ఎమ్‌ఎల్‌ఏ
ఎమ్‌ఎల్‌ఏ 2018 మార్చి 23 శుక్రవారం విడుదలైన తెలుగు సినిమా.
ఎమ్‌ఎల్‌ఏ (మంచి లక్షణాలున్న అబ్బాయి) | |
---|---|
దర్శకత్వం | ఉపేంద్ర మాధవ్ |
రచన | ఉపేంద్ర మాధవ్ |
నిర్మాత | కిరణ్ రెడ్డి భరత్ చౌదరి |
తారాగణం | కళ్యాణ్ రామ్ కాజల్ అగర్వాల్ |
ఛాయాగ్రహణం | ప్రసాద్ మూరెళ్ళ |
కూర్పు | బిక్కిన తమ్మిరాజు |
సంగీతం | మణి శర్మ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్ |
సినిమా నిడివి | 160 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 10 కోట్ల రూపాయలు |
కథ
మార్చుకల్యాణ్ (కల్యాణ్‌రామ్) ఓ సందర్భంలో ఇందు (కాజల్) ను చూస్తాడు. ఆమెను చూసిన వెంటనే ప్రేమిస్తాడు. కానీ ఇందు.. కల్యాణ్ నుంచి తప్పించుకుని తిరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇందు ఓ సమస్యలో ఇరుక్కుంటుంది. ఆ సమస్య నుంచి తన తెలివితేటలతో బయటపడేస్తాడు కల్యాణ్. ఈ తరుణంలో ఇందుకి కల్యాణ్‌పై ప్రేమ పెరుగుతుంది. ఇందు నాన్న జయప్రకాశ్‌రెడ్డి ఎమ్మెల్యేని అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గాడప్ప (రవి కిషన్) బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. దాంతో ఇందును గాడప్పకి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో కల్యాణ్ వచ్చి ఇందుని ప్రేమిస్తున్నానంటాడు. అది విని నువ్వు కూడా ఎమ్మెల్యే అవ్వు అని కల్యాణ్‌తో చెప్తాడు జయప్రకాశ్. దాంతో ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఎమ్మెల్యే అవుతానని చెప్పి కల్యాణ్.. గాడప్పతో సవాల్ చేస్తాడు. మరి ఆ సవాల్ ను కళ్యాణ్ ఎలా నెగ్గాడు? ఇందుని పెళ్ళి చేసుకున్నాడా? అన్న విషయాలు మిగిలిన కథ.
తారాగణం
మార్చుపాటల జాబితా
మార్చు- మోస్ట్ వాంటెడ్ అబ్బాయి , రచన: రామజోగయ్య శాస్ర్తీ, గానం. యాజిన్ నిజార్, రమ్య బెహరా
- హే ఇందు రచన; కాసర్ల శ్యామ్, గానం, రాహుల్ సింప్లీ గo జ్
- గర్ల్ ఫ్రెండ్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం . అనురాగ్ కులకర్ణి
- యుద్ధం యుద్ధం, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. అనురాగ్ కులకర్ణి
సాంకేతికవర్గం
మార్చు- సంగీతం: మణిశర్మ
- కూర్పు: బక్కిన తమ్మిరాజు
- నిర్మాణ సంస్థ: బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాతలు: కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, విశ్వ ప్రసాద్
- ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్