ఆర్.ఎస్. వాసురెడ్డి

రామన్నగారి శ్రీనివాసురెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1984 నుండి 1989 వరకు రామాయంపేట ఎమ్మెల్యేగా పని చేశాడు.[2]

రామన్నగారి శ్రీనివాసురెడ్డి

శాసనసభ్యుడు
పదవీ కాలం
1985 - 1989
ముందు టి. అంజయ్య
తరువాత అంతిరెడ్డిగారి విఠల్ రెడ్డి
నియోజకవర్గం రామాయంపేట శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1943
పోలంపల్లి, చేగుంట మండలం, మెదక్ జిల్లా, తెలంగాణ[1]
మరణం 2023 సెప్టెంబర్ 22
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి పద్మ
సంతానం వసంత, జయంతి, చంద్రశేఖర్‌రెడ్డి

రాజకీయ జీవితం మార్చు

రామన్నగారి శ్రీనివాసురెడ్డి 1971లో చేగుంట ఉప సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రెడ్డిపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆయన 1985లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ నుంచి రామాయంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రావడంతో ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి 1984 నుంచి 1989 వరకు ఎమ్మెల్యేగా పని చేశాడు.[3] ఆయన ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి మెదక్‌ జిల్లా కన్వీనర్‌గా పని చేశాడు.

మరణం మార్చు

ఆర్‌ఎస్‌ వాసురెడ్డి (80) అనారోగ్యంతో బాధపడుతూ 2023 సెప్టెంబర్ 21న మరణించాడు. ఆయనకు భార్య పద్మ, కూతుళ్లు వసంత, జయంతి, కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.[4][5][6][7]

మూలాలు మార్చు

  1. Eenadu (6 November 2023). "పల్లెల్లో గెలిచి.. పదవులు వరించి". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  2. Eenadu (28 October 2023). "సాధారణ జీవితం.. బస్సులో ప్రయాణం". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  3. Eenadu (29 October 2023). "ఇంకా జనం గుండెల్లోనే." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  4. Namasthe Telangana (22 September 2023). "మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డి ఇకలేరు". Archived from the original on 22 September 2023. Retrieved 22 September 2023.
  5. Eenadu (22 September 2023). "రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్‌ఎస్‌ వాసురెడ్డి కన్నుమూత". Archived from the original on 22 September 2023. Retrieved 22 September 2023.
  6. V6 Velugu (21 September 2023). "రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసు రెడ్డి కన్నుమూత". Archived from the original on 22 September 2023. Retrieved 22 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Telangana Today (21 September 2023). "Former Ramayampet MLA RS Vasu Reddy passes away". Archived from the original on 23 September 2023. Retrieved 23 September 2023.