రంగనాథన్ మాధవన్ (జననం 1970 జూన్ 1) ప్రముఖ భారతీయ నటుడు, రచయిత, సినీ నిర్మాత. ఆయన రెండు ఫిలింఫేర్ పురస్కారాలు, ఒక తమిళనాడు రాష్ట్ర ఫిలిం పురస్కారం అందుకున్నారు. దాదాపుగా 7 భాషా సినిమాల్లో నటించిన అతితక్కువ భారతీయ నటుల్లో నటుల్లో ఆయన ఒకరు.[3][4] కెరీర్ మొదట్లో మాధవన్ టివీ సీరియళ్ళలో చిన్న చిన్న పాత్రలు చేసేవారు. 1996లో జీ టీవీలో బాగా హిట్ అయిన బనేగీ అప్నీ బాత్ సీరియల్ లో కూడా నటించారాయన. ఎన్నో ప్రకటనల్లోనూ చిన్న పాత్రల్లోనూ నటించిన తరువాత మణి రత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ  సినిమా  అలై పాయుదే(2000)తో  కెరీర్ లో  పెద్దమలుపు  వచ్చింది.  ఆ తరువాత  ఏడాది గౌతం మీనన్ మొదటి సినిమా మిన్నలే, మద్రాస్ టాకీస్ వారి డుం డుం డుం సినిమాలతో రొమాంటిక్ హీరోగా  ప్రసిద్ధి చెందారు మాధవన్. 2002లో తిరిగి మణిరత్నం దర్శకత్వంలోనే కన్నత్తిళ్  ముత్తమిట్టాల్  సిన్మాలో  నటించారాయన. ఆ సినిమాకు,  మాధవన్  నటనకు  విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు వచ్చాయి. అదే ఏడాది ఎన్‌. లింగుస్వామి దర్శకత్వంలో నటించిన రన్ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది.  

ఆర్. మాధవన్
2011లో మాధవన్
జననం
రంగనాథన్ మాధవన్[1][2]

(1970-06-01) 1970 జూన్ 1 (వయసు 54)
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1993–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సరితా బిర్జే
(m. 1999)
పిల్లలు1

తొలినాళ్ళ జీవితం

మార్చు

1 జూన్ 1970న బీహార్లోని జంషెడ్‌పూర్ లో తమిళ కుటుంబంలో జన్మించారు మాధవన్. ఆయన తండ్రి రంగనాథన్ టాటా స్టీల్ లో మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయగా, తల్లి సరోజ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పనిచేసేవారు. ఆయన చెల్లెలు దేవిక యుకెలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు.[5] బీహార్ లో పుట్టినా తమిళం మాట్లాడుతూ పెరిగారాయన.[6]

ఫిల్మోగ్రఫీ

మార్చు

మాధవన్ నటించిన తెలుగు సినిమాల జాబితా:

మూలాలు

మార్చు
  1. "Ranganathan Madhavan". Twitter (in ఇంగ్లీష్). Retrieved 16 August 2020.
  2. "Madhavan refutes rumours about working in the Hindi remake of Bhaagamathie - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 15 November 2019. Retrieved 16 August 2020.
  3. "R Madhavan signs up with Atul Kasbekar's Bling Entertainment" Archived 2010-12-01 at the Wayback Machine.
  4. Sharma, Smrity (13 November 2010).
  5. Rangarajan, Malathi (2004).
  6. Jha, Subhash K. (2005).