ఆరవేటి శ్రీనివాసులు

ఆరవేటి శ్రీనివాసులు ప్రసిద్ధ రేడియో కళాకారులు.

జీవిత విశేషాలుసవరించు

జానపద కవిబ్రహ్మ ఆరవేటి శ్రీనివాసులు కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం చిన్నరంగాపురం 1947లో అశ్వర్థామ్మ, వెంకట రమణ అను దంపతులకు జన్మించారు. పాఠశాల స్థాయి నుంచే బాల నటుడిగా రంగస్థలంపై నటించారు. కడప రేడియో స్టేషన్‌లో జానపద గేయప్రయోక్తగా పనిచేశారు. దీంతో కడప జిల్లాకే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా సుపరిచితులు. వీరి నాటకాలు అశేషాంధ్ర రేడియో శ్రోతలను ఉర్రూతలూగించాయి. ప్రసిద్ధ రంగస్థల నటుడుగా, దర్శకుడుగా అనేక అవార్డులు పొందారు. వీరు రచించిన “తొందరపడి ఒక కోడి ముందే కూసింది’, “బార్డర్‌ పాలెగాళ్లు’, “గుర్రమ్మ నవ్వింది’, “కుక్కమేలు’, “తనదాక వస్తే అమ్మనన్నారు వదిలేయ్‌’, “నడిరేయి స్వరాజ్యం’ వంటి కథలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. “ఆరవేటి’ కథలు అను పేరుతో కథ సంకలనాలను విశాలాంధ్రవారు ప్రచురించారు. ఆరవేటిగారు సినిమా రంగంలో కూడా రాణించారు. రంగమహల్‌ రహస్యం, గుండెలు తీసిన మొనగాడు సినిమాలకు రచయితగా వ్యవహరించారు. అంత:పురం సినిమాలకు డైలాగులు రాశారు. 8సంవత్సరాల వయసులో సినీనటి భానుమతితో పురస్కారం అందుకున్నారు. వీరు రచించిన “ఈ కథను మర్చండి” నాటకం 14బాషలలో అనువదించబడింది. రేడియో నాటక నిర్వహణకు 4 సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. 1981లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జానపద సాహిత్య అకాడమి డైరెక్టర్‌గా ఉన్నారు. 1993లో మద్రాస్‌ తెలుగు అకాడమి జానపద సంగీత సేవకు గుర్తింపుగా ఉగాది పురస్కారం పొందారు.

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు