పురుషుడు
పురుషుడు, (బహువచనం పురుషులు) ఒక మగ మనిషి. ఒక వ్యక్తి వయోజన పురుషుడు.[1] [2]యుక్తవయస్సు రాకముందు, మగ మానవుడిని బాలుడు (మగ బిడ్డ లేదా కౌమారదశ) అని పిలుస్తారు.భార్యాభర్తలలో పురుషుణ్ణి భర్త అంటారు. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. మగ పిల్లల్ని బాలుడు, బాలురు అంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఉదాహరణకు పురుషుల హక్కులు మొదలైన వాటిలో అన్ని వయసుల వారికి ఈ పదం వర్తిస్తుంది. కుటుంబ వ్యవస్థలో పురుషుని ఇంటి పేరుతోనే పిల్లల పేరు నమోదు చేస్తారు. పూర్వపు రాజరిక వ్యవస్థలో రాజు పెద్ద కొడుకు మాత్రమే అతని తర్వాత సింహాసనాన్ని అధిరోహించడానికి అర్హుడు.
భాషా విశేషాలు
మార్చుతెలుగు భాషలో పురుషునికి సంబంధించిన కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తుల్ని మహాపురుషుడు, పురుషోత్తముడు అని పిలుస్తారు. తెలుగు వ్యాకరణంలో పురుషము అనగా క్రియల మీది విభక్తుల సంజ్ఞ. ప్రథమపురుషము (the third person), మధ్యమపురుషము (the second person), ఉత్తమపురుషము (the first person). రతి క్రియలో పురుషాయితము అనగా స్త్రీ పురుషుని పాత్ర పోషించడం. మనసులోని కోరికలకు సంబంధించిన పురుషార్థములు నాలుగు: ధర్మార్థకామమోక్షములు
జననేంద్రియ వ్యవస్థ
మార్చుపురుషులలో జననేంద్రియాలు ప్రత్యుత్పత్తి అవయవాలు. ఇవి శిశ్నం, వృషణాలు, శుక్ర వాహికలు, పౌరుష గ్రంధి. వీని ముఖ్యమైన పని వీర్యాన్ని ఉత్పత్తిచేసి, వాటిలోని వీర్యకణాలను సంభోగం సమయంలో, స్త్రీ జననేంద్రియాలతో ప్రవేశపెట్టడం. ఇవి తర్వాత గర్భాశయంలో అండంతో ఫలదీకరణం చెంది గర్భం వస్తుంది.
మానవ పురుషుని కారియోటైపులో 21 జతల ఆటోసోములు, ఒక జత సెక్స్ క్రోమోసోములు ఉంటాయి. పురుషులలో ఒక X మరియొక Y క్రోమోసోములు ఉంటాయి. దీనిని 46, XY గా తెలుపుతారు.పురుషులకు స్త్రీలలో వలె వ్యాధులన్నీ వస్తాయి. అయితే కొన్నింటి వలన పురుషుల జీవితకాలం స్తీలకన్నా కొంచెంతక్కువ.
సెక్స్ హార్మోన్లు
మార్చుక్షీరదాలలో టెస్టోస్టీరాన్ హార్మోను పిండం మీద ప్రభావితం చేసి అది వృషణాలుగా అభివృద్ధి చెందేటట్లు చేస్తాయి. ఉల్ఫియన్ నాళాన్ని శిశ్నంగా మారుస్తుంది. ఏంటీ ముల్లేరియన్ హార్మోన్ ముల్లేరియన్ నాళం అభివృద్ధిని నిరోధిస్తుంది.పురుషులలో పీయూష గ్రంధి నుండి విడుదలయ్యే గొనడోట్రోఫిన్స్, టెస్టోస్టీరాన్ వీర్యకణాల అభివృద్ధిని ప్రేరేపిస్తుంది.
పురుషవాదం
మార్చుపురుషవాదం (ఆంగ్లం: Masculism లేదా masculinism) అనునది పురుషుల హక్కుల/అవసరాలకి అనుగుణంగా ఉండే వాదం. ఈ వాదానికి నిబద్ధులై ఉండటం, ఇటువంటి అభిప్రాయాలని, విలువలని, వైఖరులని వగైరా ప్రచారం చెయ్యటం, లేదా స్త్రీని మినహాయించి పురుషాధిక్యత చుట్టూ కేంద్రీకరించబడి ఉన్న విధానం పురుషవాదం క్రిందకు వస్తాయి.
మూలాలు
మార్చు- ↑ "man". dictionary.cambridge.org. Retrieved 2021-10-01.
- ↑ "Definition of MAN". www.merriam-webster.com. Retrieved 2021-10-01.
ఇవి చదవండి
మార్చు- Andrew Perchuk, Simon Watney, Bell Hooks, The Masculine Masquerade: Masculinity and Representation, MIT Press 1995
- Pierre Bourdieu, Masculine Domination, Paperback Edition, Stanford University Press 2001
- Robert W. Connell, Masculinities, Cambridge : Polity Press, 1995
- Warren Farrell, Myth of Male Power Berkley Trade, 1993 ISBN 0-425-18144-8
- Michael Kimmel (ed.), Robert W. Connell (ed.), Jeff Hearn (ed.), Handbook of Studies on Men and Masculinities, Sage Publications 2004