ఆర్తి పూరి, (జననం జనవరి 8) ఒక భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి, మోడల్.[1] మధుబాల-ఏక్ ఇష్క్ ఏక్ జునూన్ షో నుండి తృష్ణా పాత్రకు ప్రసిద్ది చెందింది.[2] దేస్వా, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ బీహార్ వంటి సినిమాలతోనూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆర్తి పూరి
ఆర్తి పూరి
జననంజనవరి 8
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1999−ప్రస్తుతం

కెరీర్

మార్చు

పూరి తన కెరీర్‌ను ప్రాంతీయ సినిమాతో ప్రారంభించి, ఆపై చిన్న స్క్రీన్‌కు చేరుకుంది. ఆమె మోడల్‌గా చాలా సినిమాలు, వందకు పైగా పంజాబీ వీడియోలు కూడా చేసింది. ఆమె మధుబాల - ఏక్ ఇష్క్ ఏక్ జునూన్ షోలో ప్రధాన పాత్ర పోషించింది. [3] అందులో మరో ప్రధాన పాత్ర ద్రష్టి ధామి పోషించింది.

1999లో, ఆర్తి పూరి "పహడో కే దమన్ మే"లో రాకేష్ కపూర్ సరసన ప్రధాన పాత్ర పోషించింది.

ఫిల్మోగ్రఫీ

మార్చు
సినిమాలు
సంవత్సరం సినిమా పాత్ర భాష
2004 మిస్టరీస్ షాక్ సిమ్రాన్ హిందీ
2005 నలైక్ పంజాబీ
2008 లాక్ పరదేశి హోయ్యే పంజాబీ
2010 మూసాః ది మోస్ట్ వాంటెడ్ హిందీ
2010 దమ్మున్నోడు తెలుగు
2010 ఖిచ్ ఘుగ్గి ఖిచ్ పంజాబీ
2011 దేస్వా భోజ్‌పురి
2015 వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ బీహార్ హిందీ
2013 రామయ్య వస్తావయ్య గౌరీ హిందీ
2014 యాక్షన్ జాక్సన్ హిందీ
2015 అద్దంలో దెయ్యం తెలుగు
2015 ప్లస్ వన్ + 1 తెలుగు
2018 ఎంఎల్ఏ తెలుగు
2024 గబ్రు గ్యాంగ్ బుల్బుల్ హిందీ

టెలివిజన్

మార్చు
  • 2012-2013 త్రిష్ణ బలరాజ్ చౌదరి గా మధుబాల-ఏక్ ఇష్క్ ఏక్ జునూన్

మూలాలు

మార్చు
  1. "Arthi Puri celebrates her birthday today!". tv.dakshanews.com/. 8 January 2013. Archived from the original on 10 April 2013. Retrieved 23 March 2013.
  2. "Aarthi Puri Joins 'Madhubala' Cast". MovieTalkies.com. 29 May 2012. Archived from the original on 18 June 2015. Retrieved 29 May 2012.
  3. "Aarti Puri in Prabhudheva's next film". The Times of India. 15 October 2012. ISSN 0971-8257. Retrieved 29 July 2023.