అల్మోరా

ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని పర్వతప్రాంత పట్టణం.
(ఆల్మోరా నుండి దారిమార్పు చెందింది)

అల్మోరా, భారతదేశం, ఉత్తరాఖండ్ రాష్ట్రం, అల్మోరా జిల్లా లోని పర్వతప్రాంత పట్టణం. ఇది కుమావొన్ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో కల ఒక ప్రసిద్ధ హిల్ స్టేషను. 5 కి. మీ. ల పరిధి గల ఈ ప్రదేశం సూయల్ నది, కోసి నది మధ్య ఉంది. ఈ హిల్ స్టేషను సముద్ర మట్టానికి 1651 మీ. ల ఎత్తులో, చుట్టూ అందమైన పచ్చని అడవులు కలిగి వుంటుంది. సా. శ. 15, 16 శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని చాంద్, కాత్యూర్ వంశాలు పరిపాలించాయి.

Almora
Town
Almora City
View of Almora in 2013
Nickname(s): 
Cultural Capital of Kumaon, Heart of Kumaon
Almora is located in Uttarakhand
Almora
Almora
Location in Uttarakhand, India
Almora is located in India
Almora
Almora
Almora (India)
Coordinates: 29°35′50″N 79°39′33″E / 29.5971°N 79.6591°E / 29.5971; 79.6591
Country India
Stateదస్త్రం:..Uttarakhand Flag(INDIA).png Uttarakhand
DivisionKumaon
DistrictAlmora
Established1568
Founded byBalo Kalyan Chand
Government
 • TypeMayor–Council
 • MayorPrakash Joshi[1]
విస్తీర్ణం
 • Total16.60 కి.మీ2 (6.41 చ. మై)
Elevation
1,642 మీ (5,387 అ.)
జనాభా
 (2011)[2]
 • Total35,513
 • జనసాంద్రత2,100/కి.మీ2 (5,500/చ. మై.)
DemonymAlmoran (English) Almoradi(Kumaoni)
Languages
 • OfficialHindi
Sanskrit
 • NativeKumaoni
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
263601[3]
Telephone code91-5962
Vehicle registrationUK-01
Sex ratio1142 /
ClimateAlpine (BSh) and Humid subtropical(Cwb) (Köppen)
Avg. annual temperature−3 నుండి 28 °C (27 నుండి 82 °F)
Avg. summer temperature12 నుండి 28 °C (54 నుండి 82 °F)
Avg. winter temperature−3 నుండి 15 °C (27 నుండి 59 °F)

భౌగోళికం

మార్చు

అల్మోరా ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో 29°35′50″N 79°39′33″E / 29.5971°N 79.6591°E వద్ద ఉంది. ఇది జాతీయ రాజధాని న్యూఢిల్లీకి ఈశాన్యంలో 365 కిమీ, రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌కు ఆగ్నేయంగా 415 కిమీ దూరంలో ఉంది. ఇది కుమావోన్‌ రెవెన్యూ డివిజన్ ఉంది. కుమావోన్ పరిపాలనా ప్రధాన కార్యాలయం అయిన నైనిటాల్‌కు ఉత్తరాన 63 కిమీ దూరంలో ఉంది. ఇది సగటు సముద్ర మట్టానికి 1,604 మీ (5,262 అడుగులు) ఎత్తులో ఉంది.

అల్మోరా గుర్రపు జీను ఆకారపు కొండ ఆకారంలో మధ్య హిమాలయ శ్రేణిలోని కుమావోన్ కొండల [4] దక్షిణ అంచున ఉన్న ఒక శిఖరంపై ఉంది. శిఖరం తూర్పు భాగాన్ని తాలిఫత్ అని పిలుస్తారు [5] పశ్చిమ భాగాన్ని సెలిఫాట్ అని పిలుస్తారు.[4] అల్మోరా మార్కెట్ శిఖరం పైభాగంలో ఉంది, ఇక్కడ ఈ రెండు, తాలిఫత్, సెలిఫాట్ సంయుక్తంగా ముగుస్తాయి.[4] దీని చుట్టూ దట్టమైన పైన్, దేవదార్, ఫిర్ చెట్లతో కూడిన అడవులు ఉన్నాయి. నగరం పక్కనే కోషి (కౌశికి), సుయల్ (సల్మలే) నదులు ప్రవహిస్తున్నాయి. మంచుతో కప్పబడిన హిమాలయాలు నేపథ్యంలో కనిపిస్తాయి.

గణాంకాలు

మార్చు
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
1871 6,260—    
1881 7,390+18.1%
1891 7,826+5.9%
1901 8,596+9.8%
1911 10,560+22.8%
1921 8,359−20.8%
1931 9,688+15.9%
1941 10,995+13.5%
1951 12,757+16.0%
1961 16,602+30.1%
1971 20,881+25.8%
1981 22,705+8.7%
1991 28,051+23.5%
2001 32,358+15.4%
2011 35,513+9.8%
Source: [2][6][7][8][9]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం అల్మోరాలో 35,513 మంది జనాభా ఉన్నారు, అందులో 18,306 మంది పురుషులు, 17,207 మంది స్త్రీలు ఉన్నారు..[2]: 20  మొత్తం జనాభాలో, అల్మోరా పురపాలక సంఘం జనాభా 34,122,[10] కాగా, అల్మోరా కంటోన్మెంట్ బోర్డు జనాభా 1,391.[11] Tమొత్తం జనాభాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3,081, ఇది అల్మోరా మొత్తం జనాభాలో 8.67% శాతం ఉంది. అల్మోరా నగరం అక్షరాస్యత రేటు 86.19%,ఇది  రాష్ట్ర సగటు 78.82% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత దాదాపు 88.06%, స్త్రీల అక్షరాస్యత 84.21%.  2001 భారత జనాభా లెక్కల ప్రకారం అల్మోరాలో 32,358 జనాభా ఉంది.[12]

అల్మోరా నగర మొత్తం జనాభాలో హిందూ సమాజ జనాభా 90.84% మంది ఉన్నారు. ఇది అల్మోరాలో మెజారిటీ మతం. ఇస్లాంను 7.54% మంది ప్రజలు ఆచరిస్తున్నారు ఇది అతిపెద్ద మైనారిటీ మతం. సిక్కు మతం, క్రైస్తవం, బౌద్ధమతం వంటి ఇతర మతాలను కూడా తక్కువ సంఖ్యలో ప్రజలు ఆచరిస్తున్నారు. హిందీ, సంస్కృతం రాష్ట్ర అధికార భాషలు కాగా కుమావోని మెజారిటీ మాతృభాష.

పర్యాటక ఆకర్షణలు

మార్చు

పర్యాటక ఆకర్షణ ప్రదేశాలలో మంచుతో నిండిన హిమాలయ శిఖరాలను అల్మోర కొండల నుండి చూసి ఆనందించవచ్చు. ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది.ఇక్కడ కాసర్ దేవి ఆలయం, నందా దేవి ఆలయం, చితి ఆలయం, కాతర్మాల్ సూర్య ఆలయం మొదలైనవి ఇక్కడ కల కొన్ని మత సంబంధిత క్షేత్రాలు.

నందాదేవి ఆలయం

మార్చు

ఇక్కడ ఉన్న ప్రాచీనమైన నందా దేవి ఆలయం ముఖ్యమైంది. ఈ ఆలయం కుమావొనీ శిల్ప శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయం లోని దేవతను చంద్రవంశ రాజులు పూజించారని విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం భక్తులతో దేవాలయం కిట కిట లాడుతుంది.

కాసర్ దేవి ఆలయం

మార్చు

అల్మోరాలో కాసర్ దేవి ఆలయం కూడా అల్మోరాకు 5 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని 2 వ శతాబ్దంలో నిర్మించారు. స్వామి వివేకానందుడు తన తపస్సును ఇక్కడ చేసారని విశ్వసించబడుతుంది.

సూర్యాస్తమయం - సూర్యోదయం

మార్చు

పర్యాటకులు ఇక్కడ అందమైన సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు బ్రైట్ ఎండ్ కార్నర్ నుండి చూడవచ్చు. సిమ్టోల, మర్టోల ప్రదేశాలు పిక్నిక్ కు బాగుంటాయి.

జింకలపార్కు

మార్చు

అల్మోరా పట్టణం నుండి 3 కి. మీ.ల దూరంలో జింకల పార్కు ఉంది. ఇందులో!అనేక లేళ్ళు, చిరుతలు హిమాలయ నల్ల ఎలుగుబంటి వంటివి ఉన్నాయి.

సింటోలా

మార్చు

అల్మోరాకు 3 కి.మీ.ల దూరంలో సింటోలా ఉంది. సింటోలా అనేది గ్రానైట్ హిల్, డైమండ్ మైనింగ్ సెంటర్. ఇక్కడి నుండి సుందరమైన పైన్, దేవదార్ చెట్లతో కూడిన పర్వత శ్రేణులను చూడవచ్చు. అల్మోరా లోని పర్యాటకాకర్షణ ప్రాంతాలలోఇది ఒకటి. ఇది హార్స్ షూ రిజ్ కు ఎదురు భాగంలో వుంటుంది.

పర్వతారోహణ

మార్చు

ఉత్తారాంచల్ రాష్ట్రంలోని పలు పట్టణాలలో ఉన్నట్లు ణ అల్మోరాలో కూడా పర్వతారోహణ ( ట్రెక్కింగ్) ఒక పర్యాటాకార్షణగా ఊంది. అల్మోరా నుండి సుమారు 5 కి.మీ.ల దూరంలో అల్మోర పర్వత శ్రేణుల దృశ్యాలు కనపడతాయి. అల్మోర నుండి జగేస్వర్‌కు చక్కని మార్గం ఉంది. కుమావొనీ గ్రామాల మీదుగా ఈ మార్గంలో పర్వతారోహకులు పయనిస్తుంటారు. ఈ పర్వతమార్గంలో జగేశ్వర్ ఆలయసమూహం, వ్రిద్ జగేశ్వర్‌ ఆలయాలు ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ నుండి కాసర్ దేవి టెంపుల్‌కు కూడా వెళ్ళవచ్చు. పర్వతారోహణకు అక్టోబరు నుండి మార్చి వరకూ అనుకూలం. సాహసికులకు పిండారీ పర్వతమార్గం అనుకూలమైనది. ఈ మార్గం సుందరమైన అడవులు, లోయల గుండా వెళుతుంది. నంద దేవి, నందాకోట్ పర్వతాల మధ్య పిండారీ గ్లేసియర్ ఉంది.

లాల్ బజార్

మార్చు

అల్మోరలో ఉన్న లాల్ బజార్ ఒక షాపింగ్ ప్రాంతం. రుచికరమైన స్వీట్‌లు, అనేక అలంకరణ వస్తువులూ ఇక్కడ అనుకూలమైన ధరలలో లభ్యమౌతాయి. ఇక్కడ కుందేలు చర్మంతో తయారు చేయబడి వెచ్చగా వుండే చక్కని దుస్తులు లభ్యమౌతాయి.

మర్టోలా

మార్చు

అల్మోరాకు 10 కి.మీ.ల దూరంలో ఉన్న ఒక విహార ప్రదేశం మర్టోలా. ఇక్కడ పచ్చని అడవులు, తోటలు ఉన్నాయి. ఇక్కడ అనేక మంది విదేశీయులు తమ నివాసాలను ఏర్పరచుకున్నారు. ఈ ప్రదేశానికి పనువనౌళ నుండి కాలి నడకన చేరాలి.

గోవింద వల్లభపంత్ శాంక్చ్యురీ , మ్యూజియం

మార్చు

అల్మోరాలో గోవింద్ వల్లభ పంత్ మ్యూజియం, బిన్సార్ వన్యప్రాణి అభయారణ్యం (వన్యప్రాణుల అభయారణ్యం) ఉంది. ఇక్కడ పర్వతారోహణ, మౌంటెన్ బైకింగ్ పర్యాటకులను ఆనందపరుస్తుంటాయి. ఈ మ్యూజియం అల్మోర లోని మాల్ రోడ్ లో ఉంది. దీనిలో ఈ ప్రాంత సంస్కృతి, చరిత్ర, కు సంబంధిన వస్తువులు, పురావస్తు వస్తువులు ప్రదర్శిస్తారు. కత్యూరి, చాంద్ వంస్తులకు చెందిన విలువైన వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. పురాతన పెయింటింగ్ లు కూడా చూడవచ్చు. ఈ మ్యూజియం ఉ.10.30 గం నుండి సా.4.30 గం వరకు తెరచి వుంటుంది.

జింకలపార్క్

మార్చు

అల్మోరా లోని ప్రధాన ఆకర్షణ అయిన డీర్ పార్క్ అల్మోరకు 3 కి.మీ.ల దూరంలో ఉంది. అంతేకాక ఇక్కడ నారాయణ్ తివారి దేవి ఆలయం కూడా ఉంది. దీని చుట్టూ పైన్ చెట్లు ఉంటాయి. పర్యాటకులు ఇక్కడ డీర్, చిరుత, హిమాలయ నల్ల ఎలుగుబంటులను చూడవచ్చు. సాయంత్రాలు విశ్రాంతి నడకలు చేయవచ్చు.

బ్రైట్ ఎండ్ కార్నర్

మార్చు

బ్రైట్ ఎండ్ కార్నర్ అనే సుందర ప్రదేశం అల్మోరకు 2 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ నుండి మంచు శిఖరాల మధ్య జరిగే సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆనందించవచ్చు. చంద్రోదయం కూడా ఆనందించవచ్చు. ఈ ప్రదేశానికి లార్డ్ బ్రిటన్ పేరు పెట్టారు. ఇక్కడ మాల్ రోడ్ మొదలవుతుంది. ఇక్కడే శ్రీ రామకృష్ణ కుటీర్ ఆశ్రమం ఉంది. ఇక్కడకు ధ్యానం కొరకు ఏప్రిల్ నుండి జూన్, సెప్టెంబరు నుండి నవంబరు వరకూ వద్తుంటారు. ఇక్కడ వివేకానంద గ్రంథాలయం, ఒక మెమోరియల్ కూడా ఉన్నాయి. హిమాలయ పర్యటనలో స్వామి వివేకానంద ఈ ప్రదేశంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు.

బిన్సార్ వన్యమృగ అభయారణ్యం

మార్చు

బిన్సార్ వన్యప్రాణి సంక్చురి అల్మోర టవున్ కు 30 కి.మీ.ల దూరంలో ఉంది.. ఈ అభయారణ్యం సముద్ర మట్టానికి 900 నుండి 2500 మీ.ల ఎత్తున 45.59 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. ఎన్నో రకాల జంతువులకు ఇది సహజ నివాసంగా ఉంది. దీనిలో 200 రకాల పక్షులు,, వివిధ జాతుల మొక్కలు కూడా కూడా ఉన్నాయి.

ప్రయాణ వసతులు

మార్చు

ఈ ప్రదేశానికి వాయు, రైలు, రోడ్ మార్గాలలో తేలికగా చేరవచ్చు. పంత్ నగర్ ఎయిర్ పోర్ట్, కతోగోడం రైల్వే స్టేషను అల్మోరకు సమీపం. ఈ ప్రదేశ సందర్శనకు వేసవి అనుకూలం.

మూలాలు

మార్చు
  1. List of Elected Mayor/Chairpersons of Uttarakhand (PDF). Lucknow: RCUES. 2008. Retrieved 31 August 2016.
  2. 2.0 2.1 2.2 District Census Handbook (PDF). Dehradun: Directorate of Census Operations, Uttarakhand. p. 8. Retrieved 31 August 2016.
  3. "Almora Pin Code". pin-code.net. Archived from the original on 2 నవంబరు 2020. Retrieved 2 November 2020.
  4. 4.0 4.1 4.2 Dehradun, NIC, Uttarakhand State Unit. "About us: District of Almora, Uttarakhand, India". almora.nic.in. Archived from the original on 3 September 2017. Retrieved 1 September 2017.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  5. "Talifat Almora". A1 Tour and travels. Archived from the original on 2011-04-30.
  6. District Census Handbook, 1951-61. Census of India.
  7. Pradesh, India Director of Census Operations, Uttar; Sinha, Dharmendra Mohan (1971). District Census Handbook: Series 21, Uttar Pradesh (in ఇంగ్లీష్).{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  8. GISTNIC, Almora. 1991.
  9. Almora: A Gazetteer (1911) (in ఇంగ్లీష్). SSDN Publishers & Distributors. 2014. ISBN 9789381176962.
  10. "Almora City Population Census 2011 - Uttarakhand". www.census2011.co.in. Retrieved 1 September 2016.
  11. "Almora City Population Census 2011 - Uttarakhand". www.census2011.co.in. Retrieved 2 September 2016.
  12. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

వెలుపలి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అల్మోరా&oldid=4344269" నుండి వెలికితీశారు