ఆలీబాబా 40 దొంగలు (1970 సినిమా)

1970 తెలుగు సినిమా
(ఆలీబాబా 40 దొంగలు (1970 సినిమా ) నుండి దారిమార్పు చెందింది)

ఆలీబాబా 40 దొంగలు 1970 లో బి. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జానపద చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, జయలలిత ప్రధాన పాత్రలు పోషించారు.

ఆలీబాబా 40 దొంగలు (1970 సినిమా )
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం బి. విఠలాచార్య
నిర్మాణం ఎన్. రామబ్రహ్మం,
అనూరాధాదేవి
తారాగణం నందమూరి తారక రామారావు,
జయలలిత,
నాగభూషణం,
సత్యనారాయణ,
రాజబాబు,
రమాప్రభ
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ గౌతమీ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆలీబాబా ఒక పరోపకారియైన యువకుడు. తన తల్లి, అన్న, వదినలతో కలిసి జీవిస్తుంటాడు. అతను పెద్దగా డబ్బు సంపాదించలేకపోవడంతో అతని అన్న, వదినలు అతన్ని చిన్నచూపు చూస్తుంటారు. ఒకసారి ఆలీబాబా అడవిలో ఉన్న ఒక దొంగల గుహ కనిపెడతాడు. ఆ దొంగలు తాము దాచుకున్న సొమ్మునంతా అందులో దాచిపెడుతుంటారు. వాళ్ళు దొంగతనానికి వెళ్ళినపుడు వేరేవాళ్ళెవరూ ప్రవేశించకుండా ఒక మాయ తలుపును నిర్మించుకుంటారు. ఆ తలుపు వాళ్ళకి మాత్రమే తెలిసిన ఒక మంత్రం చెబితేనే తెలుస్తుంది. ఆలీబాబా చాటు నుంచి వాళ్ళ చెప్పే మంత్రం వినేస్తాడు. దొంగలు అలా వెళ్ళి పోగానే మంత్రం సాయంతో గుహలో ప్రవేశించి తనకు కావలసిన ధనం, నగలు తీసుకుని ఏమీ తెలియనట్లుగా బయటపడతాడు.

తారాగణం

మార్చు
  • ఆలీబాబా గా ఎన్. టి. రామారావు
  • జయలలిత
  • నాగభూషణం
  • సూర్యకాంతం
  • కైకాల సత్యనారాయణ
  • మిక్కిలినేని
  • రాజబాబు
  • రమాప్రభ

పాటలు

మార్చు
  1. అల్లా యాఅల్లా మనిషికి మనిషికి రకరకాలుగా - ఘంటసాల . రచన. సి. నారాయణ రెడ్డి.
  2. చలాకైన చిన్నది బలేబలేగున్నది కన్నుసైగ - సుశీల, ఘంటసాల . రచన: కొసరాజు.
  3. చల్లచల్లని వెన్నెలాయె మల్లెపూల పానుపాయె - జయలలిత
  4. నీలో నేనై, నాలో నీవై, తీయని కలలే కందాము ఎడబాయని జంటగ వుందాము -పి. సుశీల, ఘంటసాల . రచన. సి. నారాయణ రెడ్డి.
  5. భామలో చందమామలో - ఘంటసాల, సుశీల ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలు . రచన. సి. నారాయణ రెడ్డి.
  6. మరీ అంతగా బిడియమైతే మనసు ఆగనంటుంది - ఘంటసాల, సుశీల రచన. సి. నారాయణ రెడ్డి
  7. లెలో దిల్‌బహార్ అత్తర్ దునియా మస్తానా అత్తర్ ఒక్కసారి - ఘంటసాల . రచన. కొసరాజు.
  8. సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు తొలి చిగుళ్ళు వేసే సిగ్గు - సుశీల, ఘంటసాల . రచన. సి. నారాయణ రెడ్డి.
  9. రావోయీ రావోయీ రాలుగాయీ , పి సుశీల, ఘంటసాల, రచన.సి.నారాయణ రెడ్డి
  10. పొట్టి పొట్టి రైకదాన , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి, రచన. సి నారాయణ రెడ్డి
  11. పరిత్రాణాయ సాధునాం (భగవద్గీత నుండి శ్లోకం) ఘంటసాల

మూలాలు

మార్చు
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)