన్ టినా చిప్పా హిందీ
తుమ్సే అచ్చా కౌన్ హై నైనా దీక్షిత్ హిందీ
2003 రాజా భయ్యా రాధ హిందీ
ఒకరికి ఒకరు స్వప్నారావు తెలుగు
2004 ఇంట్లో శ్రీమతి - వీధిలో కుమారి అంజలి తెలుగు
అబ్ తుమ్హారే హవాలే వతన్ సాతియో త్రైలోక్ భార్య హిందీ అతిథి పాత్ర
2005 అహం ప్రేమస్మి అప్సర కన్నడ
షాదీ నె. 1 రేఖ కొఠారి హిందీ
స్సుఖ్ భావ్నా రాకేష్ వర్మ హిందీ
2006 తీస్రీ ఆంక్: హిడెన్ కెమెరా ఆర్తీ హిందీ
2007 షూట్ ఔట్ ఎట్ లోఖాండ్వాలా తారన్నుం తను హిందీ
పార్ననర్ నిక్కి హిందీ అతిథి పాత్ర
అనామిక అనామిక హిందీ అతిథి పాత్ర
సాంత సాంత గర్ల్ ఫ్రెండ్ కన్నడ
అతిథిపాత్నర ఆలీ మాజీ గర్ల్ ఫ్రెండ్ హిందీ అతిథి పాత్ర
2008 ధూమ్ దడక్క శివాని సావంత్ హిందీ
చింతకాయల రవి ఐటెం సాంగ్ తెలుగు
గోపి (గోడమీద పిల్లి) మోనికా తెలుగు
2009 డాడీ కూల్ నాన్సి లాజరస్ హిందీ
టాస్ సశ హిందీ
రజని సంధ్య కన్నడ
కిస్సే ప్యార్ కరూన్ నటాశ హిందీ
2010 మిలేంగే మిలేంగే సోఫియా రాజీవ్ అరోరా హిందీ
దస్ టోలా సువర్ణలత శాస్త్రీ హిందీ
2013 వ్యాహ్ 70కిలోమీటర్లు ప్రీటో పంజాబి

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 టాలీవుడ్ టైమ్స్. "ఆర్తి చ్చాబ్రియా". tollywoodtimes.com. Retrieved 2 May 2017.[permanent dead link]
  2. నవతెలంగాణ. "దర్శకురాలిగా..!". Retrieved 2 May 2017.[permanent dead link]