రత్న సాగర్ తెలుగు చలనచిత్ర, టెలివిజన్ నటి.[2][3] ఎక్కువగా సహాయ నటి పాత్రలు పోషించింది. తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది.

రత్న సాగర్
జననం
రత్న సాగర్

హైదరాబాదు
విద్యబి.ఏ[1]
వృత్తినటి, డబ్బింగ్ ఆర్టిస్టు
క్రియాశీల సంవత్సరాలు1987–ప్రస్తుతం
జీవిత భాగస్వామివిద్యా సాగర్
పిల్లలునీహారిక
హారిక
తల్లిదండ్రులునారాయణ స్వామి
లక్ష్మీబాయి

జీవితంసవరించు

రత్న సాగర్ హైదరాబాద్ లో జన్మించింది. తండ్రి ఎం. నారాయణ స్వామి, తల్లి లక్ష్మీ భాయి. ఆమె భర్త పేరు విద్యాసాగర్. ఆమెకు నీహారిక, హారిక అనే ఇద్దరు కూతుర్లున్నారు. ఆమె ప్రస్తుతం హైదరాబాదు లో నివసిస్తుంది. ఆమె మాతృభాష తెలుగు. హిందీ, ఇంగ్లీషు, తమిళం మాట్లాడగలదు. ఆమె బి.ఏ చదివింది. 2011 లో కారాలు మిరియాలు సినిమాకు గాను ఉత్తమ హాస్యనటిగా నంది పురస్కారం లభించింది.[4]

నటనసవరించు

ఆమె నాటకరంగంలో విశేషమైన అనుభం ఉంది. సుమారు 100 నాటకాలు, 3000 దాకా ప్రదర్శనలిచ్చింది. ఆమె 1987 లో జంధ్యాల సినిమా వివాహ భోజనంబు ద్వారా సినీరంగంలోకి ప్రవేశించింది. ఈ సినిమాలో ఆమె వీరభద్రరావు భార్యగా నటించింది. చూపులు కలిసిన శుభవేళ సినిమాలో బ్రహ్మానందం తల్లిగా నటించింది. 2011 లో వచ్చిన కారాలు మిరియాలు సినిమాలో నటనకు గాను ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డునందుకుంది.[3][4]

టీవీ సీరియళ్ళలో కూడా నటించింది. ఈటీవీలో ప్రసారమైన అందం అనే సీరియల్లో నటించింది.

సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. మా. "తెలుగు సినీ నటి రత్నా సాగర్ ప్రొఫైలు". maastars.com. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. Retrieved 21 September 2016.
  2. నవతెలంగాణ, మానవి (11 March 2018). "సినీ కుటుంబానికే బామ్మగా..!". వి. యశోద. Retrieved 14 March 2018.
  3. 3.0 3.1 "తెలుగు సినీ నటి రత్న సాగర్". nettv4u.com. Retrieved 19 September 2016.
  4. 4.0 4.1 "Nandi Awards presentation today". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 21 September 2016.