ఆల్‌రౌండర్ టి. ప్రభాకర్ దర్శకత్వంలో 1998లో విడుదలైన హాస్యభరిత చిత్రం. ఇందులో రాజేంద్రప్రసాద్, సంఘవి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, పల్లి కేశవరావు, మండవ సురేష్ కలిసి సూర్యతేజ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించారు. వీణాపాణి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది.[1]

ఆల్‌రౌండర్
దర్శకత్వంటి. ప్రభాకర్
రచననడిమింటి నరసింహారావు (మాటలు)
నిర్మాత
  • నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు
  • పల్లి కేశవరావు
  • మండవ సురేష్
తారాగణంరాజేంద్ర ప్రసాద్,
సంఘవి
ఛాయాగ్రహణంసి. విజయ్ కుమార్
కూర్పుబి. ఆర్
సంగీతంవీణాపాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
జూలై 27, 1998 (1998-07-27)
దేశంభారతదేశం
భాషతెలుగు

బాలరాజు పాములు ఆడించుకుంటూ పొట్టపోసుకునే వ్యక్తి. రమ్య ధనవంతుడైన బాపినీడు కూతురు. బాలరాజుకు రమ్యకు సరదాగా ఒక గొడవ జరుగుతుంది. రమ్య అతని మీద కోపంతో కక్ష తీర్చుకోవాలని అనుకుంటుంది. ఆమె బాలరాజుతో ఒక పందెం కాస్తుంది. ఒకవేళ బాలరాజు ఆరు గంటలపాటు ఆపకుండా పామును ఆడించగలిగితే అతన్ని పెళ్ళి చేసుకుంటాననీ, లేకపోతే బాలరాజు ఆమె దగ్గర సేవకుడిగా పనిచేయాలని చెబుతుంది. పందెంలో బాలరాజు గెలుస్తాడు. రమ్య తెలివిగా అతన్ని తన తండ్రి దగ్గరికి పంపిస్తుంది. బాపినీడు అతన్ని అవమానించి పంపేస్తాడు. అవమానానికి గురైన బాలరాజు రమ్యకు ఎలాగైనా గుణపాఠం నేర్పాలని తనను తానే మార్చుకుని ఆల్ రౌండర్ గా అవతారం ఎత్తుతాడు. ప్రతి అవతారంలో తానెవరో బయట పెట్టకుండా ఆమె తనను ప్రేమించేలా చేసుకుంటాడు. కానీ రమ్య నిజం తెలుసుకుని ఎవరైనా ధనవంతుడిని అపహరిస్తే తనను పెళ్ళి చేసుకుంటానని చెబుతుంది. ఆమెను ఆటపట్టించడానికి బాపినీడునే అపహరిస్తాడు బాలరాజు. కానీ బాపినీడు సహాయకుడైన జె. పి నిజంగానే అతన్ని అపహరించి అతని దగ్గరున్న సెల్ ఫోన్లోని ఆస్తి వివరాలు సంగ్రహించాలని చూస్తుంటాడు. పోలీసులు బాలరాజు వెంటపడతారు. అతని దగ్గరుండే పాము ప్రతిసారి అతన్ని కాపాడుతూ ఉంటుంది. చివరికి బాలరాజు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని రమ్యను పెళ్ళి చేసుకుంటాడన్నది మిగతా కథ.

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: టీ.ప్రభాకర్

నిర్మాతలు: నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు,పల్లి కేశవరావు, మండవ సురేష్

నిర్మాణ సంస్థ: సూర్యతేజ మూవీ మేకర్స్

సంగీతం: వీణాపాణి

సాహిత్యం: పోలిశెట్టి,సిరివెన్నెల,సామవేదం, శ్రీహర్ష .

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ప్రణవ్ కుమార్, శ్రీరామ్,రాజేష్, అనూరాధ, స్వర్ణలత, మనో.

మాటలు: నడిమింటి నరసింహారావు

కూర్పు: బి ఆర్.

ఫోటోగ్రఫి: సి విజయ్ కుమార్

విడుదల:1998 జూలై 27 .


పాటల జాబితా

మార్చు

1.ఎప్పుడెప్పుదన్నది వయ్యారి హంస , రచన: సామవేదం షణ్ముఖశర్మ, గానం.శ్రీరామ్,రాజేష్, అనూరాధ

2.అత్తరు సాయిబు బాగుందమ్మా, రచన: పోలిశెట్టి, గానం.ప్రణవ్ కుమార్ బృందం

3.ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ ఆల్ ఇన్ వన్ , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, బృందం

4.గోల్కొండ చౌరస్తాలో నిన్ను చూసి , రచన: పోలిశెట్టి, గానం.స్వర్ణలత, మనో బృందం

5.భళిరా భళిరా చెలరేగాలిరా దిగరా దిగరా, రచన: శ్రీహర్ష, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

మార్చు
  1. "All Rounder (Review)". The Cine Bay. Archived from the original on 2020-07-10. Retrieved 2020-07-08.

. 2.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.