ఒకరికి ఒకరు 2003 లో విడుదలైన తెలుగు చిత్రం. శ్రీరామ్, అర్తీ ఛాబ్రియా నాయకా నాయికలుగా రసూల్ ఎల్లోర్ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన చిత్రం. ఛాయాచిత్రకుడు రసూల్ ఎల్లోర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఎటువంటి హైప్, అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ ఇది విజయవంతమైంది. భారీ హిట్‌గా నిలిచిన ఆడియో సినిమా వసూళ్లకు బాగా ఉపయోగపడింది.

ఒకరికి ఒకరు
దర్శకత్వంరసూల్ ఎల్లోర్
రచనకోన వెంకట్
నిర్మాతకిరణ్
తారాగణంశ్రీరామ్,
ఆర్తీ ఛాబ్రియా,
బాలయ్య,
రాధా కుమారి,
తనికెళ్ళ భరణి,
హేమ,
బెనర్జీ,
విజయ్ సాయి
ఛాయాగ్రహణంసునీల్‌ రెడ్డి , రాజా
కూర్పుశంకర్
సంగీతంఎం.ఎం. కీరవాణి
పంపిణీదార్లుఆనంది ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ
9 అక్టోబర్ 2003
సినిమా నిడివి
157 min.
దేశంభారతదేశం
భాషతెలుగు

కామేశ్వరరావు (శ్రీరామ్) మధ్యతరగతి కుటుంబంలో జన్మిస్తాడు.కుటుంబ పరిస్థితి కారణంగా చిన్నతనం నుండి అన్ని విషయాలలో సర్దుకుపోవలసి వస్తుంటుంది. ఇంజనీరింగ్ ఉత్తీర్ణుడు అయిన తరువాత బామ్మ (రాధా కుమారి) మొక్కు కారణంగా కాశీ వెళ్ళ వలసి వస్తుంది. దారిలో కథానాయకి స్వప్న (ఆర్తీ ఛాబ్రియా పరిచయమౌతుంది. ఇద్దరూ తమ అసలు పేర్లను దాచిపెట్టి రాహుల్, సుబ్బలక్ష్మిగా పరిచయమవుతారు. తమ ప్రేమను వ్యక్త పరుచుకోకుండానే విడిపోతారు. తరువాత స్వప్న అమెరికాలో ఉన్నట్లు తెలుసుకున్న కామేశ్, ఉద్యోగ నెపంతో ఆమెను వెతకడానికి అమెరికా వెళతాడు. తరువాత అతను స్వప్నను కలుసుకున్నాడా లేదా అన్నది తెర పైన చూడవలసిందే.

నటీ నటులు

మార్చు

పాటల జాబితా

మార్చు

వెళ్లిపోతే ఎలా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం . గానం.ఎం ఎం కీరవాణి, శ్రేయా ఘోషల్

ఎక్కడున్నావమ్మా , రచన: చంద్రబోస్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

నాదిరదిన్న , రచన:చంద్రబోస్ , గానం. కార్తీక్, గంగ

నువ్వే నా శ్వాస , రచన: చంద్రబోస్, గానం.శ్రేయాఘోషల్

ఘాటు ఘాటు ప్రేమ , రచన; చంద్రబోస్,గానం. టిప్పు, నిత్యసంతోషినీ

అల్లో నేరేల్లో , రచన: చంద్రబోసు, గానం.ఎం.ఎం కీరవాణి, గంగ.

పురస్కారాలు.

మార్చు

ఉత్తమ నూతన చిత్ర దర్శకుడు -- రసూల్ ఎల్లోర్

బయటి లింకులు

మార్చు