ఆర్.కృష్ణయ్య బీసీ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాడు. ఆయన 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఆయన ప్రస్తుతం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.[1]

ఆర్.కృష్ణయ్య
ఆర్.కృష్ణయ్య


పదవీ కాలం
22 జూన్ 2022 – 21 జూన్ 2028
నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 - 2018
ముందు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
తరువాత దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
నియోజకవర్గం ఎల్బీ నగర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 13 సెప్టెంబర్ 1954
వికారాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి శబరీ దేవి
సంతానం రిషి అరుణ్, శ్వేత దేవి

జననం మార్చు

ఆర్.కృష్ణయ్య (ర్యాగ కృష్ణయ్య) 1954 సెప్టెంబరు 13లో రాళ్లగుడుపల్లి గ్రామం, మోమిన్ పేట్ , వికారాబాదు జిల్లాలో జన్మించాడు. ఆయన తండ్రిపేరు అడివప్ప గౌడ్, తల్లి రాములమ్మ. ఆయన విద్యార్హతలు ఎం.ఏ, ఎల్ఎల్ఎం., ఎంఫిల్.

రాజకీయ ప్రస్థానం మార్చు

ఆర్.కృష్ణయ్య 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి,[2] ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ పై 12525 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారి చట్ట సభల్లోకి అడుగుపెట్టాడు.[3] 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీడీపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరి మిర్యాలగూడ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.[4][5] ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ మే 17న ప్రకటించింది.[6][7]

మూలాలు మార్చు

  1. Sakshi (6 July 2021). "బీసీ బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్‌సీపీదే: ఆర్‌.కృష్ణయ్య". Sakshi. Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
  2. సాక్షి, హోం » తెలంగాణ (28 March 2014). "నేడు టీడీపీలో చేరనున్న కృష్ణయ్య". Sakshi. Archived from the original on 5 April 2021. Retrieved 5 April 2021.
  3. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  4. THE HINDU, THE HINDU (18 November 2018). "Congress names Krishnaiah from Miryalguda". The Hindu (in Indian English). Archived from the original on 5 April 2021. Retrieved 5 April 2021.
  5. hmtvlive (19 November 2018). "కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ రిలీజ్‌..... బరిలో ఆర్‌. కృష్ణయ్య". www.hmtvlive.com. Archived from the original on 5 April 2021. Retrieved 5 April 2021.
  6. Eenadu (18 May 2022). "ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్‌.కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
  7. Andhra Jyothy (18 May 2022). "ఏపీ నుంచి రాజ్యసభకు కృష్ణయ్య" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.